ఆర్మీకి చెందిన ఓ ట్రక్కు లోయలోకి జారిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్ము నుంచి శ్రీనగర్ ప్రయాణిస్తున్న జవాన్ల ట్రక్కు బ్యాటరీ చెష్మా వద్ద 600 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
చనిపోయిన వారిలో అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మన్ బహదూర్గా అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్, సివిల్ క్యూఆర్టీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రాంబన్ లోయలో గతంలోనూ అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.