Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

భారతజాతి నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర

Phaneendra by Phaneendra
Oct 13, 2024, 09:02 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

***************************************************

(ఆర్ఎస్ఎస్ శతజయంతి ప్రత్యేక వ్యాసం)

***************************************************

శతాబ్దాల సుదీర్ఘ పరాయి పాలన తర్వాత భారతదేశానికి బ్రిటిష్ వారినుంచి 1947లో రాజకీయ స్వాతంత్ర్యం లభించింది. దాంతోపాటే, అన్నేళ్ళ తరబడి భావదాస్యంలో మునిగిపోయిన జాతిని పునర్నిర్మించుకోవలసిన పరిస్థితీ నెలకొంది. అప్పుడు ఎదురైన కీలక ప్రశ్న మన లక్ష్యం ఏమిటి? దాన్ని సాధించే మార్గమేమిటి? సరిగ్గా ఆ ప్రశ్నల దగ్గరే, తెల్లదొరల నుంచి అధికారాన్ని తీసుకున్నవారు తడబడ్డారు. నిజానికి స్వాతంత్ర్య సాధనా క్రమంలో వారూ ఉన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు, విదేశీ పాలకుల నుంచి అధికార బదలాయింపునే నిజమైన స్వాతంత్ర్యం అని భావించినవారు, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులతో దిగ్భ్రమ చెందారు.

నిజానికి భగవంతుడు వారికి ఈ దేశపు తలరాతను తీర్చిదిద్దే చారిత్రక అవకాశాన్నిచ్చాడు. ఒకరకంగా అది కొత్త జన్మలాంటిదే. అప్పుడు నిజమైన అవసరం ఏంటంటే గుణాత్మకమైన, కాలానికి కట్టుబడిన మౌలిక విలువలను గుర్తించడమే. అత్యంత ప్రాచీనమైన మన దేశం వేల యేళ్ళపాటు ఆ విలువలను పాటించింది. వాటిని మళ్ళీ గుర్తించి వర్తమాన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుని జాతిని పునరుద్ధరిస్తే సరిపోయేది. కానీ వారు స్వతంత్ర దేశానికి ఆర్థిక ప్రగతి, భౌతిక సంక్షేమం మాత్రమే సరిపోతాయని భావించారు.

వాళ్ళముందు రెండు నమూనాలున్నాయి. ఆ రెండూ పాశ్చాత్యమైనవే. వాటిలో ఒకటి అమెరికన్ పెట్టుబడిదారీ ఆర్థిక విధానం. అందులో వ్యక్తిస్వేచ్ఛకు పరిమితులు లేవు. అది ఈ దేశపు సామాజిక జీవన విధానాన్ని కబళించేసింది. రెండో నమూనా రష్యాకు చెందిన సోషలిస్టు ప్రత్యామ్నాయం. అందులో భాగంగానే పంచవర్ష ప్రణాళికలు రచించారు. ఆ రెండు పద్ధతులనూ ఇష్టపడిన భారత పాలకులు, దేశంలో భౌతిక ప్రగతి గురించి మాత్రమే పట్టించుకున్నారు. రెండు పరస్పర విరుద్ధ పద్ధతులను సమన్వయం చేయడానికి మన పాలకులు చేసిన ప్రయత్నాల వల్ల మనదేశం ఆ రెండు విధానాల్లో దేన్నీ సరిగా అమలు చేయలేక అటూఇటూ కాకుండా  మిగిలి పోయింది.

ఈ విషయంలో సంఘం ఆలోచన అత్యంత మౌలికమైనది. సంఘం స్థాపించినప్పటినుంచీ నిర్దేశించుకున్న లక్ష్యం ఒకటే, హిందూరాజ్య(ష్ట్ర)పు పరమవైభవాన్ని సాధించడమే. విదేశీ పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించడం ఆ మహాలక్ష్యం సాధించే దిశలో ఒక అడుగు మాత్రమే. అధికార బదలాయింపు మహా అయితే స్వరాజ్యం మాత్రమే అవుతుంది తప్ప స్వాతంత్ర్యం సాధించినట్లు కాదు. దేశపు భౌతిక ప్రగతి అనేది పరమవైభవంలో ఒక భాగం మాత్రమే తప్ప దాని అస్తిత్వాన్నో లేక దాని ప్రయోజనాలనో తాకట్టుపెట్టడం కాదు.

సంఘం పరమ ప్రయోజనం ‘స్వ’ అనబడే హిందూ నైతికవిలువలను సాధించడమే. 1947లో సాధించిన అధికారానికి దూరంగా ఉంటూనే సంఘం భారత సమాజంలోని వివిధ రంగాలపై తన ప్రభావాన్ని ప్రసరింపజేయడం ప్రారంభించింది.  1947 వరకూ సంఘ ప్రతిజ్ఞలో హిందూరాష్ట్రాన్ని విముక్తం చేయడం అని ఉండేది, తర్వాత దాన్ని దేశం సర్వాంగీణ ఉన్నతి సాధించడం అని మార్చారు. భారతీయ సామాజిక జీవనం మొత్తం హిందూ జాతీయతా వాదం అనే పునాదిరాయి మీద ఆధారపడి నిర్మించాలి. సంఘస్థానంలో నేర్చుకున్న సంస్కారాల ఆధారంగా, అక్కడ సాధించిన సంస్థాగత నైపుణ్యాలతో, జాతి పునరుద్ధరణ కోసం ఏమాత్రం రాజీలేని కోరికతో పనిచేస్తూ వచ్చిన స్వయంసేవకులు క్రమంగా జాతీయ జీవనంలోని వివిధ రంగాల్లోకి ప్రవేశిస్తూ వచ్చారు.

