Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు: అల్లు అర్జున్ గొడవపై పవన్ కళ్యాణ్

Phaneendra by Phaneendra
Dec 30, 2024, 04:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పుష్ప-2 సినిమా ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ వంటి పరిణామాలపై ప్రముఖ సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటిసారి స్పందించారు. గోటితో పోయే విషయాన్ని గొడ్డలి వరకూ తెచ్చారని అభిప్రాయపడ్డారు.

‘‘అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, తెర వెనుక ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం వల్లే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. అక్కడ బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చారు, టికెట్ల ధరలు పెంచుకోడానికీ అవకాశం కల్పించారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనల్లో పోలీసులు అందరి భద్రత గురించే ఆలోచిస్తారు, వాళ్ళను తప్పుపట్టను. అల్లు అర్జున్‌కు థియేటర్ సిబ్బంది ముందు చెప్పి ఉండాల్సింది, లేదా ఆయన సీట్లో కూర్చున్న తర్వాత అయినా చెప్పి బైటకు తీసుకువెళ్ళాల్సింది’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ మధ్యాహ్నం మీడియాతో ముచ్చటించారు.

‘‘ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా బాధ కలిగించింది. అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం దగ్గరకు ముందుగానే వెళ్ళిఉంటే బాగుండేది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. బాధిత కుటుంబానికి అందరం అండగా ఉన్నామని ముందే చెప్పిఉండాల్సింది. ఎవరి ప్రమేయమూ లేకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి ఉండాల్సింది. విషయం తెలిసిన వెంటనే రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవడం వల్లనే ప్రజల్లో అంతగా ఆగ్రహం వ్యక్తమైంది’’ అని పీకే భావించారు.

‘‘అల్లు అర్జున్ తన వల్ల ఒకరు చనిపోయారని చాలా ఆవేదన చెందారు. కానీ అర్జున్ ఒక్కరినే దోషిగా చూపడమూ సరికాదు. సినిమా అనేది అందరి భాగస్వామ్యంతో ఉండేది. ఆరోజు దుర్ఘటన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం హోదాలో స్పందించారు. సినిమా వేడుకలో రేవంత్ రెడ్డి పేరు చెప్పనందునే ఇలా చేసారని నేను అనుకోవడం లేదు. అలాంటి వాటికి మించిన నాయకుడు ఆయన. రేవంత్‌కు రాంచరణ్, అల్లు అర్జున్ చిన్నతనం నుంచీ తెలుసు. అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా. కాకపోతే, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి’’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసారు. 

Tags: allu arjun arrestAP Deputy CMpawan kalyanPushpa 2 Premier Show StampedeRevanth ReddyRevati DeathSLIDERTelangana CMTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.