Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

గంగలో కాలుష్యంపై దుష్ప్రచారాలు: మసీదుల్లో అపరిశుభ్రత గురించి మౌనం

Phaneendra by Phaneendra
Feb 25, 2025, 07:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 అసాధారణమైన జనసమ్మేళనానికి సాక్షిగా నిలిచింది. రేపటితో ముగుస్తున్న కుంభమేళాలో ఇప్పటికి 62కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ క్షేత్రంలో 144ఏళ్ళకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో పాల్గొనడానికి ఆసేతుశీతాచలం హిందూభక్తజనులే యావత్ ప్రపంచదేశాల నుంచి ఎంతోమంది ఆసక్తిగా వచ్చారు. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకున్నారు.

అయితే కొన్ని వర్గాల ప్రజలు మాత్రం హిందువుల పండుగను అల్లరి చేయడానికి, అవమానించడానికీ ఏమాత్రం వెనుకాడలేదు. నిస్సిగ్గుగా అబద్ధాలు దుష్ప్రచారం చేయడంలో వెనుకంజ వేయలేదు. తమను తాము గొప్ప ఆరోగ్య నిపుణులుగా అభివర్ణించుకునే నికృష్టులు, ఉదారవ్యాధులు మహాకుంభమేళా మొదలైనప్పటినుంచీ గంగానది స్వచ్ఛత గురించి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. కోట్లాదిమంది భక్తులు విశ్వాసంతో పవిత్ర స్నానాలు చేస్తుండగా ఈ ధూర్తులు గంగాజలాలు విసర్జితాలతో కలుషితమైపోయాయంటూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు.

త్రివేణీ సంగమ క్షేత్రంలోని నదీజలాల్లో ఫీసల్ కోలిఫామ్ బ్యాక్టీరియా (విసర్జితాలకు సంబంధించిన బ్యాక్టీరియా) ఉనికి గురించి ఒక ముఖ్యమైన విషయం వెలుగు చూసింది. కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి ఆ జలాల్లో కోలిఫామ్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఆ ప్రకటన తప్పు అని ప్రముఖ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అజయ్ సోంకర్ నిరూపించారు. గంగాజలాలకు స్వీయశుద్ధి అనే ప్రత్యేకమైన లక్షణం ఉందన్న సంగతిని డాక్టర్ సోంకర్ విస్పష్టంగా వెల్లడించారు.

డాక్టర్ సోంకర్ తన ప్రయోగశాలలో కుంభమేళా జలాలపై విస్తృతంగా పరిశోధనలు చేసి, ఆ జలాల్లో బ్యాక్టీరియోఫేగస్ ఉన్నాయని నిర్ధారించారు. ప్రమాదకరమైన బ్యాక్టీరియాను లక్ష్యం చేసుకుని నిర్మూలించే వైరస్‌నే బ్యాక్టీరియోఫేగస్ అంటారు. వాటి ఉనికి వల్ల గంగాజలాలు స్వచ్ఛంగా ఉన్నాయని నిర్ధారించారు. నీటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటె తక్కువ ఉంటే ఫీసల్ కోలిఫామ్ బ్యాక్టీరియా నిద్రాణమైపోతుందని ఆయన వివరించారు. మహాకుంభమేళా జరిగిన అన్ని రోజుల్లోనూ గంగానదీజలాల ఉష్ణోగ్రత 10-15 డిగ్రీల్ సెల్సియస్ లోపే ఉంది. అందువల్ల బ్యాక్టీరియా సచేతనంగా ఉండడం, బహుళంగా విస్తరించడం అసాధ్యమని డాక్టర్ సోంకర్ స్పష్టం చేసారు. తను కనుగొన్న విషయాలు కచ్చితమైనవి అని చాటడానికి ఆయన వేలాది భక్తుల సమక్షంలో గంగానదిలోనుంచి తీసిన నీటిని తాగారు కూడా. అలా, భారీ జనసమ్మేళనాలు జరిగినప్పటికీ గంగానది స్వచ్ఛత యథాతథంగా ఉంటుందని డాక్టర్ అజయ్ సోంకర్ నిరూపించారు.

శాస్త్రీయ నిర్ధారణల తర్వాత కూడా పర్యావరణవేత్తలు, ఆరోగ్య పరిరక్షకులు అని చెప్పుకునే కొంతమంది కుంభమేళా గంగాజలాల నాణ్యత మీద ఆందోళనలు కొనసాగిస్తూనే వచ్చారు. వారు ప్రధానంగా వాదించే అంశం గంగానదిలోని కోలిఫామ్ స్థాయి ఎక్కువగా ఉంటోంది అన్న విషయమే. అయితే సదరు సోకాల్డ్ ఆరోగ్య పరిరక్షకుల వాదనలో ఒక వైరుధ్యం అలాగే ఉండిపోయింది. ఈ ప్రజారోగ్య పరిరక్షకులకు నీటి నాణ్యత మీద ఆందోళన కుంభమేళా వంటి హిందూ పర్వదినాల సమయంలోనే ఎందుకు గుర్తొస్తుంది?

