Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

’ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మారు.. వారి నమ్మకాన్ని నిలుపుకొన్నాం‘

ఐదేళ్ల చీకటి పాలన నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తున్నాం: పవన్ కళ్యాణ్

Phaneendra by Phaneendra
Jan 8, 2025, 10:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

‘‘అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్ నుంచి.. అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి మేమంతా కష్టపడి పని చేస్తున్నాం. గత ఐదేళ్ల చీకటి రోజుల నుంచి, అరాచక పాలన నుంచి మళ్లీ వెలుగు రేఖలు రాష్ట్రంలో పూయించడానికి అడుగులు వేస్తున్నాం. దీనిలో భాగమే రాష్ట్రానికి ఒకేసారి రూ. 2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో తీసుకువచ్చాం. ఈ నిరంతర అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి. ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటూ వారికి మరింత అండగా నిలుస్తాం’’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

బుధవారం విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ. 2.08 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పలు జాతీయ రహదారులు, ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ “సదుద్దేశం.. సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా అది నిరర్ధక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. ఒక సదాశయం.. సత్సంకల్పంతో ఇంకొకకరు కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ప్రజలతో మమేకమై వారందర్నీ ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మ నిర్భర్ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ప్రజలకు వారి పరిసరాల శుభ్రత, బాధ్యత తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్యసాహసాలు నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారత్ అవుతుంది. అది ఒక రోజున అఖంఢ భారత్ గా వర్దిల్లుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ధృడమైన దేశం కోసం, జగత్ అంతా వసుధైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ, పరిశ్రమిస్తూ.. ఆ క్రమంలో ఎదురైన ప్రతి పరాజయాన్ని, ప్రతి అవమానాన్ని నవ్వూతూ స్వీకరిస్తూ.. వాటినే విజయానికి ఇంధనంగా వాడుకుంటూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నా తరఫున, ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నమస్కారాలు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలను అభివృద్ధిపదంలో నడిపిస్తున్న దార్శనికులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. ఎన్డీఏ కూటమికి ఓటు వేసి 164 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు కట్టబెట్టిన ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు. నిలబడ్డారు. అలా నిలబడినందుకు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ఈ రోజున ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్, ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు మొత్తం కలిపి రాష్ట్రానికి రూ. 2 లక్షల పది వేల కోట్ల పెట్టుబడులు, ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

 

అభివృద్ధిలో అందరికీ సమాన వాటా మోదీ సంకల్పం:

అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవిల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధాన మంత్రి గారిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా, నమ్మకం, ప్రధానమంత్రిపై చూపిన నమ్మకం నేడు రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి. 70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆ గ్రామాలకు ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం కింద ఈ రోజున రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్నుతట్టి నిధులు సమకూరుస్తుండడమే కారణం. భారతదేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ రోజు ఈ పెట్టుబడులు. వారి సంకల్పానికి, సహకారానికి ఆయన మార్గదర్శకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

 

రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం:

ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయిన సమయంలో ఎన్డీఏ కూటమితో ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు మోదీ ఆశాజ్యోతిగా నిలిచారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి అస్కారమే లేదు అనే పరిస్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకొనేలా చంద్రబాబునాయుడు నాయకత్వంలో, ప్రధానమంత్రి నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తున్నాం. వారి సూచనలు, సలహాలతో రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం. దేశ ప్రగతిలో భాగస్వాములవుతాం. ప్రధాన మంత్రిగారికి అండగా ఉంటాం.  ప్రజలు నమ్మకం పెట్టారు. మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రూ. రెండు లక్షల పై చిలుకు పెట్టుబడులు తీసుకువచ్చారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నాయకత్వంలో మా సహచర మంత్రులు, కార్యకర్తలు అభివృద్ధిలో భాగస్వాములవుతాము. ప్రజలంతా ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా ప్రధాని నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను” అన్నారు.

Tags: AP CM N Chandrababu NaiduDy. CM Pawan KalyanPM Narendra ModiSLIDERTOP NEWSVisakhapatnam Public MeetingVisakhapatnam Railway Zone
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.