Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

సుభాష్ చంద్రబోస్: భారత స్వతంత్ర సంగ్రామ మార్గదర్శి

(నేడు సుభాష్ చంద్రబోస్ జయంతి)

Phaneendra by Phaneendra
Jan 23, 2025, 12:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

‘నేతాజీ’గా పేరు ప్రఖ్యాతులు గడించిన సుభాష్ చంద్రబోస్ నిఖార్సైన జాతీయవాది, శ్రోతలను ఆకట్టుకునే వక్త, సృజనశీలియైన నిర్వాహకుడు, అచంచలమైన దేశభక్తుడు, స్వతంత్రం కోసం భారత్ చేసిన పోరాటంలో సర్వశ్రేష్ఠుడైన యోధుడు. ఆజాద్ హింద్ ఫౌజ్ – భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడిగా బోస్ 1943 అక్టోబర్ 21న బ్రిటిష్ వారితో నిర్ణాయకమైన యుద్ధం చేసాడు.

1927లో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. ఆ సంస్థ భారత విముక్తి కోసం పోరాడుతోందని ఆయన మొదట్లో భావించాడు. కానీ కొద్దికాలంలోనే గాంధీతో సైద్ధాంతిక విభేదాలు, కాంగ్రెస్‌లో వర్గాల మధ్య పోరుతో ఆయన తన దారి మార్చుకున్నాడు. భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి  స్వతంత్రం కోసం సాయుధ పోరాటమే మార్గమని నిర్ణయించుకున్నాడు.

సుభాష్ చంద్రబోస్ ఆణిముత్యాలు:

— ఏమాత్రం రాజీపడని జాతీయవాదం, కచ్చితమైన న్యాయం, నిష్పాక్షికతల ఆధారంగానే భారతదేశపు విమోచన  సైన్యాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది. (1943)

— మనం నిలబడినప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ బలమైన రాతిగోడలా ఉండాలి. మనం కవాతు చేస్తున్నప్పుడు ఆవిరి నౌకలా ఉండాలి. (1943)

— ఇప్పుడు మనముందున్న లక్ష్యం కోసం నడుములు బిగించి నిలవండి. నేను మిమ్మల్ని (స్వతంత్ర పోరాటం కోసం) మనుషులు, ధనం, వస్తువులు కావాలని అడిగాను, చాలా ఉదారంగా ఇచ్చారు, ఇప్పుడు అంతకుమించి అడుగుతున్నాను. కేవలం మనుషులతో, డబ్బుతో, వస్తువులతో స్వతంత్రం సిద్ధించదు. వీరోచితమైన కార్యాలు చేయడానికి స్ఫూర్తిని కలిగించే ఆత్మశక్తి కావాలి. (1944 బర్మాలో)

— స్వతంత్రాన్ని సాధించగల వెల రక్తం మాత్రమే. నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని తెచ్చిపెడతాను. (జులై 1944 బర్మాలో)

— భారతమాత పిలుస్తోంది. రక్తం కోసం రక్తం పిలుస్తోంది. లేవండి. మనకు వృధా చేసేంత సమయం లేదు, లేచి మీ ఆయుధాలు అందుకోండి. శత్రుశిబిరాలను చీల్చుకుంటూ మన మార్గాన్ని నిర్మించుకోవాలి. దైవం కోరుకుంటే మనం అమరవీరుడిలా మరణించాలి. మన చివరి నిద్రలో, మన సైన్యాన్ని ఢిల్లీకి చేర్చగల రహదారిని ముద్దాడాలి. అదే స్వతంత్రానికి మన మార్గం. చలో ఢిల్లీ. (1946)

— ఒక యోచన కోసం ఒక వ్యక్తి మరణించవచ్చు. కానీ ఆ ఆలోచన – అతని మరణం తర్వాత – తనంత తనే వెయ్యి జీవితాలుగా అవతరిస్తుంది.  

— మన దేశంలో ప్రధాన సమస్యలు పేదరికం, నిరక్షరాస్యత, రోగాలు అనడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఉత్పత్తి-పంపిణీ శాస్త్రీయంగా జరగాలి. భవిష్యత్తులో ఏర్పడే మన జాతీయ ప్రభుత్వం మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే దేశ పునర్నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రచించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.

