Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

నాపై యెల్లో మీడియా అసత్య ప్రచారం, 100 కోట్లకు పరువు నష్టం దావా

మా ప్రభుత్వపు విద్యుత్ ఒప్పందాలతో వేలకోట్లు ఆదా: వైఎస్ జగన్

Phaneendra by Phaneendra
Nov 29, 2024, 10:30 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గౌతమ్ అదానీ మీద అమెరికాలో నమోదైన కేసులో తన పేరు ఉందన్న ప్రచారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, యెల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.

అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి (సెకి) మధ్య జరిగిన ఒప్పందం అని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. యెల్లో మీడియా సంస్థలు పదే పదే వాస్తవాల్ని వక్రీకరించి అబద్ధాలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ కేసులో తన పేరు ఎక్కడా లేదని, కానీ ఆ రెండు మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయని, వాటికి లీగల్ నోటీసులు పంపిస్తానని వెల్లడించారు.

తన గురించి తప్పుడు రాతలు రాస్తున్నాయని ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై ఆరోపించారు. ఆ పత్రికలకు జగన్ 48 గంటల గడువు విధించారు. ఆలోగా క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏపీ చరిత్రలోనే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాస్తున్నారంటూ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సెకితో తమ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా అవుతుందని, పాతికేళ్లలో లక్ష కోట్ల వరకూ ఆదా అయ్యేవని చెప్పారు. అందులో అవినీతికి ఆస్కారమే లేదన్నారు. యూనిట్ విద్యుత్తు రూ.2.49కి విక్రయించడానికి కేంద్రం ముందుకొచ్చిందని, అది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించే ఒప్పందం అని స్పష్టం చేశారు.

చంద్రబాబు చేసుకున్న పీపీఏల వలన 2 వేలకోట్లు అదనపు భారం పడితే.. తమ ప్రభుత్వ నిర్ణయం వలన ఆదా అయ్యిందని చెప్పారు. యూనిట్ విద్యుత్‌కు రూ.5.90 పైసలకు ఒప్పందం చేసుకున్న చంద్రబాబు మంచోడా? యూనిట్ రూ.2.49 చొప్పున ఒప్పందం చేసుకున్న నేను మంచివాడినా? అని ప్రశ్నించారు. ఆ ఒప్పందం గురించి కూడా మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

చంద్రబాబు పాలనలో డిస్కం‌లు దెబ్బతిన్నాయని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు రాకముందు డిస్కంలకు రూ.29 వేలకోట్లు బకాయిలు ఉంటే, చంద్రబాబు దిగిపోయేనాటికి ఆ బకాయిలు, అప్పులు రూ.86 వేలకోట్లకు పెరిగాయంటూ గణాంకాలు వివరించారు. 

డిస్కంల మీద, ప్రభుత్వం మీద భారం పడకుండా, రైతులకు ఊరట కలిగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. సోలార్ పార్కుల ఏర్పాటుకు 2020 నవంబర్‌లో ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచామని, ఆ టెండర్లలో రూ. 2.49 పైసలు నుంచి రూ.2.58 పైసలకు చొప్పున సరఫరా చేసేందుకు సుమారు 24 బిడ్ల వరకూ దాఖలయ్యాయని వివరించారు.  దానికి చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో చేసుకున్న విండ్‌, సోలార్‌ పవర్‌ ఒప్పందాలతో ఏపీకి అదనపు భారం పడింది. చంద్రబాబు పీపీఏల వల్ల రూ.2 వేల కోట్ల భారం పడింది. అదనంగా రూ.3.41 కట్టాల్సి వచ్చిందని వివరించారు.

Tags: Agreementsandhra today newsdefamation suitGautam AdaniSECISLIDERSolar PowerTOP NEWSYellow MediaYS Jaganmohan Reddy
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.