Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

నిలబడ్డాం, టీడీపీని బతికించాం : జనసేనాని పవన్ కళ్యాణ్

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 15, 2025, 10:36 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జనసేన పార్టీని నిలబెట్టాం, నాలుగు దశాబ్దాల టీడీపీని బతికించామంటూ పిఠాపురం వేదికగా సాగిన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. లక్షలాది మంది అభిమానులు తరలిరాగా, పార్టీ నాయకుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం అద్యంతం అందరికీ ఆకట్టుకుంది.

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరవాత చాలా మంది అసెంబ్లీ గేటు కూడా తాకలేవంటూ ఎద్దేవా చేశారని, 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ సీట్లు, 2 స్థానాలు గెలచి చూపించామని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. నాడు తొడలుగొట్టిన వారి నోళ్లు మూతపడ్డాయన్నారు. 11 సంవత్సరాల జనసేన పార్టీ ప్రస్థానంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా భయపడలేదన్నారు.తనకు సినిమా జీవితాన్ని ఇచ్చినా, ప్రజలకు సేవల చేసేందుకే రాజకీయాల్లో వచ్చాన్నారు. పదవీ వ్యామోహంతో కొందరు రాజకీయాల్లో వస్తున్నారని తనకు అలాంటి వ్యామోహాలు లేవన్నారు.

దేశంలో బహుభాషా విధానం అవసరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో హిందీ వ్యతిరేక రాజకీయాలను ఆయన తప్పుపట్టారు. హిందీని వ్యతిరేకించే వారు తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. డబ్బు కావాలి కానీ హిందీ అవసరం లేదా అని ప్రశ్నించారు. కేవలం త్రిభాషా విధానమే కాదని, బహుభాషా విధానం రావాలన్నారు. తమిళంలో ఆయన ప్రసంగం ఆకట్టుకుంది. కన్నడ అభిమానులను ఉద్దేశించి కన్నడలో మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో ప్రచారం చేశానని, తనకు అక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నట్లు గుర్తించినట్లు పవన్ చెప్పారు.

ఏపీని విభజిస్తే దేశం నుంచి విడిపోతామని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రత్యేక దేశం కోరతామంటూ కొందరు నాయకులు చేసిన ప్రకటనలు ఆయన గుర్తుచేశారు. ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు కోసుకోవడానికి ఇదేమైనా కేకు ముక్కా అంటూ పవన్ ప్రశ్నించారు. దేశాన్ని విడగొట్టాలని ఒకరు ప్రయత్నం చేస్తే, దేశాన్ని ఏకం చేసేందుకు తనలాంటి 10 కోట్ల మంది రోడ్ల మీదకు వస్తారని పవన్ హెచ్చరించారు. జనసేన అనే శిశువును మనం కాపాడుకుంటే భవిష్యత్తులో అది దేశాన్ని రక్షిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పవన్ ( #pawankalyan) ప్రశంసలు కురిపించారు. మనం గెలవడంతోపాటు, నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించామన్నారు. క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చినా ప్రాణాలతో భయటపడి చొక్కా దులుపుకుని వెంటనే విధులు నిర్వహించిన చంద్రబాబునాయుడు అంతే తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. నాడు చంద్రబాబునాయుడు హైదరాబాదులో వేసిన హైటెక్ సిటీ బీజాలు నేడు ఐటీ విప్లవానికి నాంది పలికాయన్నారు.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన విషయం తెలిసి తాను కలత చెందినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ వ్యవహారంలో ఏ మతం వారు ఉన్నారనేది ముఖ్యం కాదన్నారు. చివరకు విచారణలో లడ్డూ కల్తీ వ్యవహారంలో హిందువులు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ విషయంలో తాను ముస్లింలను విమర్శించలేదన్నారు. సెక్యులరిజాన్ని నిజమైన స్ఫూర్తితో చూడాలన్నారు. గోద్రా ఘటనను రెండో ఆలోచన లేకుండా ఖండించాలన్నారు. హిందు, ముస్లిం అనే తేడా లేకుండా ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిదేన్నారు.

కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో ఐదేళ్ల వైసీపీ పాలనతో జగన్మోహన్‌రెడ్డి చివరకు కామెడీ నటుడిలా మిగిలిపోయాడని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఇక జీవితంలో జగన్‌రెడ్డి సీఎం కాలేడని నాగబాబు జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన గర్వంతో అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నేతకు 2024లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని గుర్తుచేశారు.

జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రి పదవిని పీకినా బాధపడలేదని, కానీ తన ఆస్తులు, తన వియ్యంకుడి ఆస్తులు గుంజుకున్నారంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జగన్‌రెడ్డి జీవితంలో ఇక సీఎం కాలేరంటూ బాలినేని సెటైర్లు వేశారు. జీవితాంతం జనసేన అధినేతకు అండగా ఉంటానన్నారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనేది తన జీవిత లక్ష్యమని బాలినేని వ్యాఖ్యానించారు.

పిఠాపురం సమీపంలో చాట్రాయిలో నిర్వహంచిన జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతమైంది. తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. లక్షలాది మందికి ఆహారం, మంచినీరు అందించారు. జయకేతనం సభను విజయవంతం కావడంతోపాటు, జనసేనాని పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగంతో జనసైనికుల్లో జోష్ నింపారు.

Tags: JANASENAjanasena 12th formation dayjanasena chiefjanasena partyjanasena vs ycppawan kalyanpawan kalyan janasenapawan kalyan speechpawan kalyan's janasenaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.