Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

దక్షిణ భారతంలో తొలిసారిగా, మన భాగ్యనగరంలో లోక్‌మంథన్

నాలుగు రోజుల సాంస్కృతిక వేడుక ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి

Phaneendra by Phaneendra
Nov 15, 2024, 05:07 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతీయ సాంస్కృతిక ఏకత్వాన్ని చాటిచెప్పే మహోత్సవం లోక్‌మంథన్ కార్యక్రమం దక్షిణ భారతదేశంలో మొదటిసారి ఈ యేడాది భాగ్యనగరంలో జరగనుందని కేంద్ర మంత్రి, లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి తెలిపారు. నాలుగు రోజులు జరిగే కార్యక్రమాన్ని ఈ నెల 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని వెల్లడించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్‌, ఆచార్య మిథిలేష్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమ వివరాలను ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రజ్ఞా ప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె.నందకుమార్‌తో కలిసి వివరించారు. 

లోక్‌మంథన్ రెండేళ్లకొకసారి నిర్వహించే కార్యక్రమం. మన దేశం, దేశ సాంస్కృతిక వారసత్వం, దేశ ప్రజల జీవన విధానం వంటి విషయాలను గురించి ప్రపంచవ్యాప్త ప్రముఖులతో ఆలోచనా మథనం చేసే కార్యక్రమమే ఇది. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పారామంలో నవంబర్ 21 నుంచి 24 వరకూ నిర్వహిస్తారు. నవంబర్ 21న ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఉంటుంది. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభిస్తారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక విదేశాల నుంచి కూడా జాతీయ భావజాలం కలిగిన వందలాది కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, కవులు, కళాకారులు సహా అన్ని వర్గాలవారు ఈ లోక్‌మంథన్‌లో పాల్గొంటారు. వర్తమాన సమస్యలు, సవాళ్ళపై సెమినార్లు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు. వనవాసి, గ్రామవాసి, నగరవాసి… అందరూ కలిస్తేనే భారత్‌వాసి అవుతామని లోక్‌మంథన్ ఉద్దేశ్యం. అందుకే ఈ కార్యక్రమంలో వారందరూ పాల్గొంటారు. రాజకీయాలకు అతీతంగా జాతీయ భావజాలంతో వందలాది సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమం జరుగనుంది. 

 నేడు భగవాన్ బిర్సాముండా జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం జాతీయ గిరిజన గౌరవ దినం పాటిస్తోందని మంత్రి గుర్తుచేసారు. లోక్‌మంథన్‌లో గిరిజనుల హస్తకళారూపాలు, కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తారని, అనేక గిరిజన ఉత్పత్తులతో పాటు తమ నైపుణ్యాలను సైతం ప్రదర్శిస్తారనీ తెలిపారు.

వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, 1000 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్, చుట్టుపక్కల బస్తీ ప్రజలు, గిరిజనులు, ఐటీ రంగం సహా అన్ని వర్గాల ప్రజలూ వచ్చేలా అందరినీ అహ్వానిస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. లోక్‌మంథన్ వేడుకలు గతంలో భోపాల్, రాంచీ, గౌహతిలోనూ జరిగాయని తెలిపారు.
లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె.నందకుమార్ మాట్లాడుతూ ఆ పేరు మన దేశపు మౌలిక సంస్కృతికి చెందినదన్నారు.  వేర్వేరు సంస్కృతులు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న భారతదేశంలో నేడు కొన్ని శక్తులు ప్రజల్లో చీలికలు తెచ్చి విద్వేష భావాన్ని నింపుతున్నాయని, అందువల్ల మరొకసారి ఏకత్వాన్ని చాటిచెప్పాల్సిన అవసరముందని తెలిపారు. 

ఇప్పటికీ వలసపాలన ప్రభావంలోనే ఉన్న మన భావజాలాన్ని విముక్తి చెయ్యడం తొలి బాధ్యత అని, లోక్‌మంథన్ వేదిక నుంచి మేధావులు, కార్యాచరణశీలురు ఆ దిశగా కృషి చేస్తారనీ తెలిపారు. లోక్ అవలోకన్ ప్రధాన అంశంగా లోక్ విచార్ (ప్రకృతి, సాంస్కృతిక సంబధమైన ఆలోచనా ప్రక్రియ), లోక్ వ్యవహార్ (సంప్రదాయాలు – ఆచరణ), లోక్ వ్యవస్థ (సంస్థలు-వ్యవస్థలు) అనే మూడు ఉపాంశాలు ఈ ఉత్సవంలో ఉన్నాయి. ఇందులో భాగంగా లోక జీవనదృష్టి, లోక జీవన విజ్ఞానం, లోక సాహిత్యం, లోక అర్థశాస్త్రం, భారతీయ లోక చేతనలో పర్యావరణం, లోక సురక్ష-న్యాయం, లోక సర్వసమావేశీ వ్యవస్థ తదితర అంశాలపై సదస్సులు ఉంటాయి.
మన సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేలా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వివిధ వృత్తులు, రంగాలకు చెందిన కళాకారులు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు. ఉదాహరణకు ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే కేచక్ నృత్య ప్రదర్శన ఉంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కి వస్తున్నారు. వారిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు, లిథువేనియా వాసులు సైతం ఉన్నారని నందకుమార్ వివరించారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం నుంచీ ఆ దేశాలలో ఆచరిస్తున్న సూర్యారాధన, హవన విధానాలను వారు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో ప్రదర్శిస్తారు.

లోక్‌మంథన్ ఎగ్జిబిషన్స్‌లో భాగంగా తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, కళలు, చిత్రాల ప్రదర్శన, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ క్రీడలు, సాహిత్యం, చర్చలు ఉంటాయని నందకుమార్ తెలియజేశారు. ఆ కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ విచ్చేసి భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అనుభవించి, ఆస్వాదించాలని కోరారు. లోక్‌మంథన్ ఉత్సవం జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పించారని నందకుమార్ వివరించారు.

Tags: andhra today newsCultural ExtravaganzaHyderabad ShilparamamIndian Cultural NationalismLok Manthan 2024SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.