Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

సనాతనం, హిందీకే కాదు, స్టాలిన్ దేశానికీ విరోధిగా మారారు: విహెచ్‌పి

Phaneendra by Phaneendra
Mar 16, 2025, 02:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశానికి సైతం విరోధిగా మారారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ అన్నారు. ఇన్నాళ్ళూ సనాతన ధర్మాన్నీ, హిందీ భాషను మాత్రమే వ్యతిరేకించిన స్టాలిన్ పద్ధతి మారిందంటూ మండిపడ్డారు. రూపాయి చిహ్నాన్ని మార్చివేసిన విషయంలో స్టాలిన్ వైఖరిని తప్పుపట్టారు. ఆ మేరకు ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేసారు.

‘‘హిందువులకు ద్రోహం చేస్తూ చేస్తూ, హిందీ పట్ల విరోధం ప్రకటిస్తూ ప్రకటిస్తూ ప్రజలు దేశ విరోధులుగా మారిపోతారు. చివరికి దేశంలో అందరికీ ప్రాతినిథ్యం వహించే మన జాతీయ ప్రతీకలను సైతం అవమానించే స్థాయికి దిగజారిపోతారు. దానికి నిలువెత్తు ఉదాహరణగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కనిపిస్తున్నారు.  

రూపాయి శబ్దాన్ని తమిళంలో రాసినంత మాత్రాన ఎవరికీ సమస్య లేదు. మాకు మా దేశంలోని అన్ని భాషల గురించీ గర్వం ఉంది. కానీ రూపాయికి జాతీయ చిహ్నంగా ఉన్న ‘₹’ను ఆయన తమ బడ్జెట్ ప్రతుల్లో నుంచి తొలగించేసారు కదా, ఆ చిహ్నాన్ని తమిళనాడుకే చెందిన, అది కూడా ఆయన పార్టీ అయిన డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్ ధర్మలింగం కుమారుడు ఉదయ్‌కుమార్ అనే యువకుడే డిజైన్ చేసాడన్న సంగతిని స్టాలిన్‌కు ఎవరైనా తెలియజెప్పండి. నిజానికి ఆ విషయం గురించి ఆయన గర్వపడాలి. తమ రాష్ట్రానికే చెందిన ఆ యువకుడి ప్రతిభకు సన్మానం చేయాలి.

హిందీ పట్ల ద్వేషంతో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి దేశంలో రూపాయి ముద్రకున్న చిహ్నాన్ని తమ రాష్ట్రంలో మార్చేసారు, కానీ ఆయన ప్రతీ రూపాయి నోటు మీదా ముద్రించి ఉన్న ఆ చిహ్నాన్ని లేక హిందీ పదాలను కూడా మార్చివేయగలరా? లేదంటే ఆయన భారతీయ రూపాయిలు లేకుండా బతకగలరా? ఆ రూపాయిలే లేకుండా తమ పార్టీ ప్రభుత్వాన్ని నడపగలరా? రూపాయి చిహ్నాన్ని తొలగించడం ద్వారా ఆయన తమ రాష్ట్రానికే చెందిన యువకుడి ప్రతిభను ఆయన అవమానించడం లేదా? స్టాలిన్ తండ్రి కరుణానిధి కూడా ఆ రూపాయి చిహ్నాన్ని ఆమోదించారు, అంటే స్టాలిన్ తన తండ్రిని అవమానించినట్లే. ఒకవైపు సనాతనాన్ని దెబ్బ తీయాలంటూ పగటికలలు కనే కొడుకు ఉదయనిధి, మరోవైపు చక్కటి సృజన, ప్రతిభ కలిగిన ధర్మలింగం కుమారుడు ఉదయ్‌కుమార్. తండ్రి ఎలా ఉంటే కొడుకులూ అలాగే ఉంటారు, వారి ఆలోచనలూ అలాగే ఉంటాయని ఒక నానుడి. ఆ నానుడి నిజమేనని ఉదయ్ కుమార్, ఉదయనిధి నిరూపించారు.

సనాతన ధర్మాన్నీ, హిందీనీ ద్వేషించే స్టాలిన్, దేశ విరోధిగా మారడానికి ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది. విజ్ఞులైన తమిళనాడు ప్రజలకు అన్ని విషయాలూ తెలుసు. వారు డిఎంకె లేక ఇండీ కూటమి పన్నుతున్న పన్నాగాల్లో చిక్కుకోరు’’

ఇలా విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్‌, స్టాలిన్ వాదనను పూర్వపక్షం చేసారు. తమిళ ప్రజల విజ్ఞతపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు.  

Tags: pawan kalyanStalin Stand on HindiStatement of DMKTamizh HiphopTOP NEWSVinod BansalViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.