Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

హుండీలో పడిపోయిన ఐఫోన్‌ తీసివ్వడానికి ఒప్పుకోని ఆలయ అధికారులు

Phaneendra by Phaneendra
Dec 24, 2024, 02:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడులోని తిరుపోరూర్ కందస్వామి దేవాలయంలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు జారి హుండీలో పడిపోయింది. దాన్ని తీసి ఇవ్వడం కుదరదంటూ దేవదాయ శాఖ అధికారులు తెగేసి చెప్పారు. దాంతో ఆ భక్తుడు లబోదిబోమంటున్నాడు.

వినాయగపురానికి చెందిన దినేష్ అనే భక్తుడు డిసెంబర్ 20న కందస్వామి గుడికి కుటుంబ సమేతంగా వెళ్ళాడు. దర్శనం, పూజ పూర్తయాక హుండీలో దక్షిణ వేసే క్రమంలో అతని చొక్కా జేబులోని ఐఫోన్ జారి హుండీలో పడిపోయింది. కంగారు పడిన దినేష్, దేవాలయ అధికారులకు విషయం చెప్పాడు. తన ఫోన్‌ను వెనక్కి ఇప్పించాలని కోరాడు. అయితే, హుండీని వెంటనే తీయడం కుదరదని, ఒకవేళ తీసినా, అందులో ఉన్న వస్తువులు స్వామివారికే చెందుతాయి కాబట్టి ఫోన్ వెనక్కి ఇవ్వబోమనీ చెప్పారు.

దేవాలయ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఆ గుడిలో హుండీ రెండు నెలలకు ఒకసారి తీస్తారు. దానికి సంక్లిష్టమైన అధికారిక ప్రక్రియ ఉంటుంది. అందువల్ల మళ్ళీ హుండీ తెరిచేవరకూ వేచి ఉండాలని చెప్పారు. అంతే కాదు, అసలు హుండీలో పడిన వస్తువును వెనక్కి ఇవ్వబోమని తేల్చిచెప్పారు.

దినేష్ కుటుంబం విజ్ఞప్తి మేరకు ఎట్టకేలకు అదేరోజు హుండీ తెరిచారు. అందులోనుంచి దినేష్ ఐఫోన్ బైటకు తీసారు. అయితే అధికారులు తమ నియమాలకే కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. ‘‘తెలిసి వేసినా, ప్రమాదవశాత్తూ పడిపోయినా హుండీలో ఉన్న వస్తువులు అన్నింటినీ స్వామివారి సొత్తుగా భావించడం సంప్రదాయం. ఆ ఫోన్ ఇప్పుడు ఆలయ నిర్వాహకుల కస్టడీలో ఉంది. ఫోన్ పొరపాటున జారిపడిందా లేక భక్తుడు ముందు ఫోన్‌ను హుండీలో వేసి, తర్వాత తన నిర్ణయం మార్చుకున్నాడా అన్న సంగతి మాకు తెలియదు కదా’’ అని ఆలయం ఈఓ కుమరవేల్ చెప్పుకొచ్చారు.

దేవాలయం అధికారులు ఆ ఫోన్‌లోని సిమ్‌కార్డును దినేష్‌కు వెనక్కిచ్చేసారు. కానీ ఫోన్ మాత్రం ఆలయం ఆస్తిగానే ఉంటుందని చెప్పారు. ఆ విషయంలో తామేమీ చేయలేమనీ, ఉన్నతాధికారులను సంప్రదించమనీ సలహా ఇచ్చారు.

తమిళనాడు దేవదాయ శాఖ ఈ విషయంలో ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతోంది. ఆ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు ‘‘హుండీలో వేసే వస్తువులన్నీ స్వామివారికే చెందుతాయన్నది సంప్రదాయం. అయితే ఈ కేసులో చట్టపరంగా ఏమైనా మినహాయింపు ఇచ్చే మార్గం ఉందా అన్నది తెలుసుకుంటాం’’ అని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ఉండే చట్టపరమైన, విధానపరమైన సంక్లిష్టతలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై అధికారులు చర్చిస్తున్నారు.  

ఈ వ్యవహారంలో దేవదాయ శాఖ నియమ నిబంధనల మీద సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో అధికారులు పట్టువిడుపుల ధోరణితో వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.

Tags: HR&CE DepartmentiPhone in HundiKandaswamy TempleSLIDERTamil NaduThiruporurTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.