Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఓబుళాపురం గనుల కేసులో మే6న తుది తీర్పు

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 29, 2025, 10:59 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఓబుళాపురం ఇనుప గనుల్లో అక్రమ మైనింగ్ కేసు కొలిక్కి వచ్చింది. మేలోగా కేసు తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ టి. రఘురాం తీర్పును మే 6న ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 13 ఏళ్లపాటు కేసు విచారణ సాగింది. 3400 డాక్యుమెంట్లు పరిశీలించారు.
219 మంది సాక్షులను విచారించారు.

ఓబుళాపురం మైనింగ్ యజమానులు బివి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్థన్‌రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్థన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై 420, 120బి రెడ్ విత్, 409, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేుశారు. మరికొందరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి విచారించారు.

ఓబుళాపురం గనుల ఆక్రమణ, అక్రమమైనింగ్‌పై 2009లో కేసు నమోదైంది. కేసును సిబిఐకి అప్పగించారు. 2011లో మొదటి అభియోగపత్రం దాఖలైంది. తరవాత ఈ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, మెఫజ్ అలీఖాన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చారు. డిశ్ఛార్జి పిటిషన్లు, క్వాష్ పిటిషన్లతో విచారణ 13 ఏళ్లు కొనసాగింది. చివరకు మే నెలకల్లా కేసులో తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మే6న తీర్పు చెప్పనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ రఘురాం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేసులో 9 మంది నిందితులు

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి, బివి. శ్రీనివాసరెడ్డి, మాజీ ఐఏఎస్ రాజగోపాల్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, అనంతపురం జిల్లా గనుల శాఖ మాజీ సహాయ డైరెక్టర్ ఆర్. లింగారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, అలీఖాన్, కృపానందం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిందితులుగా ఉన్నారు విచారణ దశలో లింగారెడ్డి మృతి చెందాడు. శ్రీలక్ష్మి పేరును 2022లో డిశ్చార్జి చేశారు.

కేసు పూర్వాపరాలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గాలి జనార్థన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనంతపురం జిల్లా రాయదుర్గంలో గనులు కేటాయించారు. డి.హీరేహాల్ మండలంలో 68.5 హెక్టార్లు, ఓబుళాపురంలో 39.5 హెక్టార్లు కేటాయించారు. గనుల కేటాయింపులో అప్పటి జిల్లా భూగర్భ గనుల శాఖ సహాయ డైరెక్టర్ లింగారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. 93 హెక్టార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా గాలి జనార్థన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి మామ పరమేశ్వరరెడ్డి కంపెనీ వినాయక మైనింగ్ సహా, మొత్తం 23 దరఖాస్తులు వచ్చాయి.
మొదట వచ్చిన దరఖాస్తునే పరిగణనలోకి తీసుకుని మిగిలిన దరఖాస్తులు పట్టించుకోలేదు. దీంతో ఓఎంసీకి 68.5, ఏపీఎండీసీకి 25 హెక్టార్లు లీజు కేటాయించారు.

దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో సరైన కారణం చెప్పలేదు. దీంతో ఆయా కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. గనులలీజుల మంజూరులో అప్పటి గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి అత్యుత్సాహం ప్రదర్శించారు. 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు అయ్యే బ్రహ్మణి స్టీల్ భవిష్యత్తులో 10 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకుంటుందంటూ ఓఎంసీ దరఖాస్తు పరిగణనలోకి తీసుకున్నారు. అదే రోజు అప్పటి గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతకాలు చేసి జీవో ఇచ్చారు.

క్యాప్టివ్ మైనింగ్ పేరుతో లీజులు తీసుకుని ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించి వేల కోట్లు కొల్లగొట్టారనేది ప్రధాన ఆరోపణ. అధికారులు, రాజకీయ నాయకులు గాలి కంపెనీకి అండగా నిలిచారు. లీజులు పొందిన ప్రాంతంతో పాటు సరిహద్దులుదాటి కర్ణాటకలోనూ తవ్వకాలు జరిపారు. దాదాపు రూ.884 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ పేర్కొంది.

Tags: andhratodaymining case gali janardhanmining cases on galimining mafiaobulapuram minesobulapuram minigobulapuram miningobulapuram mining caseobulapuram mining mafiaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.