Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

యూపీ జైళ్ళలోని 90వేల మంది ఖైదీలకు కుంభస్నాన యోగం

నేటికి 60కోట్లు దాటిన పవిత్రస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య

Phaneendra by Phaneendra
Feb 22, 2025, 03:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సమాగమం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర జరుగుతున్న సంగతి తెలిసిందే. 144ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సమయంలో గంగ, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం చేయడం పుణ్యాన్ని కలగజేస్తుందని హిందువుల విశ్వాసం. ఆ అద్భుతమైన అవకాశాన్ని జైళ్ళలోని ఖైదీలు ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకే ఉత్తరప్రదేశ్‌ అధికారులు రాష్ట్రంలోని 75 జైళ్ళలో ఉన్న సుమారు 90వేల మంది ఖైదీలకు త్రివేణీ సంగమ జలాలతో కుంభమేళా స్నానం ఆచరించే అవకాశం కల్పించారు.

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ, అయోధ్య, అలీగఢ్ వంటి వివిధ పట్టణాలలోని జైళ్ళకు అధికారులు త్రివేణీ సంగమ క్షేత్రం నుంచి పవిత్ర జలాలను తీసుకుని వెళ్ళారు. అక్కడ జైళ్ళలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈ జలాలను కలిపి, తద్వారా కుంభస్నానం ఆచరించే అవకాశాన్ని ఖైదీలకు కల్పించారు. పవిత్ర స్నానాలు చేసిన తర్వాత ఖైదీలు జైల్లోనే ప్రార్థనలు, పూజా కార్యక్రమాలూ నిర్వర్తించుకున్నారు.

లఖ్‌నవూ నగరంలోని జైల్లో జరిగిన కార్యక్రమానికి యూపీ జైళ్ళశాఖ మంత్రి దారాసింగ్ చౌహాన్ హాజరయ్యారు. ‘‘బైట స్వేచ్ఛగా ఉండే ప్రజలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. కానీ జైళ్ళలో బందీలుగా ఉన్నవారు తమ విశ్వాసాన్ని అనుసరించే అవకాశం లేదు. వారు జైలు నాలుగు గోడలనూ దాటి పోలేరు. అందుకే వారికి ఈ అవకాశం కలగజేసాం. జైళ్ళ శాఖలోని అందరు అధికారుల సహకారంతో రాష్ట్రంలోని సుమారు 90వేల మంది ఖైదీలకూ ఈ పద్ధతిలో కుంభస్నానం ఆచరించే వెసులుబాటు కల్పించాం’’ అని ఆయన చెప్పారు.

నిజానికి చాలాచోట్ల జైళ్ళలోని ఖైదీలే తమకు ఈ సౌకర్యం కల్పించమని విజ్ఞప్తి చేసారని మంత్రి చెప్పారు. ‘‘బైట ఉన్న జనాలు త్రివేణీ సంగమానికి వెడుతున్నారు, పవిత్ర స్నానాలు చేస్తున్నారు. మాకు కూడా కుంభమేళా మీద విశ్వాసం ఉంది. సనాతన ధర్మం ప్రకారం త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని మేమూ కోరుకుంటున్నాం అని వారు అడిగారు. అందుకే మేము ఆ వెసులుబాటు కల్పించాము’’ అని వివరించారు.

‘‘రాష్ట్రప్రభుత్వం సూచనల మేరకు స్నాన పర్వానికి ఏర్పాట్లు చేసాము. ఖైదీల్లో వేర్వేరు మతాలకు చెందిన వారు సైతం ఈ కుంభస్నానాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు’’ అని అలీగఢ్ జైలు సూపరింటెండెంట్ బ్రిజేంద్ర సింగ్ యాదవ్ వెల్లడించారు.

2025 జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాన ముగుస్తుంది. అయితే ఈ ఉదయం సమయానికే, 60కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

Tags: holy dipMahakumbh 2025Prayag RajPrisoners in UP JailsTOP NEWSTriveni SangamUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.