— సత్యం అనేదాన్ని మనం సమగ్రంగా అర్ధం చేసుకునేందుకు మన బలహీనమైన అవగాహన సరిపోదు. ఏదేమైనా మనం మన జీవితాన్ని వీలైనంత ఎక్కువ నిజం ఉన్న సిద్ధాంతం ఆధారంగా నిర్మించుకోవాలి. పరమ సత్యాన్ని మనం తెలుసుకోనంత మాత్రాన, లేక తెలుసుకోలేనంత మాత్రాన మనం ఏమీ చేయకుండా కూర్చోకూడదు.

— జీవితంలో ఘర్షణ లేకపోతే, జీవితంలో ఎలాంటి రిస్కూ తీసుకోకపోతే దానిమీద ఆసక్తి సగం చచ్చిపోతుంది. పెద్దపెద్ద లక్ష్యాలు ఉన్నవారికి జీవితంలోని అనిశ్చిత పరిస్థితులు భయంకరంగా అనిపించవు. పైగా, ఒక వ్యక్తి సివిల్ సర్వీస్ అనే సంకెళ్ళలో బందీ అయిపోతే అతనికి తన దేశానికి పూర్తిస్థాయిలో తన శక్తిమేరకు సేవ చేయడం సాధ్యం కాదు. ఒక్కముక్కలో చెప్పాలంటే సివిల్ సర్వీస్ ఉద్యోగానికీ… జాతీయ, ఆధ్యాత్మిక ఆకాంక్షలకూ ఏమాత్రం పొసగదు. (1978)

— బ్రిటన్‌కు కష్టం – భారతదేశానికి అవకాశం (1939)

— జాతీయ సామ్యవాదం అనేది కేవలం స్వార్థం, కుత్సిత్వం మాత్రమే కాదు, శాస్త్రీయ ప్రాతిపదిక అత్యంత బలహీనంగా కలిగిన దురహంకార తత్వం.

బోస్ గురించి ప్రముఖులు ఏమన్నారంటే:

1956లో క్లెమెంట్ అట్లీ, జస్టిస్ పి.బి చక్రవర్తి మధ్య సంభాషణ జరిగింది. ఆ సందర్భంగా చక్రవర్తి అట్లీని ఇలా అడిగారు. ‘‘గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం చాలాకాలం క్రితమే చల్లారిపోయింది. 1947లో బ్రిటిష్ వారు కంగారు పడిపోయేటంతటి అత్యవసర పరిస్థితి కొత్తది ఏదీ లేదు. మరి, ఎందుకు బ్రిటిష్ వారు భారతదేశాన్ని హడావుడిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు?’’ దానికి అట్లీ చాలా కారణాలు చెప్పారు. వాటిలో రధానమైనది… భారత సైన్యంలోనూ, నౌకాదళంలోనూ బ్రిటిష్ రాజరికం పట్ల విధేయత క్షీణించిపోయింది. దానికి కారణం నేతాజీ మిలటరీ కార్యకలాపాలే’’ అని అట్లీ స్పష్టం చేసారు.  

‘‘భారత స్వతంత్ర పోరాటం సుదీర్ఘకాలపు ఘర్షణ. లక్షలాది భారతీయుల ఆత్మబలిదానాలే ఆ పోరాటాన్ని పట్టి నిలిపాయి. ఆ పోరాటంలో తమ సర్వస్వాన్నీ త్యాగం చేసిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అగ్రగణ్యులు. ప్రతీ భారతీయుడి హృదయంలోనూ ఆయనకు గౌరవాభిమానాలతో కూడిన చోటు ఎప్పటికీ ఉంటుంది…. నేతాజీ రాజకీయ ప్రవేశం భారతదేశపు స్వతంత్ర పోరాటాన్ని కీలక మలుపు తిప్పింది. ఓ కొత్త ఉత్సాహం దేశాన్నంతటినీ కుదిపేసింది. ఆయన అవిశ్రాంతంగా చైతన్యశీలంగా చేసిన పోరాట స్ఫూర్తి ఆయనను మన సొంత దారి కంటె భిన్నమైనది…. పిరికిదనపు దారి ఒక్కటే తప్పుడు దారి అని గాంధీ చెప్పేవారు. ధైర్యంగా అడుగువేసే మార్గం ఎప్పుడూ తప్పు కాదు. నేతాజీది అలాంటి ధైర్యమైన మార్గం, అది స్వతంత్రమనే లక్ష్యాన్ని మరింత దగ్గర చేసింది.’’ – ఇందిరాగాంధీ

Tags: birth anniversaryFreedom StruggleIndian National ArmyNetajiSLIDERSubhash ChandraboseTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.