Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

Phaneendra by Phaneendra
Jan 28, 2025, 04:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జర్నలిస్టు ముసుగులో హిందూ వ్యతిరేక ప్రచారం చేసే రాణా అయ్యూబ్ మీద ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదయింది. అడ్వొకేట్ అమితా సచ్‌దేవా ఫిర్యాదు మేరకు ఢిల్లీ సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.  

రాణా అయ్యూబ్ సామాజిక మాధ్యమాల్లోని తన ఖాతాల ద్వారా హిందూ దేవీదేవతలను అవమానిస్తున్నారని, భారతదేశపు ఐకమత్యానికి అపఖ్యాతి కలిగేలా మాట్లాడుతున్నారని, భారతదేశానికి వ్యతిరేకంగా శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారని, భారత సైన్యాన్ని అవమానిస్తున్నారని ఫిర్యాదుదారు అమితా సచ్‌దేవా తన ఫిర్యాదులో ఆరోపించారు. ఢిల్లీ సాకేత్‌లోని సెషన్స్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హిమాన్షు రమణ్‌సింగ్ ఆదేశాల మేరకు కేసు నమోదయింది.

ఫిర్యాదులో ఏముంది?

అడ్వొకేట్ అమితా సచ్‌దేవా తన ఫిర్యాదులో, రాణా అయ్యూబ్ 2013 నుంచి 2017 వ్యవధిలో పలుసార్లు ‘ఎక్స్’ (ట్విట్టర్) సామాజిక మాధ్యమంలో అవమానకరమైన పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. ఆ పోస్టుల ద్వారా ఆమె హిందువుల దేవతలను అవమానించారు, భారత వ్యతిరేక సెంటిమెంట్లను వ్యాపింపజేసారు, మత విద్వేషాన్ని రెచ్చగొట్టారు అని అమితా సచ్‌దేవా వివరించారు. రాణా అయ్యూబ్‌కు సమాజంలో ముస్లిం పాత్రికేయురాలిగా ఉన్న పలుకుబడి వల్ల ఆమె పోస్టులు ఎక్కువమందిని చేరి, వారిని రెచ్చగొట్టి మతసామరస్యాన్ని దెబ్బతీసాయని అమితా వాదించారు. తన వాదనను నిరూపించడానికి ఆమె పలు ఉదాహరణలు చూపించారు.

రాణా అయ్యూబ్ 2015లో ఒక పోస్ట్‌లో వీర సావర్కర్, హిందుత్వలకు వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేసారు. ‘‘హిందుత్వ జాతీయవాదానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణంగా రేప్‌ను వీర సావర్కర్ సూచించారు’’ అని రాణా అయ్యూబ్ ట్వీట్ చేసారు. అది నిరాధారమైనది, విద్వేషాలను రెచ్చగొట్టేది, గౌరవనీయుడైన ఒక చారిత్రక వ్యక్తిని అపహాస్యం చేసేది, లక్షలాది హిందువులకు ఆధారభూతమైన హిందుత్వ సిద్ధాంతంపై దాడి చేసేది అని అమితా సచ్‌దేవా వివరించారు.

2013 నాటి మరొక పోస్ట్‌లో రాణా అయ్యూబ్ శ్రీరామచంద్ర భగవానుణ్ణి అపహాస్యం చేసారు. ‘‘రావణుడు సీతను తాకగలిగి ఉండి కూడా తాకలేదు. రాముడు సీత కోసం నిలబడగలిగి కూడా ఆమెకోసం నిలబడలేదు. రావణుడికి ఒక మార్కు, రాముడికి సున్నా మార్కులు’’ అని ట్వీట్ చేసారు. రావణుడిని గొప్పగా చెప్పడం, రాముడిని అవమానించడం ద్వారా రాణా అయ్యూబ్ హిందువుల విశ్వాసాలను అవమానించారని అమితా వివరించారు.

