Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

దేవదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిరుద్యోగ వేదపండితులకు త్వరలో ‘సంభావన’

Phaneendra by Phaneendra
Nov 7, 2024, 05:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేవదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ క్యాడెర్లలోని అధికారులు, అర్చకులకు సంబంధించి 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేవదాయ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అర్చక, పరిపాలనా విభాగాల్లో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గొల్లపూడిలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం రాష్ట్రంలోని దేవదాయ శాఖ అధికారులతో మంత్రి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.

దేవాలయాలన్నీ పరిశుభ్రత, ఆధ్యాత్మికతలో కళకళలాడేట్లుగా అధికారులందరూ పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఆలయానికీ చరిత్ర ఉందని, దానిని కాపాడడంలో నిర్లిప్తత ఉండకూడదన్నారు. కార్తీక మాసంలో నిర్దేశిత ప్రాంతాల్లో చతుర్వేద సభలు నిర్వహించాలన్నారు. 50 వేలకు పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేసారు. దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో అదనంగా ఇద్దరి సభ్యులను నియమించాలన్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డినెన్స్ త్వరలో జారీ అవుతుందన్నారు. నిర్దేశిత కాలపరిమితితో, స్పష్టమైన మార్గదర్శకాలతో సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ వెలువరిస్తామన్నారు.

దసరా నవరాత్రుల్లో కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన వేదసభలో వేదపారాయణం పండితులనే కాకుండా పామరులను కూడా ఉత్తేజితం చేసిందని, దానిని ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా, వేద పఠనం విశిష్ఠత, వేదస్ఫూర్తి నలుదిశలా కొనసాగిస్తూ, దాని అర్థాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలో వచ్చేలా చూడాలన్న లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలన్నిటా వేదసభలు నిర్వహించాలన్నారు. వేదాధ్యయనం చేసి, ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వేద పండితులకు సంభావనగా నెలకు రూ.3వేలు అందిస్తామని, ఆ పథకం కింద గుర్తించిన సుమారు 600 మందికి త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించనున్నామన్నారు.

దేవాలయాల్లో ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో వాడే సామగ్రిని అన్నీ ఎ-గ్రేడ్ రకానివే ఉండేలా చూడటానికి, కేంద్రీకృత వ్యవస్థను తెస్తున్నామని, దానికి విధివిధానాలు రూపొందిస్తున్నామనీ మంత్రి చెప్పారు. దేవాలయాల్లో పారిశుద్ధ్య పనులు, భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా మానవ వనరుల వినియోగంలో కుడా కేంద్రీకృత విధానాలు తెస్తున్నామన్నారు. ఇటీవల రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ ప్రసాదం రుచి గతంలో కంటే మెరుగు పడిందని భక్తులు సంతృప్తి చెందుతున్నారని మంత్రి అన్నారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ ప్రసక్తే వద్దన్నారు. అవసరాలను బట్టి ఆవు నెయ్యి సరఫరా చేసేందుకు వీలుగా దేశీయ గోవులను పెంచేందుకు ఆసక్తి చూపే వారికి దేవదాయ శాఖ నుంచి 5 శాతం సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. దేవాలయాలకు వివిధ రూపాల్లో విరాళాలు ఇచ్చే దాతల పేర్లు ప్రదర్శించేలా చూడడంతో పాటు వారికి ఆలయాల్లో సముచిత గౌరవమిస్తే బాగుంటుందని ఈఓలకు గుర్తించుకోవాలన్నారు. దాతలిచ్చిన విరాళాల వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో తప్పని సరిగా నమోదు చేయాలన్నారు.

ఆలయాల ఆస్తుల పరిరక్షణ బాధ్యత అందరిపైనా ఉందన్న మంత్రి, వివిధ రకాలుగా కబ్జా అయిన ఆలయ ఆస్తుల సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. కొందరు అధికారులు ప్రైవేటు వ్యక్తుల భూములను 22(ఎ)గా గుర్తించడంతో ఆ వ్యక్తులు నష్టపోతున్నారని, దాన్ని దేవదాయ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని, జిల్లా కలెక్టర్ ద్వారా సమస్యను పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఆలయంలోనూ దేవతామూర్తుల నామ స్మరణ క్రమం తప్పకుండా జరిగేలా ఆలయం విశిష్టతను కాపాడాలని మంత్రి వివరించారు. పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరలోనే ఆలయ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని, దానికోసం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం త్వరలో నిర్వహిస్తామనీ మంత్రి చెప్పారు.

దేవదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, అదనపు కమిషనర్లు చంద్రకుమార్, రామచంద్రమోహన్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Tags: Anam Ramanarayana Reddyandhra today newsEndowments Review MeetingEndowments VacanciesNirudyoga Sambhavana SchemeSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.