Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

దేశ రాజధానిలో యమునానది ప్రక్షాళన కార్యక్రమం మొదలు

Phaneendra by Phaneendra
Feb 17, 2025, 05:39 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశ రాజధాని ఢిల్లీ పర్యావరణ ఆరోగ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్నీ పునరుద్ధరించడానికి మోదీ ప్రభుత్వం యమునానది ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిరకాలంగా ఎదురుచూస్తున్న ప్రక్షాళనతో పాటు 27ఏళ్ళుగా ఆగిపోయిన యమునా నదికి హారతి సంప్రదాయాన్ని కూడా పునరుద్ధరించారు. ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే ఈ కార్యక్రమం మొదలుపెట్టడం విశేషం, అరవింద్ కేజ్రీవాల్ వాగ్దాన భంగాలు, కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాల వైఫల్యాలకు భిన్నంగా యమునానది ప్రక్షాళన కార్యక్రమాన్ని బీజేపీ ఇంకా గద్దెనెక్కక ముందే ప్రారంభించింది. ఢిల్లీని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి, దేశ రాజధానికి ఆధ్యాత్మిక శోభలు అద్దడానికీ కాషాయ సర్కారు కంకణం కట్టుకుంది.

దశాబ్ద కాలం పాటు రాజకీయ శుష్క వాగ్దానాలు చేయడమే తప్ప ఒక్క అంగుళం పని కూడా చేయని ఆప్ సర్కారు కూలిపోయింది. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారుతో పాటు రాజధాని రాష్ట్రంలో సైతం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డబుల్ ఇంజన్ సర్కారుతో ఇక ఢిల్లీకి మంచిరోజులు వచ్చాయని కాషాయదళం చెబుతోంది. ఢిల్లీ ప్రజలకు చిరకాలం నుంచీ అమలవకుండా ఉండిపోయిన వాగ్దానాన్ని పూర్తి చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌ కుమార్ సక్సేనా పర్యవేక్షణలో యమునా నది ప్రక్షాళనకు ఆదివారం అధికారికంగా శ్రీకారం చుట్టింది. నాలుగు అంచెల వ్యూహంతో రాబోయే మూడేళ్ళలో యమునా నది ఆరోగ్యాన్ని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రాష్ స్కిమ్మర్స్, వీడ్ హార్వెస్టర్స్, డ్రెడ్జ్ యుటిలిటీ క్రాఫ్ట్స్ సాయంతో నది నుంచి వ్యర్థాలను తొలగిస్తారు. ఢిల్లీని పట్టిపీడిస్తున్న అత్యంత సంక్లిష్టమైన పర్యావరణ సమస్యల్లో ఒకటైన యమున కాలుష్యాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం మొదలైంది.

యమున ప్రక్షాళన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచార వాగ్దానం కూడా. యమునా నదిని సమూలంగా ప్రక్షాళన చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో పదేపదే చెప్పారు. యమునను పూర్తిగా శుభ్రం చేస్తామని, నదిని పునరుజ్జీవింపజేస్తామనీ హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో అలాంటి వాగ్దానాలే చేసినా వాటిని ఏనాడూ పట్టించుకోలేదు. కానీ బీజేపీ మాత్రం ఇంకా అధికార పగ్గాలు చేతిలోకి తీసుకోకముందే పని మొదలుపెట్టేసింది. కేజ్రీవాల్ హయాంలో యమున కాలుష్యం ఇంకా పెరుగుతూనే వచ్చింది. అంతేకాదు, శతాబ్దాలుగా జరుగుతున్న యమునా నదీహారతి సంప్రదాయాన్ని సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆపివేసారు. ఇప్పుడు ప్రక్షాళన పనులతో పాటు హారతి సంప్రదాయాన్ని పునరుద్ధరించారు కూడా. నిన్న ఆదివారం సాయంసంధ్య వేళ వాసుదేవ్ ఘాట్ వద్ద భవ్య యమునా హారతి నిర్వహించారు.  

యమున ప్రక్షాళన సమగ్ర ప్రణాళికలో భాగంగా నదిలోకి శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థ జలాలను వదిలిపెట్టకుండా పరిశ్రమలను నియంత్రిస్తారు. పర్యావరణ ప్రమాణాల అమలు కచ్చితంగా జరుగుతోందా లేదా అన్న సంగతిని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తనిఖీ చేస్తూంటుంది. ఫలితంగా యమున ప్రక్షాళన కేవలం స్వల్పకాలానికే కాక, దీర్ఘకాలికంగా చేస్తున్నారు.

Tags: AAPArvind KejriwalBhavya Yamuna AartiBJPDelhiDelhi AssemblyLG VK SaxenaPM Narendra ModiTOP NEWSYamuna Clean UpYamuna River
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.