కర్ణాటకలో దారుణం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతి జిల్లాలో రంగావతి రంగమ్మ గుడి వద్ద విదేశీ, స్వదేశీ యాత్రికులపై దుండగులు దాడి చేశారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన డానియల్, ఇజ్రాయెల్‌కు చెందిన నమా, నాసిక్ ప్రాంతానికి చెందిన పంకజ్, ఒడిషాకు చెందిన డిబాస్ రంగమ్మ గుడి వద్ద సంగీత విభావరి నిర్వహించే సమయంలో కొందరు దుండగులు దాడి చేశారు. అడ్డుకున్న ముగ్గురిని పక్కనే ఉన్న తుంగభద్ర కాలువలోకి నెట్టారు. ఇద్దరు ఈదుకుంటూ బయట పడగా, ఒడిషాకు చెందిన డిబాస్ గల్లంతయ్యాడు.
పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే జిల్లా ఎస్పీ, డీఐజి అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన డిబాస్ కోసం గాలిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు.