Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

అయోధ్యలో ముస్లిం జర్నలిస్టు అబద్ధాలు బట్టబయలు

ఓ యువతిని సాధువులు వేధించారన్న ఆరోపణలు అబద్ధమని నిర్ధారణ

Phaneendra by Phaneendra
Oct 30, 2024, 03:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొద్దిరోజులుగా ఒక వీడియో సామాజికమాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఒక మోటార్ సైకిల్ మీద వెడుతున్న ఇద్దరు సాధువులు కొందరు వ్యక్తులతో ఘర్షణ పడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దాని ఆధారంగా స్థానిక ముస్లిం జర్నలిస్టు జకీర్ అలీ త్యాగి, మరో ముస్లిం మహిళ కవిష్ అజీజ్‌ తమ హిందూ విద్వేష ప్రచారానికి తెరతీసారు. ఆ సాధువులు ఓ అమ్మాయిని వేధిస్తున్నారనీ, అడ్డుకోబోయిన వ్యక్తిపై దాడి చేసారనీ కట్టుకథలు అల్లి ప్రచారం చేసారు.

ఆ వీడియోలో ఏముందంటే…:

ఇద్దరు సాధువులు ఒక మోటార్ సైకిల్ మీద ఉన్నారు. వారి పక్కన మరో సాధువు నిలబడి ఉన్నాడు. బండి మీద ఉన్న ఇద్దరూ అక్కడున్న కొందరు వ్యక్తులతో ఏదో వాదిస్తున్నారు. కొద్దిసేపటికి ఆ గుంపులోని ఒక వ్యక్తికి, సాధువులకు మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ సాధువులు అమ్మాయిలను వేధిస్తున్నారంటూ ఆ వ్యక్తి ఆరోపించాడు. దాంతో సాధువులిద్దరూ అతనితో గొడవ పడ్డారు. ఆ సమయంలో మూడో సాధువు కూడా జోక్యం చేసుకున్నాడు.  

రెండు నిమిషాలకు పైగా ఉన్న ఆ వీడియోను స్థానిక ముస్లిం జర్నలిస్టు జకీర్ అలీ త్యాగి అక్టోబర్ 23న సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ‘‘అయోధ్యలో ఒక అమ్మాయిని వేధించిన ఇద్దరు సాధువులకు జనాలు బుద్ధిచెప్పారు. వారి చర్యలను అడ్డుకున్న ఒక యువకుణ్ణి ఆ సాధువులు తర్వాత చితగ్గొట్టారు. అమ్మాయిని వేధించిన సాధువులు ఒక బైక్ మీద వెళ్ళిపోయారు’’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

మరో ముస్లిం మహిళ కవిష్ అజీజ్ కూడా ఆ వీడియోను తన ఎక్స్‌ ఎకౌంట్‌లో షేర్ చేసింది. ‘ఇంకోలా చెప్పాలంటే, ముస్లిములు లేకుండా ఏదీ జరగదు’ అని దానికి క్యాప్షన్ జతచేసింది. ‘‘అయోధ్యలో ఒక అమ్మాయిని టీజ్ చేస్తూ ముగ్గురు సాధువులు పట్టుబడ్డారు. స్థానికులు వారిని చితగ్గొట్టారు. దాంతో ఆ సాధువుల్లో ఒకడు ‘అందుకే ముస్లిములది పైచేయి’ అని ఆరోపించాడు. అంటే ఒక అమ్మాయిని వేధించి, ఆ సమయంలో పట్టుబడితే దానికి చితగ్గొడితే అక్కడ కూడా మతం కార్డు వాడుతున్నారు’’ అంటూ తన పైత్యాన్ని జోడించింది.

అసలు నిజం ఏమిటి?

ఆ సంఘటన వెనుక అసలు నిజాన్ని అయోధ్య పోలీసులు వెల్లడించారు. అయోధ్య అదనపు ఎస్‌పి చెప్పిన వివరాల ప్రకారం ఆ సంఘటన కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అక్టోబర్ 22న జరిగింది. స్థానిక పంచముఖి హనుమాన్ మందిరం దగ్గరలో ఆ గొడవ చోటు చేసుకుంది. గొడవ పడిన పక్షాల్లో ఒకరు మోటార్ సైకిల్ నడుపుతూ వీడియో రీల్ తీసుకుంటున్నారు. అలా రీల్స్ చేసుకోవడం మీద మరోపక్షంలోని ఒక వ్యక్తి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసాడు. దాంతో ఇరు పక్షాల మధ్యా మాటామాటా పెరిగింది. అది వాగ్వాదంగా మారింది.

ఆ మొత్తం వ్యవహారంలో అమ్మాయిలను వేధించడం అనేదేదీ జరగనేలేదు అని పోలీసులు నిస్సందేహంగా తేల్చారు. ఆ గొడవకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దంటూ పోలీసులు స్పష్టమైన సూచనలు జారీచేసారు.

ముస్లిం జర్నలిస్టు మొండిపట్టు పిడివాదం:

జకీర్ అలీ త్యాగి అవే అబద్ధపు సమాచారాన్ని మొండిగా ప్రచారం చేయడం కొనసాగించాడు. అంతేకాదు, అసలు జరిగిందేంటో వెల్లడించిన ఒక ఫ్యాక్ట్‌చెకర్‌ని సైతం దుర్భాషలాడాడు. ఆ వీడియో గురించి జకీర్ అలీ చేసిన ప్రచారం అంతా అబద్ధమేనంటూ ఒక సోషల్ మీడియా యూజర్ అతన్ని నిలదీసాడు. దానికి స్పందనగా జకీర్ ‘‘నీ తప్పుడు విశ్లేషణని మడిచి నీ …లో పెట్టుకో’’ అంటూ అత్యంత అసభ్యంగా జవాబిచ్చాడు.

అంతేకాదు, తన తప్పుడు ఆరోపణలను సమర్ధించుకుంటూ రెండు ఇతర వార్తాసంస్థల కథనాల స్క్రీన్‌షాట్లను కూడా జతచేసాడు. ఆ రెండు వార్తలూ జకీర్ అలీ ఆరోపణలను పోలి ఉన్నాయి. అలా, ఉద్దేశపూర్వకంగా అసత్య సమాచారాన్ని ప్రచారం చేసిన తన తప్పునుంచి బైటపడిపోడానికి ప్రధాన స్రవంతి మీడియాను అడ్డం పెట్టుకున్నాడు. అయితే స్థానిక మీడియా మొత్తం ఇస్లామిస్టులతో మిలాఖత్ అయిపోయిన పాత్రికేయులతో నిండిఉంది. ఎంతలా అంటే పోలీసులతో నిర్ధారించుకోకుండానే ఆ తప్పుడు వార్తను ప్రసారం చేసేసాయి లేదా ప్రచురించాయి. అలాంటి ప్రసార మాధ్యమాల నుంచి అంతకుమించి ఏమీ ఆశించలేని పరిస్థితి అయోధ్యలో నెలకొని ఉంది.

Tags: andhra today newsAnti Hindu PropagandaAyodhyaFake NewsFake News ReportsPolice ConfirmationSaints ThrashedSLIDERTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.