Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ముర్షీదాబాద్ హతుల కుటుంబాలకు 10లక్షల పరిహారం

Phaneendra by Phaneendra
Apr 16, 2025, 05:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షీదాబాద్‌లో జరిగిన హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లిస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఆ సంఘటన మీద నివేదిక సమర్పించాలంటూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తానని ఆమె చెప్పారు.

ముర్షీదాబాద్‌లో ముస్లిములు పాల్పడిన హింసాకాండలో ముగ్గురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్ళు, దుకాణాలూ ధ్వంసమైపోయాయి. పోలీసులు చేతులు కట్టేసుకుని కూర్చోడంతో హిందువుల జీవితాలు ఛిన్నాభిన్నమైపోయాయి. ఆ సంఘటనకు సంబంధించి మమతా బెనర్జీ ఇప్పుడు కంటితుడుపు చర్యలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం చెల్లిస్తామని మమతా బెనర్జీ చెప్పారు. ఇళ్ళు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఇల్లు కేటాయిస్తామన్నారు. దుకాణాలు ధ్వంసమైన వారికి తగిన పరిహారం చెల్లిస్తామన్నారు. ఇవాళ కోల్‌కతా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఏప్రిల్ 11 శుక్రవారం మసీదులో నమాజు పూర్తయిన వెంటనే ముర్షీదాబాద్‌లో ముస్లిములు రోడ్ల మీదకు వచ్చారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడ్డారు. హిందువులపై ఏకపక్షంగా దాడులు చేసారు. వారి ఇళ్ళను, దుకాణాలనూ ధ్వంసం చేసారు. మంటలు ఆర్పడానికి నీళ్ళు దొరక్కుండా చేయడం కోసం బోరింగ్ పంపులను సైతం ధ్వంసం చేసారంటే ఎంత ప్రణాళికాబద్ధంగా దాడులు చేసారో అర్ధమవుతుంది.

ముర్షీదాబాద్ హింసాకాండకు సంబంధించి ఇప్పటివరకూ 150 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు వెల్లడించారు. ముర్షీదాబాద్ జిల్లాలోని షంషేర్‌గంజ్, ధూలియా, తదితర ప్రభావిత ప్రాంతాల్లో తగినంత మంది పోలీసు బలగాలను మోహరించామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అక్కడ పరిస్థితి అదుపులో ఉందని వివరించారు.

ఇంత జరిగినా, దానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఇప్పుడు చేయవలసిన అవసరమేముందని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు తెలిసి కూడా ఎందుకు కేంద్రం తొందర పడిందని నిలదీసారు. ఆ చట్టం వల్ల మంచి జరిగితే సంతోషిస్తాను అంటూనే, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే అజెండాగా కేంద్రం పాలిస్తోందని ఆరోపించారు. ‘‘ముర్షీదాబాద్ అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ హస్తం ఉందంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు అనుమానిస్తున్నాయని తెలిసింది. అదే నిజమైతే ఆ అల్లర్లకు కేంద్రమే బాధ్యత వహించాలి, ఎందుకంటే సరిహద్దుల దగ్గర కాపలా ఉన్నది మా పోలీసులు కాదు, బీఎస్ఎఫ్ జవాన్లే కదా’’ అంటూ కుతర్కాలు లాగారు.

Tags: Compensation to DeceasedHindus Houses VandalisedMamata BanerjeeMurshidabad ViolenceTOP NEWSWest Bengal
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.