Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

ఆర్ఆర్ఆర్‌ను హింసించిన కేసులో సిఐడి మాజీ అధికారికి రిమాండ్

Phaneendra by Phaneendra
Nov 27, 2024, 07:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగుదేశం ఎమ్మెల్యే రఘు రామకృష్ణ రాజును గత ప్రభుత్వ హయాంలో హింసించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ అదనపు ఎస్‌పి విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు విజయ్‌పాల్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

ఏపీ పోలీసులు సిఐడి మాజీ అడిషనల్ ఎస్‌పి విజయ్‌పాల్‌ను నిన్న (మంగళవారం) ఉదయం ప్రకాశం జిల్లా ఎస్‌పి ముందు విచారణకు తీసుకువెళ్ళారు. రాత్రి 7 గంటల సమయంలో అరెస్ట్ చేసారు. ఇవాళ ఉదయం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానానికి 11 పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించారు. విజయ్‌పాల్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయవలసి ఉన్నందున రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ 2021లో రఘు రామకృష్ణ రాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేసారు. హైదరాబాద్‌ నుంచి బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, హత్యాప్రయత్నం చేసారనీ రఘు రామకృష్ణ రాజు ఈ యేడాది జులై 11న గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో ఫిర్యాదు చేసారు.

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాటి ఎపి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అదనపు ఎస్‌పి విజయ్‌పాల్ తదితరులపై కేసు నమోదు చేసారు. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయ్‌పాల్ పెట్టుకున్న దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్‌పై మొన్న సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విజయ్‌పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో నిన్న మంగళవారం విజయ్‌పాల్ విచారణకు హాజరయ్యారు. నిన్న సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు.

Tags: andhra today newsAP CID Former Additional SPRaghu Ramakrishna RajurrrSLIDERTOP NEWSVijay Paul
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.