Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

జామియాతో సంయుక్త ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లో ముస్లిం రిజర్వేషన్లు వద్దని డీయూ ప్రతిపాదన

Phaneendra by Phaneendra
Dec 31, 2024, 12:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (సీఐసీ) ఓ వివాదాస్పద ప్రతిపాదన గురించి యోచిస్తోంది. ఆ కేంద్రం జామియా మిలియా ఇస్లామియాతో ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఎమ్మెస్సీ మ్యాథ్స్ ప్రోగ్రామ్‌లోకి అడ్మిషన్లలో ముస్లిములకు రిజర్వేషన్లు తొలగించాలని భావిస్తోంది. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే, 2013లో ఆ కోర్స్ మొదలు పెట్టిన నాటినుంచీ ఉన్న సీట్ల కేటాయింపు పద్ధతిని సమూలంగా మార్చేస్తుంది.

మెటా యూనివర్సిటీ కాన్సెప్ట్ కింద ప్రారంభించిన ఎమ్మెస్సీ ప్రోగ్రామ్ ఢిల్లీ యూనివర్సిటీకి, జామియా మిలియా ఇస్లామియాకు మధ్య సహకారానికి చిహ్నం. ఆ ప్రోగ్రాంలోకి అడ్మిషన్ల కోసం ఒక ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రస్తుతం ఉన్న సీట్ల పంపిణీ నమూనాలో కొన్ని సీట్లు ముస్లిం విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేసి ఉంచుతారు.

మొత్తం 30 సీట్లు ఉంటే 12 అన్‌రిజర్వుడ్ కేటగిరీ, 6 ఓబీసీలకు, 4 ముస్లిం జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు, 3 ఆర్థికంగా బలహీనులైన వర్గాల వారికి (ఈడబ్ల్యూఎస్),  2 ఎస్సీలకు, 1 ఎస్టీలకు, 1 ముస్లిం ఓబీసీలకు, 1 ముస్లిం మహిళలకు కేటాయిస్తారు.

ఇందులో ముస్లింలకు రిజర్వేషన్ తొలగించాలన్న ప్రతిపాదన గురించి సీఐసీ గవర్నింగ్ బాడీ సోమవారం జరిగిన సమావేశంలో చర్చించింది. విశ్వవిద్యాలయాల కోర్సుల్లో సీట్ల రిజర్వేషన్ మతం ప్రాతిపదికన చేయకూడదు అన్న నియమాన్ని అనుసరించి ఆ ప్రతిపాదన వచ్చింది. ‘‘కుల రిజర్వేషన్లలో భాగంగా వెనుకబడిన తరగతుల వారికిచ్చే రిజర్వేషన్ వేరు. ఇది ఆ పరిధిలోకి రాదు’’  అని సీఐసీకి చెందిన ఒక అధికారి చెప్పారు.

ఎమ్మెస్సీ మ్యాథ్స్ ప్రోగ్రామ్‌ను ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా సంయుక్తంగా నిర్వహిస్తున్నా, ఈమధ్యకాలంలో అడ్మిషన్ల ప్రక్రియ మొత్తాన్నీ ఢిల్లీ యూనివర్సిటీయే చూసుకుంటోంది. కాబ్టి ఆ మొత్తం కోర్సుకు ఢిల్లీ విశ్వవిద్యాలయపు రిజర్వేషన్ విధానాలనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

‘‘ఈ ప్రతిపాదన మీద చర్చలు జరుగుతున్నాయి. గవర్నింగ్ బాడీ ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ ప్రతిపాదనను అనుమతి కోసం వైస్‌ఛాన్సలర్‌ వద్దకు పంపిస్తాం’’ అని సీఐసీ అధికారి వెల్లడించారు.

మెటా యూనివర్సిటీ కాన్సెప్ట్ అంటే వేర్వేరు సంస్థలకు చెందిన వనరులను, నైపుణ్యాలనూ ఉమ్మడిగా వాడుకోవడం. అలా రెండు యూనివర్సిటీల బలాలను అందరికీ ఉపయోగపడేలా వాడుకోవడం. ఈ కోర్స్ భారతదేశంలో ప్రత్యేకమైనది. ఈ కోర్స్ పూర్తిచేసేవారికి ఇచ్చే డిగ్రీ పట్టా మీద రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాల లోగోలూ ఉంటాయి.  

ఈ ప్రోగ్రామ్ ప్రారంభించిన కొత్తలో, 50శాతం విద్యార్ధులు డీయూ నుంచి, మిగతా 50శాతం జామియా మిలియా ఇస్లామియా నుంచీ ఉండాలనీ భావించారు. అయితే రిజర్వుడు సీట్ల పంపిణీ విషయంలో నిర్ణయాన్ని తరవాత తీసుకుంటారు.

Tags: Delhi UniversityJamia Milia IslamiaMeta University ConceptMSc Maths ProgramMuslim ReservationSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.