అన్యమతాలకు చెందిన స్థలాల్లో పరిశుభ్రత గురించి అసలు ఎప్పుడూ ఎలాంటి చర్చా జరగదు. మసీదుల్లో పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడతారు. అక్కడ నీరు పరిమిత స్థాయిలో నిల్వ ఉన్న వనరుల్లో ఉంటుంది. సువిశాలంగా స్వేచ్ఛగా ప్రవహించే గంగానదీ జలాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా పెద్ద ఆందోళనకరమైన విషయం అయితే, మసీదుల్లో చిన్న ప్రదేశాల్లో నిల్వ ఉండే నీటి పరిశుభ్రత గురించి ఎప్పుడూ ఎలాంటి ఆందోళనలూ కలగవెందుకు? సదరు ఆరోగ్య పరిరక్షకులు పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలే, మహాకుంభమేళాలోని గంగాజలాల స్వచ్ఛతపై వారి ఆందోళనల మీద అనుమానాలు కలిగిస్తున్నాయి. వారి ఆందోళనకు కారణం సైన్సా లేక హిందూ ఆచార సంప్రదాయాలను తప్పుపట్టాలనే రహస్య అజెండాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక వీడియో విస్తృతంగా ప్రచారమవుతోంది. అందులో ఒక మసీదులో ముస్లిములు ఒక చిన్న జలాశయంలో నీటితో ముఖాలు కడుక్కుంటున్నారు. అదే నీటితో మరికొందరు నోరు శుభ్రం చేసుకుంటున్నారు. వారిలో కొంతమంది తాము పుక్కిలించిన నీటిని మళ్ళీ అదే జలాశయంలోకి ఉమ్ముతున్నారు. మరికొందరు వ్యక్తులు ఆ నీటితోనే ముక్కు శుభ్రం చేసుకుంటున్నారు.

గంగానదీ జలాల స్వచ్ఛతను ప్రశ్నిస్తూ పరిశుభ్రత గురించి ప్రబోధాలు చేస్తున్న సదరు ప్రజారోగ్య పరిరక్షక ప్రబుద్ధులు, అలాంటి సలహాలనే ముస్లిములకు చెప్పవచ్చు కదా అని ఒక నెటిజన్ ఆ వీడియో సాక్షిగా ప్రశ్నించాడు.   

ముస్లిములకు వారి మతగురువులు చెప్పే విషయం సరైనది కాదు అని ఈ ఆరోగ్య పరిరక్షకుల్లో ఎవరూ చెప్పడానికి సాహసించకపోవడం ఆందోళన కలిగించే విషయం. ముస్లిములకు సంబంధించిన ‘‘బుక్ ఆఫ్ వాటర్’’ అనే పుస్తకంలో… కుక్కల శవాలు, మహిళల ఋతుస్రావపు దుస్తులను పడవేసే నూతిలోని నీటితో ‘వుజూ’ చేసుకోవచ్చునని రాసి ఉంది. అంటే ముఖం కడుక్కోవడం, నోరు పుక్కిలించుకోవడం, పరిశుభ్రం చేసుకోడానికి ఆ బావి నీటిని వాడవచ్చునని అర్ధం. అది అనారోగ్యానికి కారణమవుతుంది అని ముస్లిములకు ఈ ప్రజారోగ్య పరిరక్షకులు చెప్పే సాహసం చేయగలరా?

అణువణువునా హిందూ వ్యతిరేకతను కలిగిఉండి, ముస్లింలను బుజ్జగించే రాజకీయ నాయకులు కుంభమేళాపై విషం చిమ్మడాన్ని శ్రీనివాసన్ అనే నెటిజన్ ఏవగించుకున్నాడు. ‘‘ముస్లిములు ఉమ్మడి కుంటలోని నీటితో కాళ్ళు, చేతులు, నోరు కడుక్కోడాన్ని అఖిలేష్ యాదవ్, జయా బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రశాంత్ భూషణ్, మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు ‘మురికి’ అని ఖండించగలరా, మసీదును మృత్యు మసీదు అని పిలవగలరా?’’ అని ప్రశ్నిస్తూ నిలదీసాడు.

ఫిబ్రవరి 19న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంగాజలాల స్వచ్ఛత, భద్రత గురించి విస్పష్టంగా ప్రకటన చేసారు. కుంభమేళా సమయంలో నీటి నాణ్యతను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తూ ఉందని, పరిశుభ్రంగా నిర్వహిస్తూ ఉందనీ వెల్లడించారు. సంగమ క్షేత్రం చుట్టుపక్కల ఉన్న అన్ని పైపులూ, మురుగునీటి కాలువలను సీల్ చేసాము. నదిలోని నీరు శుభ్రంగా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాము’’ అని ప్రకటించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదికను కొంతమంది ఉద్దేశపూర్వకంగా, కుంభమేళాను అప్రతిష్ఠ పాలు చేయడానికి తప్పుగా వ్యాఖ్యానించారని వివరించారు.

Tags: Anti Hindu PropagandaBook of WaterDr Ajay SonkerHygene ConcernsIslamic CongregationsMahakumbh 2025MosquesPrayag RajTOP NEWSTriveni SangamUttar PradeshWudu Khana
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.