Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపడానికే పనిచేస్తాం: ట్రంప్

Phaneendra by Phaneendra
Nov 6, 2024, 05:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైట్‌హౌస్‌లో మళ్ళీ అడుగుపెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధపడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ తన ప్రభుత్వపు కీలకమైన విధాన నిర్ణయాల్లో ఒకదాని గురించి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపివేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. ట్రంప్ ప్రత్యేకించి ఏ దేశం పేరునూ ప్రస్తావించకపోయినా ట్రంప్ సర్కారు ప్రధానంగా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ మీద దృష్టి సారిస్తారని అంతర్జాతీయ రాజకీయాల విశ్లేషకులు భావిస్తున్నారు.

‘‘నేను యుద్ధాలు మొదలుపెట్టను, నేను యుద్ధాలను ఆపడానికి పనిచేస్తాను’’ అని ట్రంప్ తన విజయ ప్రసంగంలో చెప్పారు. మా పాలనాకాలంలో యుద్ధాలు లేవు. నాలుగేళ్ళ పాటు ఏ యుద్ధాలూ జరక్కుండా చూసాం. ఒక్క ఐసిస్‌ను ఓడించడం తప్ప మేము ఇంకెవరితోనూ యుద్ధం చేయలేదు’’ అని ట్రంప్ చెప్పారు.

2016 నుంచి 2020 వ్యవధిలో తన పదవీకాలంలో డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడితో సమావేశమైన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. సింగపూర్‌లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్‌తో చేతులు కలపడం చారిత్రక సన్నివేశంగా నిలిచిపోయింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలను మొదటినుంచీ జాగ్రత్తగా అనుసరిస్తున్నది ఉక్రెయిన్ వాసులే. ట్రంప్ విజయం సాధిస్తే, రష్యా బలగాలతో తమ యుద్ధానికి అమెరికా నుంచి అందుతున్న సాయం ఆగిపోతుందన్నది వారి భయం. ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యం వెనుకంజ వేస్తుంటే, ఉత్తరకొరియా సైనిక బలగాల సాయంతో రష్యా మరింత బలంగా కనిపిస్తోంది. ఈ సమయంలో ట్రంప్ గెలుపు ఉక్రెయిన్‌కు ఇబ్బందికరమైన పరిణామం.

జో బైడెన్ హయాంలో అమెరికా ఉక్రెయిన్‌కు బిలియన్ల కొద్దీ డాలర్లు, నాటో బలగాల ద్వారా కుప్పల కొద్దీ ఆయుధాల సహాయం అందజేసింది. అంత బలమైన అండ ఉండబట్టే, ఉక్రెయిన్ ఇప్పటివరకూ రష్యాను నిలువరించగలిగింది. యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు సైతం తమకు ఇష్టం లేకపోయినా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వవలసి వచ్చింది. ఆ పరిస్థితి గత కొద్ది నెలలుగా మారుతూ వస్తోంది. ఇప్పుడు ట్రంప్ గెలుపుతో ఉక్రెయిన్ ఆశలు అడియాసలయ్యాయి.

ట్రంప్ మొదటినుంచీ, ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేయడాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. తను అధికారంలోకి వస్తే రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని 24గంటల్లో ఆపేస్తాననీ చాలాసార్లు చెప్పారు. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది.

Tags: andhra today newsDonald Trump VictoryEuropean UnionIsraelNo to WarsSLIDERTOP NEWSUkraineUS Presidential Elections
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.