Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Opinion

పాస్టర్ ప్రవీణ్ మరణం: మతవిద్వేషాలు రేపిన వారిపై చర్యలుండవా? 2

హిందువులపై కుట్రలు చేసిన క్రైస్తవ, ముస్లిం మతగురువుల సంగతేంటి?

Phaneendra by Phaneendra
Apr 13, 2025, 03:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో హిందువులను నిందిస్తూ కొంతమంది క్రైస్తవ మతగురువులు, నాయకులు చేసిన దుష్ప్రచారం ఏదో ఆవేశంలో చేసింది కాదు. సామాన్య క్రైస్తవుల్లో హిందుత్వం పట్ల, హిందువుల పట్ల విద్వేషం కలిగించడమే లక్ష్యంగా ఒక వ్యూహం ప్రకారం చేసినది. అందుకే పోలీసులు, ఫోరెన్సిక్ బృందాల కంటె వేగంగా వాళ్ళే మాటలతో పోస్ట్‌మార్టం చేసేసారు. చొక్కాకు మట్టి అంటుకుంటే, ఒంటికి గాయాలైతే, బండి హెడ్‌లైట్ పోతే, అవన్నీ హిందువులు చేసిన దాడి ఫలితాలేనంటూ ప్రచారం చేసారు. మద్యం తాగే అలవాటే లేని మహానుభావుడిని భయపెట్టి బలవంతంగా మద్యం కొనిపించారని, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయించారనీ ప్రచారం చేసారు.

మీడియా కెమెరాల ముందు వాళ్ళు ఆడిన వీరంగాలు చూసిన సాధారణ క్రైస్తవులు అదే నిజమని నమ్మి అవే భ్రమలను సత్యాలుగా భావిస్తున్నారు. అందువల్ల పోలీస్ దర్యాప్తులో, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏ ఫలితం వచ్చినా వారు దాన్ని నమ్మకుండా ఇప్పటికీ అవే అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా హిందువులపై ద్వేషం రగిలించాలి, ప్రత్యేకించి, క్రైస్తవ ప్రచారకుల నిజానిజాలను బైటపెడుతూ తమ వ్యాపారాల రహస్యాలను బైటపెడుతున్న కొందరు సనాతన ధర్మయోధులను కేసుల్లో ఇరికించి బెదిరించాలి అని కొందరు క్రైస్తవ ప్రచారకులు చేసిన కుట్ర ఫలించిందనే చెప్పుకోవచ్చు.

 

పోలీసులు ఏం చర్యలూ తీసుకోరా?

క్రైస్తవ ప్రచారకులు, రాజకీయ నాయకుల వంటి ప్రముఖుల దుష్ప్రచారం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్న అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. అయితే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారా అంటూ అనుమానమే. పాస్టర్ ప్రవీణ్ పగడాలను హిందువులే హత్య చేసారు అని ప్రచారం చేస్తూ టీవీలు, సోషల్ మీడియాలో కొందరు మత విద్వేషాలు రగిలించేలా విచ్చలవిడిగా మాట్లాడారు. అక్కడ అలా దాడి చేసారు, ఇక్కడ ఇలా బెదిరించి మద్యం కొనిపించారు, అంటూ నోటికొచ్చినట్లు ప్రేలారు. ప్రవీణ్‌ మరణానికి కారణం హత్యేనంటూ తమ దగ్గర ఆధారాలు సౌతం ఉన్నాయంటూ వాగారు. కానీ వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

పాస్టర్ ప్రవీణ్‌ది హత్య అని ఆరోపిస్తూ టీవీ ఛానెళ్ళు, సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడినవారిపై 11 కేసులు నమోదు చేసామని, ఒకరిని అరెస్ట్ చేసామనీ ఐజీ వెల్లడించారు. వారిలో పలువురికి నోటీసులు ఇచ్చామనీ, అయితే వారు తమ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పారనీ వివరించారు. విదేశాల్లో ఉండి ఆరోపణలు చేస్తున్న వారిమీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేస్తామనీ ఐజీ చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కానీ నిజానికి ఏపీ పోలీసులు ఇలాంటి వ్యవహారాల్లో నేరస్తుల మీద చర్యలు తీసుకోగల అవకాశాలు నామమాత్రమే. మాజీ ఎంపీ హర్షకుమార్, ప్రముఖ ప్రచారకుడు ఎర్రప్ప అలియాస్ పాస్టర్ అజయ్, కేఏ పాల్, తదితరులకు పోలీసులు నోటీసులు ఇచ్చినా, వారెవరూ ఆ నోటీసులకు స్పందించిన దాఖలాలు లేవు.

నిజానికి సామాజిక మాధ్యమాల్లో వారు చేసిన విద్వేష వ్యాఖ్యలు, తీసిన వీడియోలు, చేసిన చర్చలూ అందుబాటులోనే ఉన్నాయి. పోలీసుల దర్యాప్తును సైతం తప్పుపడుతూ వక్రీకరిస్తూ వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో తాము చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు. ఎందుకంటే అక్కడ హత్య అన్న కోణమే లేదు. జరిగింది ప్రమాదమే. దాన్ని ఉద్దేశపూర్వకంగా హత్యగా చిత్రించి, హిందువులపై క్రైస్తవులకు ద్వేషం రగిలించాలన్న కుట్ర పన్నిన వారిపై పోలీసులు ఆ కోణంలో ఎందుకు పరిశీలించడం లేదు? ఆ దిశలో కేసులు నమోదు చేసి దోషులను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కించడం లేదు?

