Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్: విదేశీ మహిళా హోస్ట్‌ల కోసం క్రీడాకారులకు చెల్లింపులు నిలిపివేత

Phaneendra by Phaneendra
Jan 31, 2025, 05:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సంక్షోభంలో ఉంది. ఇప్పుడు జరుగుతున్న 2024-25 సీజన్‌ను ఆర్థిక నిర్వహణలో అవకతవకలు, క్రీడాకారుల బాయ్‌కాట్‌లు, మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలూ కుదిపేస్తున్నాయి. బీపీఎల్ వ్యూయర్‌షిప్ పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాటన్నిటికంటె దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా వెలుగు చూసింది. ఫ్రాంచైజీల యజమానులు క్రీడాకారుల చెల్లింపులను నిలిపివేసి మరీ, విదేశాల నుంచి మహిళా హోస్ట్‌లను తీసుకుని వచ్చారట. ఈ వార్త బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ విశ్వసనీయతను మరింత దెబ్బతీసింది.

స్థానిక క్రికెటర్లకు మిగతా పోటీల కంటె బీపీఎల్ ఆర్థికంగా మెరుగైన అవకాశాలు కల్పించే పోటీ అయినా చెల్లింపుల విషయంలో ఎప్పుడూ తలనొప్పులు ఉంటూనే ఉంటాయి. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. చాలా టీములు తమ క్రీడాకారులకు నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేయలేదు. దాంతో చాలామంది విదేశీ క్రీడాకారులు  గ్రౌండ్‌లోకి వెళ్ళడానికి సైతం నిరాకరించారు. కొంతమంది అయితే ఏకంగా మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసారు.

బీపీఎల్ నిబంధనల ప్రకారం సీజన్ జరిగే సమయంలో క్రీడాకారులకు 75శాతం చెల్లింపులు పూర్తి చేయాలి. కానీ ఈ సీజన్‌లో రాజ్‌షాహీ అనే జట్టు కేవలం నాలుగోవంతే చెల్లించింది. దానికి నిరసనగా ఓవర్సీస్ ప్లేయర్స్ అందరూ గత ఆదివారం నాడు మ్యాచ్ ఆడలేదు.

ఫార్చ్యూన్ బరిషాల్ అనే జట్టులో ఆడుతున్న ఇంగ్లిష్ క్రీడాకారుడు డేవిడ్ మలన్ ఇలాంటి పరిస్థితిని బహిరంగంగానే విమర్శించాడు. జనవరి 27న మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేరుగానే దుమ్మెత్తి పోసాడు. ‘‘మా పని క్రికెట్ ఆడడం. వారి పని సొమ్ములు చెల్లించడం. మీకు డబ్బులుంటే టీమ్‌ను తీసుకోండి. లేకపోతే లేదు. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదు’’ అని విమర్శించాడు.

మలన్ తమ జట్టయిన ఫార్చ్యూన్ బరిషాల్‌కు ఇలాంటి సమస్యలు లేవంటూ వివరణ ఇచ్చాడు. కానీ అతను చేసిన వ్యాఖ్యలతో మిగతా క్రీడాకారులు కూడా నోరువిప్పారు. ఆస్ట్రేలియన్ క్రీడాకారుడు విలియం బోసిస్టో కూడా పరిస్థితిపై తమ నిరాశను వ్యక్తం చేసాడు.  

బీపీఎల్ యజమానులు విదేశీ మహిళా హోస్ట్‌ల కోసం భారీగా ఖర్చు చేయడం ఈసారి అత్యంత వివాదాస్పదమైన విషయంగా నిలిచింది. లీగ్‌కు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, క్రీడాకారులకు చెల్లింపులు చేయడాన్ని వదిలిపెట్టేసారు. దానికి బదులు అమ్మాయిలకు ప్రాధాన్యమిచ్చారు.

మచ్చుకి, యేషా సాగర్ అనే యువతిని ఫారిన్ ఫిమేల్ ప్రెజెంటర్‌గా పట్టుకొచ్చారు. యేషా కెనెడియన్ నటి, మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె 2017లో పంజాబీ సంగీత పరిశ్రమలో తన కెరీర్ మొదలుపెట్టింది. పంజాబీ, హిందీ, తెలుగు భాషల్లో 30కి పైగా వీడియో ఆల్బమ్స్‌లో నటించింది. ఆమెను హోస్ట్‌గా తీసుకురావడానికి బీపీఎల్ నిర్వాహకులు భారీగానే ఖర్చుపెట్టారు. ఆ మేరకు క్రీడాకారులకు కోత పెట్టారు.

తమకు వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న స్థానిక క్రీడాకారులు మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వారిపై చర్యలు తీసుకునే విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.  

రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్తంగా అతివాద ఇస్లాం ప్రభావం పెరగడం వంటి కారణాలతో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. దేశమంతటా అతివాదుల కార్యకలాపాలు పెరిగిపోవడం, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు చేయడం వంటి గొడవలతో బంగ్లాదేశ్ అంతటా ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో బీపీఎల్ సైతం సంక్షోభంలో కూరుకుపోయింది. అలాంటి సమయంలో క్రీడాకారులకు చెల్లింపులు మానేసి విదేశీ యువతులను తీసుకురావడం వివాదాస్పదంగా నిలిచింది.

Tags: bangladesh crisisBangladesh Premier LeagueDawid MalanDurbar RahshahiNo Payments to PlayersTOP NEWSYesha Sagar
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.