Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఏపీ వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం : 3.22 లక్షల కోట్లు

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 28, 2025, 11:03 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీ ఆర్థిక మంత్రి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. క్యాబినెట్ ఆమోదం అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2.51 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.40635 కోట్లుగా ఉంది. రెవెన్యూ లోటు రూ.33185కోట్లు. ద్రవ్య లోటు రూ.79926 కోట్లుగా ఉంది.

ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. వ్యవసాయరంగానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. విద్యారంగానికి పెద్దపీట వేశారు. పాఠశాల విద్యకు. రూ.31805కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ.47456 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.20281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8159 కోట్లు కేటాయించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు రూ.1228 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు కేటాయింపులు చేశారు. అల్ప సంఖ్యాక వర్గాలకు రూ.5434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి రూ.4332 కోట్లు కేటాయించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందుకు నిధులు కేటాయించారు.

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు, పురపాలక, పట్టణాలకు రూ.13862 కోట్లు, పంచాయతీలకు రూ.18847 కోట్లు కేటాయించారు.పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.6318 కోట్లు, పరిశ్రమలకు రూ.3156 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు, యువజన పర్యాటకానికి రూ.469 కోట్లు కేటాయింపులు చేశారు. హోం శాఖకు రూ.8570 కోట్లు, తెలుగు భాష ప్రచారం కోసం రూ.10 కోట్లు, జల్ జీవన్ పథకానికి రాష్ట్ర వాటాగా రూ.2800 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.3806 కోట్లు కేటాయించారు.

తల్లికి వందనం పథకానికి రూ.9407 కోట్లు, పింఛన్లకు రూ.27,518కోట్లు, ఆర్టీజీఎస్‌కు రూ.101 కోట్లు,స్వచ్ఛాంధ్రకు రూ.820 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు దీపం 2.0కు రూ.2601 కోట్లు కేటాయించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఉచిత భోజన పథకానికి రూ.3486 కోట్లు, ఆదరణ 2.0కు రూ.1000 కోట్లు కేటాయించారు.

రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మార్చాలంటే రాజధాని ముఖ్యమని హైదరాబాద్, ముంబై తరహాలో అమరావతి రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బడ్జెట్లో అమరావతికి కేటాయింపులు చేయలేదు. రాజధానికి అవసరమైన నిధులు రాజధాని సంపాదించుకుంటుందని మంత్రి పయ్యావుల తెలిపారు. స్వీయపెట్టుబడుల వనరులు కలిగిన రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేయడంతోపాటు, గత ప్రభుత్వం వదిలేసిన 80 లక్షల టన్నుల చెత్తను తొలగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్షా పదిహేనువేల ఇళ్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మార్చి చివరి నాటికి 7 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. జూన్ చివరి నాటికి 2 లక్షల టిడ్కో ఇళ్లు అందిస్తామని చెప్పారు. ఇందుకు రూ.6200 కోట్లు కేటాయించారు.

Tags: ap assembly budgetap assembly budget session 2025ap assembly budget sessionsap assembly sessions 2025ap budget 2025ap budget sessionap budget session 2025ap newsap politicsap state budget 2025SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.