Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

ముస్లిముల మూకదాడులతో ముర్షీదాబాద్‌ నుంచి పారిపోతున్న హిందువులు

Phaneendra by Phaneendra
Apr 14, 2025, 06:32 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పశ్చిమ బెంగాల్ ముర్షీదాబాద్ జిల్లా జంగీపూర్ సబ్‌డివిజన్ షంషేర్‌గంజ్ బ్లాక్‌లోని ధూలియా పట్టణం ఏప్రిల్ 11, 12 తేదీల్లో గజగజా వణికిపోయింది. హిందువులను లక్ష్యం చేసుకుని ముస్లిం మూకలు హింసాత్మక దాడులకు పాల్పడ్డాయి. ప్రాణభయంతో తల్లడిల్లిపోయిన వందలాది హిందూ కుటుంబాలు బతికుంటే చాలుననే ఉద్దేశంతో ఆ ఊరిని వదిలిపెట్టి పారిపోయాయి.  

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దాడులకు పాల్పడిన వారిని నియంత్రించవలసిన విధిని విస్మరించింది. దానికి బదులు మౌనాన్ని ఆశ్రయించింది, నిశ్చేష్టురాలై ఏ చర్యలూ తీసుకోకుండా ఉండిపోయింది. దాంతో ముస్లిం మూకలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.   

 

పడవల్లో గంగను దాటుకుని వలసపోయిన హిందువులు:

వేలాది హిందువులు ధూలియా పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయారు. పడవల్లో గంగానదిని దాటి మాల్దా జిల్లా కాలియాచక్ సబ్‌డివిజన్ పార్‌లాల్‌పూర్ ప్రాంతానికి వెళ్ళిపోయారు. వందల సంఖ్యలో హిందువులు నదిని దాటి పారిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాళ్ళు కేవలం ఏదో పని వెతుక్కుంటూ వలస పోతున్న వారు కాదు. తమ సొంత భూమి మీద శరణార్థులుగా మారిపోయిన అభాగ్యులు. ముస్లిం మూకలు బాంబులు వేసి, మంటలు పెట్టి, చంపేస్తామని బెదిరించడంతో వేరే దారి లేక పారిపోయిన వారు.

‘‘మేం మా ప్రాణాలు కాపాడుకుంటున్నాం’’ అని ఒక వ్యక్తి చెప్పాడు. మరో స్థానిక వ్యక్తి వారికి ‘‘ఏం గాభరా పడకండి. మీకు తిండికీ, ఉండడానికీ ఏర్పాట్లు జరిగాయి’’ అని మరో వ్యక్తి హామీ ఇచ్చాడు. హృదయ విదారకంగా ఉన్న ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది.

 

40-50 పడవల్లో వేలమంది తరలింపు:

సామూహిక వలసలను వీడియో తీస్తున్న వ్యక్తి, తాను చూసినంత వరకూ కనీసం 40 నుంచి 50 పడవలు వేలాది హిందువులను సురక్షిత తీరాలకు చేర్చాయని చెప్పాడు. పెద్దవయసు మహిళలు హృదయ విదారకంగా రోదిస్తున్నారు. ఊచకోతను తప్పించుకుని ప్రాణాలతో బతికుండడం కోసం తమ ఇళ్ళను వదిలిపెట్టి ఎలా పారిపోయారో చెబుతుంటే దుఃఖంతో వాళ్ళ గొంతులు పూడుకుని పోయాయి.

‘‘వాళ్ళు మా ఇళ్ళు అన్నింటినీ తగలబెట్టేసారు’’ అని ఒక మహిళ చెప్పింది. ‘‘కేవలం హిందువుల ఇళ్ళను మాత్రమే తగలబెట్టారు. ముస్లింల ఇళ్ళను కనీసం తాకనైనా తాకలేదు’’ అని మరొక మహిళ వివరించింది.  

 

దురుద్దేశపూర్వకంగా, హిందువులనే లక్ష్యంగా చేసుకొన్న దాడులు:

ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన హింసాకాండ కాదు. సావధానంగా ప్రణాళిక వేసి, సమన్వయంతో చేసిన దాడి. ఏప్రిల్ 11 శుక్రవారం జుమ్మా నమాజ్ తర్వాత సూతీ, షంషేర్‌గంజ్ ప్రాంతాల్లోనుంచి ముస్లిములు మందలు మందలుగా బైటకు వచ్చారు. పార్లమెంటు ఈమధ్యనే పాస్ చేసిన వక్ఫ్ సవరణల చట్టానని వ్యతిరేకించడం అనే పేరుతో వారు రోడ్లెక్కారు. కానీ అది ఏ క్షణంలోనూ నిరసన ప్రదర్శనలా ఉండలేదు. హిందువులపై దాడి చేయడానికి, వారి ఆస్తులను దోచుకోడానికి, వారిని వారి స్వస్థలాల నుంచి తరిమికొట్టడానికీ వారు తీసుకున్న అవకాశమది.   

ఒక మహిళ ఏడుస్తూ చెప్పింది ‘‘మోదీ వక్ఫ్ బిల్లు పాస్ చేసాడు, కాబట్టి ఇక్కడ ఇంక హిందువులు ఎవరూ ఉండడానికి వీల్లేదు అని వాళ్ళు మమ్మల్ని బెదిరించారు’’.

