Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

వచ్చేవారం థాయ్‌లాండ్, శ్రీలంకలో పర్యటించనున్న మోదీ

Phaneendra by Phaneendra
Mar 28, 2025, 11:50 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగే ఆరవ బిమ్స్‌టెక్‌ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3,4 తేదీల్లో పాల్గొంటారు. థాయ్‌లాండ్ పర్యటన ముగిసాక 4,5,6 తేదీల్లో శ్రీలంకలో పర్యటిస్తారు. థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెటొంగ్‌టార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొంటారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. మోదీ థాయ్‌లాండ్‌లో అధికారిక పర్యటనకు వెళ్ళడం ఇది మూడోసారి.

బిమ్స్‌టెక్ సదస్సు 2018 తర్వాత మళ్ళీ భౌతికంగా సమావేశాలు జరగడం ఇదే మొదటిసారి. 2018లో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో నాలుగవ బిమ్స్‌టెక్ సదస్సు జరిగింది. ఐదవ బిమ్స్‌టెక్ సదస్సు శ్రీలంక రాజధాని కొలంబోలో 2022లో జరిగింది. అయితే దాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. ఇప్పుడు ఆరవ సదస్సు బ్యాంకాక్‌లో జరగబోతోంది.

బిమ్స్‌టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్…. ‘బంగాళాఖాత దేశాల మధ్య వివిధ రంగాల్లో సాంకేతిక, ఆర్థిక సహకారం కోసం సమన్వయం’ అని అర్ధం. ఇందులో బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు ఉన్నాయి.

‘‘ప్రాదేశిక సహకారాన్నీ, ప్రాంతీయ భాగస్వామ్యాన్నీ బలపరచుకోవడం కోసం భారత్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతను పటిష్టం చేయడంతో పాటు వాణిజ్యం-పెట్టుబడులకు అవకాశం కల్పించడం, సభ్యదేశాల నడుమ భౌతికమైన, డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడం, వివిధ రంగాల్లో పరస్పర సహకారం, నైపుణ్యాల అభివృద్ధి, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను విస్తరించడం వంటి చర్యలు తీసుకుంటోంది’’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఏప్రిల్ మూడున భారత్-థాయ్‌లాండ్ ప్రధానమంత్రులు నేరుగా సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారం, భవిష్యత్ భాగస్వామ్యాల వంటి అంశాల గురించి చర్చలు జరుపుతారు.  

తర్వాత మోదీ థాయ్‌లాండ్‌ నుంచి శ్రీలంక వెడతారు. ఆ దేశ అధ్యక్షుడు అనూర కుమార దిసనాయక పిలుపు మేరకు మోదీ శ్రీలంకలో పర్యటించనున్నారు. 2019 తర్వాత మోదీ శ్రీలంకలో పర్యటించడం ఇదే మొదటిసారి. నిర్దేశిత రంగాల్లో పరస్పర సహకారం దిశలో జరుగుతున్న పురోగతి గురించి ఇద్దరు నాయకులూ చర్చిస్తారు. ఆ దేశపు ఇతర రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో కూడా సమావేశాలు జరుపుతారు. అనూరాధపురలో భారత్ ఆర్థిక సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు.

Tags: 6th BIMSTEC SummitAnura Kumara DisanayakeBIMSTECPaetongtran ShinawatraPM Narendra ModiSri LankaThailandTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.