Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

‘బలవంతంగా బీఫ్ తినిపించాడు, నమాజ్ చదివించాడు’

తూచ్, అది లవ్‌ జిహాద్ కాదులే: ‘మిసెస్ ఇండియా గెలాక్సీ’

Phaneendra by Phaneendra
Nov 9, 2024, 06:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇటీవల ‘మిసెస్ ఇండియా గెలాక్సీ 2024’ పోటీల్లో విజేతగా నిలిచిన రినిమా బోరా, తన మాజీ ముస్లిం బోయ్‌ఫ్రెండ్ తనతో బలవంతంగా బీఫ్ తినిపించాడని, బలవంతంగా నమాజ్ చేయించాడనీ వెల్లడించింది.

మిసెస్ ఇండియాగా గెలిచిన తర్వాత రినిమా బోరా, అస్సాంకు చెందిన ప్రముఖ యూట్యూబర్ అబొయొబ్ భుయాన్‌తో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడింది. ఆ సందర్భంగా తన జీవితంలోని చేదు సంఘటనలను గురించి వివరించింది.

రినిమా బోరా ఆ పాడ్‌కాస్ట్‌లో ‘‘నేను గత పదహారేళ్ళుగా వేధింపులకు గురయ్యాను. ఆ ఆవేదనను భరించాను. ఆ నరకం గురించి మరచిపోడానికి చాలా యేళ్ళు పడుతుంది. ఆ రోజులు ముగిసిపోయాయి అని ప్రతీరోజూ నాకు నేను చెప్పుకుని ఓదార్చుకుంటున్నాను. ఇప్పటికీ కొంతమంది అది నా తప్పే అని చెబుతుంటారు. అలాంటి వాళ్ళతో నేటికీ పోరాడుతూనే ఉన్నాను’’ అని చెప్పింది.

‘‘16ఏళ్ళ వయసులో నేను అస్సాం నుంచి చదువు కోసం బెంగళూరు వెళ్ళాను. అక్కడ ఒక ముస్లిం అబ్బాయితో నా మొదటి రిలేషన్‌షిప్ మొదలైంది. అతను నన్ను వేధించేవాడు. అయితే నా తల్లిదండ్రుల్లాగే అతను కూడా నా మంచి కోసమే నన్ను కొడుతున్నాడని, తిడుతున్నాడనీ అనుకునేదాన్ని. అతను నాతో ప్రవర్తించే తీరు ఎలా ఉండేదంటే కొన్నిసార్లు నేను అతన్ని తాలిబాన్ అని పిలిచేదాన్ని.’’

‘‘అతను నన్ను దారుణంగా చితకబాదేవాడు. నేను బీఫ్ తినాల్సి వచ్చింది. వాళ్ళు నాతో బలవంతంగా బీఫ్ తినిపించిన రోజు నాకు ఇంకా గుర్తుంది. అతని తల్లిదండ్రులు నేను బీఫ్ తినాల్సిందే అని బలవంతం చేసారు. వాళ్ళు నా పేరును రినిమా బోరా నుంచి ఆయేషా హుసేన్ అని మార్చేసారు. వాళ్ళు నాతో నమాజ్ కూడా చేయించారు’’ అని చెప్పుకొచ్చింది.

ఇంటర్‌వ్యూ సమయంలో అది దాదాపు లవ్‌ జిహాద్ లాంటి పరిస్థితి అని రినిమా చెప్పింది. ‘‘అతను ఈ పాడ్‌కాస్ట్ తప్పకుండా చూస్తాడు. నేను తనను వదిలిపెట్టేస్తే నా ముఖం మీద యాసిడ్ పోసేస్తానని కూడా బెదిరించాడు’’ అంటూ తన రిలేషన్‌షిప్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది.

తన వ్యాఖ్యలను తానే ‘గ్యాస్‌లైట్’ చేసిన మిసెస్ ఇండియా:

రినిమా బోరా పాడ్‌కాస్ట్ యూట్యూబ్‌లోనూ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వైరల్ అయింది. చాలామంది హిందువులు లవ్ జిహాద్ ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ వీడియోను షేర్ చేసారు. దాంతో వివాదానికి దూరంగా ఉందామని భావించిన రినిమా బోరా, మొత్తం వ్యవహారాన్ని తక్కువచేసి చూపే ‘గ్యాస్‌లైటింగ్’ ప్రయత్నం చేసింది. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

బలవంతంగా పేరు మార్చి, బీఫ్ తినిపించి, నమాజ్ చేయించి తన హిందూ విశ్వాసాలను కించపరిచినప్పటికీ రినిమా బోరా అదేమంత పెద్ద విషయం కాదన్నట్టు వ్యవహరించింది. తనది విడిగా ఒక సమస్య మాత్రమే తప్ప లవ్ జిహాద్ కాదంటూ, అలాంటి పరిస్థితులనే ఎదుర్కొనే ప్రమాదం ఉన్న హిందూ యువతులను గ్యాస్‌లైట్ చేసింది. అంతేకాదు, అసలు లవ్ జిహాద్ అనడమే రిలేషన్‌షిప్‌ను ఎంచుకొనే ప్రాథమిక హక్కుకు విరుద్ధమంటూ తేల్చేసింది కూడా.       

‘‘ఈ రీల్‌ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. కానీ ఒక విషయం స్పష్టం చేయాలి అనుకుంటున్నాను. నాకు లవ్ జిహాద్ అనే వ్యవహారం మీద నమ్మకమూ లేదు, దానికి నేను మద్దతూ ఇవ్వను. ప్రేమ, గౌరవం, అవగాహన ఆధారంగా రిలేషన్‌షిప్స్‌ను ఎంచుకునే మన ప్రాథమిక హక్కును వ్యతిరేకించే భావజాలంగా దాన్ని నేను పరిగణిస్తాను. ఈ పాడ్‌కాస్ట్‌లో నేను ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని మాత్రమే పంచుకున్నాను. ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన వ్యవహారం అది, మొత్తం మతానికి సంబంధించినది కాదు. ఈ చర్చలో అసలైన అంశంగా నేను ప్రధానంగా భావించినది గృహహింస తప్ప మతపరమైన విభేదాలు కావు’’ అంటూ రినిమా బోరా వివరణ ఇచ్చుకుంది.   

లవ్ జిహాద్ వాస్తవికత:

ముస్లిం పురుషులు ఉద్దేశపూర్వకంగా ప్రేమ పేరుతో ముస్లిమేతర మహిళలను ట్రాప్ చేసి, బలవంతంగా మతం మార్చే కేసులను ‘లవ్ జిహాద్’ అని పిలుస్తున్నారు. అందులో సాధారణంగా తమ నిజమైన ఉనికిని దాచిపెట్టడం, హిందూ పేర్లతో మోసం చేయడం, వేరే వ్యక్తుల్లా ప్రవర్తించడం వంటి అంశాలు ఉంటాయి. ఇస్లామిస్టులు, వామపక్ష ఉదారవాదులు లవ్‌జిహాద్ అనేది లేనేలేదని అది ఒక కుట్రసిద్ధాంతం మాత్రమేననీ కొట్టిపడేస్తూంటారు. కానీ ఇస్లాంలోకి బలవంతంగా మార్చబడుతున్న హిందూ యువతుల సంఖ్య ఏటికేటా పెరుగుతుండడం లవ్ జిహాద్ వాస్తవికతకు నిదర్శనంగా నిలుస్తోంది.

Tags: andhra today newsForce-fed BeefGas lightingLove JihadMrs India Galaxy 2024Rinima BorahSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.