 

దుకాణాల లూటీ, దేవాలయాల ధ్వంసం, ఆంబులెన్స్‌కు అగ్గి:

ఆ ప్రాంతం ఏదో యుద్ధం జరిగిన ప్రదేశంలా ఉంది. ఒక హిందూ కుటుంబం నడుపుతున్న ‘శుభ స్మృతి హోటల్’ను దోచుకుని ధ్వంసం చేసారు. ‘‘వాళ్ళు మా సామాన్లు, వస్తువులు అన్నీ పట్టుకుపోయారు. డబ్బు కూడా లాక్కుని పోయారు. ఇంకేమీ మిగల్లేదు. మరి మేము ఎలా బతకాలి’’ అంటూ ఆ హోటల్ యజమాని భార్య ఏడుస్తోంది.  

‘శ్రీహరి హోటల్ అండ్ లాడ్జ్’ అనే మరొక లాడ్జి కూడా ధ్వంసమైపోయింది. జంగీపూర్‌లో దేవాలయాన్ని కూడా వదల్లేదు. ఒక గుడిని అపవిత్రం చేసామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఖలీలుర్ రెహమాన్ కెమెరాల ముందు స్వయంగా ఒప్పుకున్నాడు.

కథ అక్కడితో ఆగలేదు. ఒక హిందూ కుటుంబం నిర్వహిస్తున్న ఆంబులెన్స్‌కు నిప్పు పెట్టేసారు. దాని డ్రైవర్‌ను నిర్దయగా చితకబాదారు. ‘‘మేము ఇళ్ళలోనుంచి బైటకు రాలేదు. భయంతో గజగజా వణికిపోయాం. మా కుటుంబం మొత్తం – నేను, మా భార్య, మా తల్లిదండ్రులు, మా పిల్లలు – అందరం లోపలే ఉండిపోయాం. అక్కడి నుంచే జరిగినదంతా చూసాం’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. దాడులు చేసినవారు బైట నుంచి వచ్చినవాళ్ళు కాదు, స్థానిక ముస్లిములే అని ఆయన ధ్రువీకరించారు.

 

సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల కథనాలు:

తాజాగా బైటపడిన సీసీటీవీ ఫుటేజ్‌లో ముస్లిం రాక్షస మూకలు వాహనాలను తగలబెట్టడం, హిందువుల ఆస్తులను లూటీ చేయడం స్పష్టంగా కనిపించింది. ‘‘వాళ్ళు బైక్‌లు తగలబెట్టేసారు, మా ఇళ్ళను దోచుకున్నారు, దుకాణాలకు నిప్పు పెట్టారు. పోలీసులు తమ ప్రాణాలు కాపాడుకోడానికి పారిపోయారు. మమ్మల్ని రక్షించడానికి ఎవరూ లేరు’’ అని ఒక వ్యక్తి ఎఎన్ఐకి చెప్పాడు.  

అమర్ భగత్ అనే హిందూ వ్యాపారి భార్య మంజూ భగత్ తమ ఇంటిపై అల్లరిమూకలు దాడి ఎలా జరిగిందో వివరించింది. ‘‘వాళ్ళు మా బైక్‌ను విరగ్గొట్టేసారు. టీవీ, కుర్చీలు, పరుపులు అన్నీ లూటీ చేసారు. మేము మేడ మీద దాక్కున్నాం, దేవుడికి ప్రార్థనలు చేసుకుంటూ నక్కినక్కి ఉన్నాం. నా కూతురి జీవితం ఏమైపోతుందో అని భయపడ్డాను’’.

 

శాంతిభద్రతల వైఫల్యానికి రాష్ట్రప్రభుత్వమే కారణం:

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలన తీరును బీజేపీ నాయకుడు అర్జున్ సింగ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘హిందువులను రక్షించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఇస్లామిక్ అతివాద ప్రమాదం పెచ్చుమీరిపోతోందని అర్జున్ సింగ్ హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న జాతిపరమైన దాడులతో బెంగాల్‌ పరిస్థితిని పోల్చారు.

‘‘ఇది కేవలం హింసాకాండ కాదు. జిహాదీలు వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న ప్రణాళిక. బెంగాల్‌ నుంచి హిందువులను తరిమివేసి ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ను ఏర్పాటు చేయాలన్నది వారి వ్యూహం. కానీ సనాతనీ హిందువులు వారికి తలొగ్గరు. ఐకమత్యమే మా బలం’’ అని అర్జున్ సింగ్ చెప్పుకొచ్చారు.

 

మమత పాలనలో చరిత్ర పునరావృతం:

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో హిందువులు నిర్వాసితులుగా మారడం ఇదేమీ మొదటిసారి కాదు. 2021 రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత, 2023 పంచాయతీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి భయంకరమైన హింసాకాండే మృత్యుతాండవం చేసింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పిన ప్రకారం ఒక్క 2021లోనే బెంగాల్‌లోని తమ ఇళ్ళను వదిలిపెట్టి పారిపోయిన హిందువుల సంఖ్య 80వేల నుంచి లక్ష వరకూ ఉంది. 2023 జులైలో కూచ్‌బెహార్ నుంచి హిందువులు అస్సాంలోని ఢుబ్రీ జిల్లాకు పారిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు, అతివాద శక్తులు సృష్టించిన రాజకీయ మతఘర్షణల నుంచి రక్షణ కోసం వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు.

మమతా బెనర్జీ పాలనలో బెంగాల్‌లో మతహింసపై ఎలాంటి నియంత్రణా లేకుండా పోయింది. హిందువులు నిరంతరం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు మాత్రం మాట పడిపోయిన సాధారణ వీక్షకుల్లా సినిమా చూస్తున్నారు.

Tags: Atrocities on HindusHindu ExodusMamata BanerjeeMurshidabadMuslim AppeasementTOP NEWSWest Bengal
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.