2014 నాటి మరొక పోస్ట్‌లో రాణా అయ్యూబ్ సీతాదేవి, ద్రౌపది వంటి హిందువుల ఆరాధ్యనీయులైన స్త్రీమూర్తులను కించపరిచారని అమితా సచ్‌దేవా వివరించారు. ‘‘నిరుపేద సీత ఇంట్లో రావణాసురుడి అధికారం ఎంతసేపు ఉండగలదు? ద్రౌపది దుస్తులు ఆమె శరీరం మీద నుంచి ఎంతసేపటిలో లాగేసుకుంటారు?’’ అనే ట్వీట్ ద్వారా రాణా అయ్యూబ్  హిందూ సంప్రదాయాల పవిత్రతను అవమానించారని, హిందువులు పూజించే స్త్రీమూర్తులను అవమానించడంలో ఆమె అన్ని హద్దులూ దాటేసారనీ అమితా వాపోయారు.

రాణా అయ్యూబ్ భారత సైన్యాన్ని దూషిస్తూ కూడా పోస్టులు పెట్టారు. 2016లో ఆమె ఇలా ట్వీట్ చేసారు ‘‘ప్రియమైన భారత సైన్యమా, ఈ చిన్న పిల్లవాడు భారత సార్వభౌమత్వానికి ఎంత ప్రమాదకారి అనుకుని అతన్ని గుడ్డివాణ్ణి చేసేసారు.’’ భారత సైనిక బలగాలపై ప్రజల విశ్వాసం నశించిపోవాలనే దురుద్దేశంతో అత్యంత బాధ్యతారహితంగా భారత సైన్యాన్ని అవమానిస్తూ రాణా అయ్యూబ్ ఆ ట్వీట్ చేసారని అమితా సచ్‌దేవా వివరించారు.

అడ్వొకేట్ అమితా సచ్‌దేవా 2024 నవంబర్ 11న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ ద్వారా రాణా అయ్యూబ్‌ మీద ఫిర్యాదు చేసారు. తర్వాత దక్షిణ ఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్‌కు పలుమార్లు వెళ్ళి తన ఫిర్యాదు గురించి వాకబు చేసారు. కానీ సైబర్ క్రైమ్ పీఎస్ ఎలాంటి చర్యా తీసుకోలేదు. రాణా అయ్యూబ్ నేరాల తీవ్రత, వాటిపై చర్య తీసుకోని పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

కోర్టు ఏం చెప్పిందంటే…. :

అమితా ఫిర్యాదు మీద 2025 జనవరి 25న సాకేత్ కోర్టు సీజేఎం హిమాన్షు రమణ్‌సింగ్ విచారణ జరిపారు. అమితా తన ఫిర్యాదులో అందజేసిన వివరాల ప్రకారం రాణా అయ్యూబ్ చేసిన నేరాలు కేసు పెట్టదగినవి అని గుర్తించారు. ‘‘ఐపీసీ సెక్షన్ 153ఎ (రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం), సెక్షన్ 295ఎ (ఒక మతాన్ని అనుసరించే వారి మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం), సెక్షన్ 505 (ప్రజలను తప్పుదోవ పట్టించడం) ప్రకారం కేసు పెట్టదగిన నేరాలు జరిగాయని స్పష్టమయింది’’ అని వివరించారు.  

ఆరోపణల తీవ్రత కారణంగా ఈ కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోర్టు భావించింది. ఫిర్యాదుదారు స్వతంత్రంగా ఆధారాలు సేకరించలేరు కాబట్టి వాటి గురించి పోలీసు దర్యాప్తు జరిపించాలని స్పష్టం చేసింది. దక్షిణ ఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సరైన దర్యాప్తు జరపాలని, తగిన చర్యలు తీసుకోవాలనీ ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దక్షిణ ఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Tags: Anti-Hindu CommentsDelhi PoliceFIR FiledRana AyyubTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.