Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం విధించిన ట్రంప్

Phaneendra by Phaneendra
Feb 6, 2025, 05:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో విశేష నిర్ణయం తీసుకున్నారు. బాలికలు, మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనడానికి అవకాశాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. పుట్టుకలో ఆడవారై ఉంటే మాత్రం వారికి అవకాశం ఉంటుంది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వనిధులను నిలిపివేస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు.

‘‘ఇకపై మహిళల క్రీడలు కేవలం మహిళలకే. మహిళల క్రీడల మీద యుద్ధం ముగిసింది’’ అని ట్రంప్ ప్రకటించారు. ‘మహిళల క్రీడల్లోనుంచి పురుషులను దూరంగా ఉంచడం’ అనే పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘‘ఈమధ్య చాలా విద్యాసంస్థలు, క్రీడా అసోసియేషన్లు మహిళల క్రీడల్లో పోటీ పడడానికి మగవారిగా పుట్టిన ట్రాన్స్‌జెండర్లను సైతం అనుమతిస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య మౌలికమైన తేడాలను విస్మరించడం వల్ల బాలికలకు, మహిళలకు విద్యాపరమైన సదుపాయాల్లో అర్ధవంతమైన అవకాశాలు లేకుండా పోతున్నాయి. అది బాలికలు, మహిళలకు అవమానకరం, అన్యాయం, ప్రమాదకరం కూడా. ట్రాన్స్‌జెండర్లను మహిళల కేటగిరీలో అనుమతించడం అనేది క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభ చూపించేందుకు బాలికలు, మహిళలకు సమాన అవకాశాలను నిరాకరించడమే. ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న విద్యాసంస్థలు, క్రీడల్లో పాల్గొనేందుకు మహిళలు, బాలికలకు ఉండే సమాన అవకాశాలను నిరాకరించలేవు. స్త్రీ పురుషుల మధ్య మౌలికమైన తేడాలను విస్మరించడం వల్ల బాలికలకు, మహిళలకు విద్యా సదుపాయాల్లో అర్ధవంతమైన అవకాశాలు లేకుండా పోతున్నాయని కొన్ని న్యాయస్థానాలు గుర్తించాయి’’ అని వైట్‌హౌస్ నుంచి జారీచేసిన ప్రకటనలో స్పష్టం చేసారు.

‘‘బాలికలు, మహిళలకు న్యాయబద్ధమైన క్రీడా అవకాశాలను లేకుండా చేసే విద్యాసంస్థలకు ప్రభుత్వ నిధులు అన్నీ రద్దయిపోతాయి. బాలికలు, మహిళలకు ప్రమాదం కలిగించేలాంటి, అవమానం కలిగించేలాంటి, వారి గోప్యతకు భంగం వాటిల్లేలాంటి కార్యక్రమాలను విద్యాసంస్థలు చేపడితే వాటికి నిధులు ఆగిపోతాయి. మహిళల క్రీడల్లో మగవాళ్ళు పోటీ పడడానికి అవకాశం కల్పించడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది’’ అని ఆ ప్రకటన స్పష్టం చేసింది.

ట్రాన్స్‌జెండర్లుగా మారిన పురుషులు వివిధ క్రీడాపోటీల్లో మహిళా విభాగాల్లో పాల్గొనడం, నిజమైన క్రీడాకారిణులను ఓడించడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. అమెరికాలోని 25 రాష్ట్రాలు ఇప్పటికే హైస్కూల్, యూత్ లెవెల్ క్రీడాపోటీల్లో మహిళల కేటగిరీలో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధిస్తూ చట్టాలు చేసాయి.

Tags: Executive Orderpresident donald trumpTOP NEWSTransgender AthletesusaWomen’s Sports
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.