Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

రంగస్థలంపైనే పందిని చంపి మాంసం తిన్న నటుడు

ఒడిషాలో రామాయణ నాటక ప్రదర్శనలో ఘటన

Phaneendra by Phaneendra
Dec 4, 2024, 11:12 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఒడిషా గంజాం జిల్లాలో రామాయణ నాటక ప్రదర్శనలో ఒక ఘోరం జరిగింది. రాక్షస పాత్ర ధరించిన బింబాధర్ గౌడ (45) అనే నటుడు వేదిక పైనే ఒక పందిని చీల్చి చంపి, దాని పచ్చి మాంసాన్ని తిన్నాడు. అదే నాటకంలో బతికున్న పాములను కూడా ఆడించారు. ఆ కిరాతకమైన సంఘటన హింజిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రలబ్ గ్రామంలో నవంబర్ 24న జరిగింది. ఆ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. శాసనసభలో సైతం ఆ ఘటనను ఖండించారు.

దిగ్భ్రాంతికరమైన ఆ చర్యకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దానిపై జంతువుల హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. అధికార బీజేపీ ఎమ్మెల్యేలు బాబూసింగ్, సనాతన్ బిజులీ ఆ సంఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ తీవ్రంగా ఖండించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

దారుణమైన పనికి పాల్పడిన బింబాధర గౌడను, కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసారు. జంతువులను హింసించారని, వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో పోలీసులు వారిపై కేసులు పెట్టారు.  

ఆ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దానిలో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించే పనిలో ఉన్నామనీ బరంపురం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీ ఖోఖర్ చెప్పారు. ఆ నాటక ప్రదర్శనలోనే సజీవంగా ఉన్న పాములను ఆడించారు. అటవీశాఖ నియమాలకు అది విరుద్ధం కావడంతో, బాధ్యులపై చర్యలకు సిద్ధపడుతున్నారు. ఒడిషాలో గత ఆగస్టులో జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం పాములను బహిరంగంగా ప్రదర్శించడంపై నిషేధం ఉంది.

గంజాం జిల్లాలో కంజియానాల్ యాత్ర సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో నాటకం ప్రదర్శించారని, దానికి పెద్దస్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించడం కోసమే ఈ దారుణమైన చర్యలకు పాల్పడ్డారనీ హింజిలి పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ ఇన్‌ఛార్జ్ శ్రీనిబాస్ సేథీ చెప్పారు. స్టేజి మీద సీలింగ్‌ నుంచి బతికున్న పందిని వేలాడదీసి దాన్ని కత్తితో చీల్చి చంపి, ప్రేక్షకులు అందరూ చూస్తుండగా దాని పచ్చిమాంసాన్ని తిన్నాడు. దానిపై జంతువుల హక్కుల కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఆ సంఘటనపై కేసు రిజిస్టర్ చేసామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ ఇనస్పెక్టర్ శ్రీనిబాస్ సేథీ చెప్పారు.

Tags: andhra today newsGanjam DistrictOdishaPig Killed on StageRamayana PlaySLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.