Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

చెట్లు పాడైపోతాయంటూ శాంతినికేతన్‌లో హోలీపై మమతా సర్కారు నిషేధం

Phaneendra by Phaneendra
Mar 13, 2025, 12:48 pm GMT+0530
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

FacebookTwitterWhatsAppTelegram

పశ్చిమ బెంగాల్‌ బీర్‌భూమ్ జిల్లా శాంతినికేతన్‌లోని సోనాఝూరీ హాట్‌లో హోలీ పండుగ జరుపుకోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. హోలీ వేడుకల్లో చల్లుకునే రంగునీళ్ళ వల్ల ఆ ప్రాంతంలోని చెట్లు నాశనమైపోయే ప్రమాదం ఉందంటూ నిషేధాజ్ఞలు జారీ చేసింది.    

సోనాఝూరీ హాట్ అనేది విశ్వభారతి విశ్వవిద్యాలయం శాంతినికేతన్ క్యాంపస్ దగ్గరున్న ప్రముఖ వ్యాపారస్థలం. శాంతినికేతన్ క్యాంపస్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అక్కడ హోలీ ఆడడం కాదు కదా గుంపులుగా జనాలు కూడా చేరకూడదని బెంగాల్ అటవీశాఖ ఆదేశాలు జారీచేసింది.   

సోనాఝూరీ హాట్‌ వచ్చే స్వదేశీ, విదేశీ పర్యాటకులు సహా సాధారణ ప్రయాణికులు ఎవరూ మార్చి 14 హోలీ పండుగ నాడు ఆ ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేయకూడదు, హోలీ వేడుకలు జరుపుకోకూడదు. ఆ మేరకు ఆ ప్రాంతం అంతా బ్యానర్లు ఏర్పాటు చేసామని బోల్‌పూర్ డివిజన్ అటవీ అధికారి రాహుల్ కుమార్ ప్రకటించారు. అసలు ఆ ప్రాంతంలో ఎలాంటి వీడియోలూ చిత్రీకరించవద్దని కూడా ఆదేశించారు. నిషేధాజ్ఞలు సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు పోలీసు వారి సహకారం తీసుకుంటామని రాహుల్ కుమార్ చెప్పారు.

విశ్వభారతి అధికార ప్రతినిధి కూడా ఆ ఆదేశాలను నిర్ధారించారు. శాంతినికేతన్ ఆశ్రమానికి యునెస్కో వారసత్వ సంపద స్థాయి ఉన్నందున ఆ ఆవరణలో హోలీ ఆడుకోడానికి ప్రజలను రానీయలేమని వెల్లడించారు.

హోలీ పండుగ రోజు ‘డోలా యాత్ర’ అనే ఊరేగింపు జరపడం బెంగాలీల సంప్రదాయం. సోనాఝూరీ ప్రాంతంలో అలాంటి ఊరేగింపు జరపడానికి వీలులేదని అటవీ అధికారి స్పష్టం చేసారు. ‘‘ఇది పచ్చటి చెట్లు ఉండే ప్రదేశం. వేల సంఖ్యలో ప్రజలు గుమిగూడి రంగునీళ్ళు చల్లుకుంటే చెట్లకు తీరని నష్టం వాటిల్లుతుంది. హోలీ వల్ల పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుంది. అలా జరగకుండా మనందరం ప్రతిజ్ఞ చేద్దాం’’ అని ప్రకటించారు.

సాధారణంగా విశ్వభారతిలో వసంతోత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. విశ్వభారతికి యునెస్కో గుర్తింపు లభించాక 2019 నుంచీ అక్కడ వసంతోత్సవాలు జరపకూడదంటూ నిషేధం విధించారు. అప్పటినుంచీ సోనాఝూరీలో హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఇప్పుడు మొదటిసారి అక్కడ హోలీ వేడుకలు జరపకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు.  

ఈ ఉత్తర్వులపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. హోలీ వేడుకలపై నిషేధం సోనాఝూరీ ఒక్కచోటనే విధించలేదని, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధించారనీ బీజేపీ నేత సువేందు అధికారి వెల్లడించారు. ‘‘ఇతర మతాల కార్యక్రమాలు ఉన్నప్పుడు పోలీసులు సమన్వయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ యేడాది మాత్రం హోలీ వేడుకల గురించి పోలీస్ స్టేషన్లలో సమావేశాలు జరిగాయి. ఇది రంజాన్ మాసం, హోలీ పండుగ శుక్రవారం వచ్చింది. కాబట్టి రంగులు వాడకూడదు అని బహిరంగంగానే చెబుతున్నారు. అసలు హోలీయే జరక్కుండా చూస్తున్నారు. శాంతినికేతన్‌లో ఉదయం 10గంటలకల్లా హోలీ వేడుకలు పూర్తయిపోవాలని బీర్‌భూమ్ ఎఎస్‌పి ఆదేశించారు. లేదంటే అరెస్టులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మమతా బెనర్జీ పాలనలో పోలీసులు ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

Tags: Ban on Holi CelebrationsSantiniketanSonajhuri HaatTOP NEWSWest Bengal
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.