Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

జమ్ము కశ్మీర్‌లో విరుచుకుపడ్డ ఉగ్రమూకలు : 27 మంది పర్యాటకులు మృతి

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 22, 2025, 09:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంత్‌నాగ్ జిల్లాలో మినీ స్విట్జర్లాండుగా పేరున్న బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన పర్యాటకులపై సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ముష్కరులు అతి సమీపం నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. అటవీ ప్రాంతం నుంచి సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూక 40 మంది పర్యాటకులపై కాల్పులు జరిపారు. కొందరు పర్యాటకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రమూకల కాల్పులతో ఆహ్లాదకర పర్యాటక ప్రాంతం రక్తసిక్తమైంది. మృతదేహాలతో భీతావహ పరిస్థితి నెలకొంది. గాయపడ్డ వారిని కాపాడాలంటూ పర్యాటకులు హాహాకారాలు చేశారు. కాలినడకన, గుర్రాలపై చేరుకునే ప్రాంతం కావడంతో గాయపడ్డవారిని తరలించడం కష్టంగా మారింది. సైన్యం రంగంలోకి దిగింది. గాయపడ్డ వారిని హెలికాప్టర్ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాద ఘటన విషయం తెలియగానే జెడ్డా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. విషయం తెలియగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో ఘటనా స్థలానికి వెళ్లారు. జమ్ము కశ్మీర్ లెప్ట్‌నెంట్ గవర్నర్ కూడా ఘటనా స్థలానికి వెళ్లారు.

ఉగ్ర మూకలను మట్టుబెట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది. అణువణువూ గాలింపు చేపట్టారు. ఉగ్రమూకల కాల్పుల శబ్దం వినిపించగానే బైసరన్ ప్రాంతానికి సైనిక బలగాలు చేరుకున్నాయి. గాయపడ్డ వారిని హెలికాఫ్టర్లు, గుర్రాల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. కాల్పుల ఘటన తరవాత పహల్గాం వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పర్యాటకులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 36 రోజుల పాటు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొనే అవకాశముంది. అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం మార్గంలోనే 48 కి.మీ మీర ఉండగా, 14 కి.మీ గండేర్బల్ జిల్లాలో ఉంది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రదాడి జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.

Tags: andhratodaynewsjammu kashmir attackjammu kashmir terror attackjammu kashmir terrorist attackjammu terror attackkashmir terror attackpahalgam attackpahalgam terror attackpehalgam terror attackSLIDERterror attack in jammuterror attack in jammu kashmirterror attack in pahalgamTerrorist AttackTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.