 

పాస్టర్ మరణంపై మత-రాజకీయాలు:

పాస్టర్ ప్రవీణ్ గతంలో తన నేర చరిత్ర గురించి తనే స్వయంగా చెప్పుకున్న వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇక అతను హిందువుల దేవీ దేవతలపై అసభ్యమైన, విశృంఖలమైన వ్యాఖ్యలు ఎన్నో చేసాడు. వాటిని హిందువులు వ్యతిరేకించినా వ్యంగ్యంగా అపహాస్యం చేయడమే తప్ప పశ్చాత్తాపం ప్రకటించిన సందర్భం ఒక్కటీ లేదు.

అదే ఊపులో ఇస్లాం మతం విషయంలోనూ ఏవో వ్యాఖ్యలు చేసాడు. హిందువుల్లా మతపరమైన నిశ్చేతన కలిగిన వారు కాదు కదా ముస్లిములు. వెంటనే ఘాటుగా స్పందించారు. ఎంతలా అంటే పాస్టర్ ప్రవీణ్ భయపడ్డాడు. ముస్లిం సమాజానికి తన సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాడు. తనపై జిహాద్ ప్రకటించవద్దనీ, తనను చంపవద్దనీ ప్రాధేయపడ్డాడు.

అలా ముస్లిములకు క్షమాపణలు చెప్పిన సంఘటన జరిగిన రెండు నెలలకే ఈ దుర్ఘటన జరిగింది. అలాంటప్పుడు హత్య అన్న అనుమానాలు ఎవరిమీద రావాలి? సాధారణ బుద్ధికి అయితే ముస్లిముల వల్లనే ముప్పు ఉండి ఉంటుందని అర్ధమవుతుంది. కానీ ఆ విషయంలో క్రైస్తవ మతగురువులు చాలా స్పష్టంగా ఉన్నారు. నేరం హిందువుల మీద మోపాలని నిర్ణయించేసుకున్నారు కాబట్టి ఇస్లామిక్ మతగురువులను వారు ప్రేమగా కౌగిలించుకున్నారు. క్రైస్తవులు, ముస్లిములు ఇద్దరూ హిందువుల బాధితులు అనీ, హిందువులపై దాడికి ఇద్దరూ కలిసి పోరాడాలనీ చాలా ఓపెన్‌గా పిలుపునిచ్చారు. పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత నిరసనలు తెలియజేసిన క్రైస్తవులతో కలిసి బ్రదర్ షఫీ కూడా హిందువుల మీద నాలుగు రాళ్ళు వేసాడు.

క్రైస్తవ ప్రముఖులే కాదు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై సీపీఐ పార్టీ కూడా పేలాలు ఏరుకుంది. అనుమానాస్పద మృతిపై సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. హిందువుల విశ్వాసాలను అడుగడుగునా అపహాస్యం చేసే ఎర్ర పార్టీ, పాస్టర్ మరణానికి రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు చేసింది. ఇప్పుడు మాత్రం వారు మౌనంగా ఉండిపోయారు. కమ్యూనిస్టులకు హిందువుల పైనే ద్వేషం తప్ప క్రైస్తవం అన్నా ఇస్లాం అన్నా ప్రేమభావమే ఉందని వారి చర్యలే నిరూపించాయి.

ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగిన మత్తులో రహదారిపై వేగంగా ప్రయాణం చేస్తూ స్వయంగా ప్రమాదం చేసుకోవడం వల్ల చచ్చిపోయాడని పోలీసులు నిర్ధారించారు. ఈలోగా సుమారు నెల రోజుల పాటు కొందరు క్రైస్తవ మతగురువులు, కొందరు రాజకీయ నాయకులు హిందువులపై కుట్రలు పన్నారు. సమాజంలో హిందువులపై విద్వేష భావనలను రెచ్చగొట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన హిందువులపై భౌతిక దాడులకు పిలుపునిచ్చారు. అలాంటి వారందరి పైనా పోలీసులు కేసులు పెట్టాలి. సమాజంలో శాంతిభద్రతలకు వైఫల్యం  కలిగించేందుకు దురుద్దేశపూర్వకంగా కుట్రలు పన్నిన నేరం కింద వారిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానాల్లో నిస్సందేహంగా నిరూపించాలి. అప్పుడే పాస్టర్ ప్రవీణ్ పగడాల శవాన్ని అడ్డం పెట్టుకుని చేసిన రాజకీయాల నుంచి హిందువులకు కొద్దిగానైనా ఊరట దక్కుతుంది.

Tags: Action Against Rumour MongersAnti Hindu PropagandaChristian Priests RumoursPastor Praveen PagadalaSelf Accidental DeathTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.