Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

మహాకుంభమేళా 2025: ద్వాదశ మాధవ పరిక్రమ గ్యాలరీని పెద్దసంఖ్యలో దర్శిస్తున్న భక్తులు

విశేషంగా ఆకట్టుకుంటున్న 10వ శతాబ్దం నాటి యోగముద్రలో విష్ణుమూర్తి విగ్రహం

Phaneendra by Phaneendra
Jan 25, 2025, 04:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహాకుంభమేళాలో భాగంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ప్రయాగరాజ్‌లో మరో అద్భుతమైన అనుభవం కలుగుతోంది. అదే ద్వాదశ మాధవ పరిక్రమ. విష్ణుమూర్తికి చెందిన పన్నెండు అపురూప మూర్తుల ప్రతిరూపాలను ప్రయాగలో ప్రదర్శిస్తున్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) ఈ ప్రదర్శనను సెక్టార్ 1లోని నమామి గంగే ఎగ్జిబిషన్ హాల్‌లో ఏర్పాటు చేసింది.  

ఈ గ్యాలరీలో సామాన్యశకం 10, 11 శతాబ్దాల నాటి భగవాన్ విష్ణుమూర్తి విగ్రహాల ప్రతిరూపాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అత్యంత అరుదైన యోగముద్రలో ఉన్న విష్ణుమూర్తి స్వరూపాన్ని దర్శించుకుని ప్రజలు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు.  

అరుదైన యోగముద్రలో విష్ణుమూర్తి

ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర కల్పవాస దీక్ష చేసేవారికి ఆ దీక్షా ఫలితం, స్నానం చేసేవారికి త్రివేణీ సంగమ స్నాన ఫలితం పూర్తిగా రావాలంటే ద్వాదశ మాధవ పరిక్రమ చేయాలని పురాణవాక్యం. అలాంటి ద్వాదశ మాధవుల గురించి సమగ్ర సమాచారంతో ఇంటాక్ ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించింది. ఇంటాక్ గ్యాలరీకి వెడుతున్న సందర్శకులు ద్వాదశ మాధవ దేవాలయాల గురించి, వాటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రత్యేకతను తెలుసుకుంటున్నారు.

ఇంతకీ ఆ ద్వాదశ మాధవ దేవాలయాలు ఏంటంటే… శ్రీ వేణీ మాధవ ఆలయం, శ్రీ ఆది మాధవ ఆలయం, శ్రీ మనోహర మాధవ ఆలయం, శ్రీ బిందు మాధవ ఆలయం, శ్రీ గదా మాధవ ఆలయం, శ్రీ చక్ర మాధవ ఆలయం, శ్రీ శంఖ మాధవ ఆలయం, శ్రీ అక్షయ వట మాధవ ఆలయం, శ్రీ సంకష్టహర మాధవ ఆలయం, శ్రీ అనంత మాధవ ఆలయం, శ్రీ అసి మాధవ ఆలయం, శ్రీ పద్మ మాధవ ఆలయం. ఆ గుడులన్నీ ప్రయాగరాజ్‌లోనే వేర్వేరు ప్రాంతాల్లో  ఉన్నాయి.  

త్రేతాయుగంలో మహర్షి భరద్వాజుడు ఈ ద్వాదశ మాధవ పరిక్రమను ప్రారంభించారని ఐతిహ్యం. అయితే మొగలులు, బ్రిటిష్ వారి పాలనాకాలంలో చాలా గుడులను ధ్వంసం చేయడంతో ఆ పరిక్రమకు అవాంతరాలు ఎదురయ్యాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక 1961లో మాఘమాసంలో శంకరాచార్య నిరంజన దేవతీర్థులు, ధర్మసామ్రాట్ కరపాత్రి స్వామీజీ సహాయ సహకారాలతో ప్రభుదత్త బ్రహ్మచారి మహరాజ్ ఈ పరిక్రమ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో పరిక్రమ సంప్రదాయం నిరాఘాటంగా కొనసాగుతోంది.

గంగా యమునా సరస్వతీ నదుల త్రివేణీ సంగమ క్షేత్రంలో విష్ణుమూర్తి శాశ్వత అస్తిత్వాన్ని ప్రతిఫలించేవే ఈ ద్వాదశ మాధవ దేవాలయాలు అని భక్తజనుల విశ్వాసం. త్రివేణీ సంగమ క్షేత్రపు పవిత్రతను పరిరక్షించడానికే విష్ణుమూర్తి పన్నెండు రూపాల్లో ప్రయాగరాజ్‌లో అవతరించాడట. మరో కథనం ప్రకారం ప్రయాగ ప్రాంతానికి క్షేత్ర పాలకుడిగా ఉండాలంటూ బ్రహ్మ, ఇతర దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు. వారి విజ్ఞప్తిని మన్నించిన విష్ణువు ద్వాదశ మాధవుల రూపాల్లో ప్రయాగలో అవతరించాడట.

ఈ దేవాలయాలు కాలాతీతమైన భక్తిభావనకు, ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమైన క్షేత్రాలు. తీర్థరాజమైన ప్రయాగకు మరింత వన్నెలద్దుతున్న పుణ్యస్థలాలు.

Tags: Dwadash Madhav ParikramaINTACHlord vishnuMahakumbh 2025Namami Gange Exhibition HallPrayagrajSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.