1948లో గాంధీ హత్య తర్వాత సంఘాన్ని అన్యాయంగా నిషేధించారు. అప్పటివరకూ విద్యార్ధులుగా శాఖా కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్న యువశక్తి కార్యరంగం మారింది. జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశాలను ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చింది. ప్రత్యేకించి, అప్పుడు రాజ్యాంగ అసెంబ్లీలో చర్చిస్తున్న రాజ్యాంగ ముసాయిదా గురించి ప్రజల అభిప్రాయాలను సంఘ కార్యకర్తలు సమీకరించారు. ఆ యువశక్తే కాలక్రమంలో జాతీయస్థాయి విద్యార్ధి సంస్థగా ఎదిగింది, చివరికి అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఎబివిపి) అనే సంస్థగా ఏర్పడింది. విద్యార్ధుల మేధస్సు, ప్రతిభ, సృజనాత్మకతలను జాతి నిర్మాణ కార్యక్రమాలకు వినియోగించడంలో ఎబివిపి కృషి చేస్తోంది. ఇవాళ దేశంలో జాతీయవాద దృక్పథంతో పనిచేస్తున్న ప్రథమశ్రేణి విద్యార్థి విభాగంగా ఎబివిపి ఉంది.

సంఘం మీద, సంఘ కార్యకర్తల మీద వివిధరకాల దుష్ప్రచారాలు జరిగేవి. నిరాధార ఆరోపణలు చేసేవారు. అటువంటి పరిస్థితిని మార్చడానికి, సంఘం దృక్పథాన్ని వివరించడానికి ఆర్గనైజర్ అనే ఆంగ్లవారపత్రికను ప్రారంభించారు. పాంచజన్య, యుగధర్మ వంటి పత్రికలను హిందీలో మొదలుపెట్టారు. తెలుగులో జాగృతి పత్రిక ఆ బాధ్యతలు నెరవేరుస్తోంది. ఇలా దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ సంఘం భావధారను ప్రకటించే పత్రికలు నడుస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల గురించి, భావజాలం గురించి స్పష్టంగా వివరించడంలో ఆ పత్రికలు అమితకృషి చేస్తున్నాయి.
మనదేశంలో అమలవుతున్న విద్యావిధానం మనది కాదు. బ్రిటిష్ వారి అడుగులకు మడుగులొత్తే గోధుమరంగు చర్మపు తెల్లవాళ్ళ సైన్యాన్ని తయారుచేసే ఉద్దేశంతో మకాలే అనేవాడు ప్రవేశపెట్టిన విద్యావిధానమిది. దేశానికి స్వతంత్రం వచ్చాక మన విద్యావ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం తలెత్తింది. ఆ క్రమంలో 1952లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దేశంలోనే మొట్టమొదటి ‘సరస్వతీ శిశుమందిరం’ స్థాపించారు. దేశభక్తి, మాతృభాష పట్ల ప్రేమ, క్రమశిక్షణ, ఉన్నతమైన నైతిక విలువలు, హిందూ నియమాలతో విద్యార్ధి శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక సమగ్ర వికాసమే లక్ష్యంగా శిశుమందిర్ మొదలైంది. చిన్న మొలకగా మొదలైన శిశుమందిరం ఇప్పుడు విద్యాభారతి అనే మహావటవృక్షంగా పెరిగింది. నర్సరీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ వివిధ స్థాయుల్లో విద్యను బోధించే వేలాది సంస్థలతో దేశవ్యాప్తంగా ఎదిగింది. విద్యాభారతిలో విద్యావిధానం సనాతన హిందూ విలువల ఆధారంగా, ఆధునిక విద్యావిధానాలకు అనుగుణంగా ఉంటుంది.

హిందూసమాజంలో అవిభాజ్యమైన అంగమైన ఆదివాసీలను ఒక క్రమపద్ధతిలో హైందవానికి దూరం చేయడం మరో పెద్ద సమస్య. దాన్ని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరముంది. ఆధునిక సమాజానికి దూరంగా, ఏమాత్రం కలుషితం కాకుండా ఉన్న ఆదివాసీల్లో అక్షరాస్యతను పెంచాలి. వారు ఇప్పటికీ తమ సాంస్కృతిక మూలాలను వదులుకోని ప్రతిభావంతులు. క్రైస్తవ మిషనరీల మతమార్పిడి మోసాలకు బలైపోతున్న, అటవీ వనరుల కోసం అతిఎక్కువ దోపిడీకి గురవుతున్న అమాయకులు. బ్రిటిష్ వారసత్వంగా వచ్చిన ఆ జంట సమస్యలను ఎదుర్కోడానికి యాభైల తొలినాళ్ళలో భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ఏర్పాటైంది. ప్రస్తుతం ఆ సంస్థ 21 రాష్ట్రాల్లో వందకు పైగా జిల్లాల్లో వ్యాపించి ఉంది. ఆదివాసీల సమగ్ర అభివృద్ధికి, వారి సహజ పరిసరాలను పరిశీలిస్తూ, వారిలోని అంతర్గత సామర్థ్యాలను వెలికితీస్తూ, వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ కళ్యాణ్ ఆశ్రమ్.  కొన్ని దశాబ్దాలుగా వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ కృషి కారణంగా అది ఉన్న ప్రాంతాల్లో మతమార్పిడులు తగ్గుతూ, మతంమారిన వారిని మళ్ళీ హిందూధర్మంలోకి తీసుకొచ్చే పని సమర్థంగా జరుగుతోంది.

కార్మిక సంఘాలు అంటే సాధారణంగా గుర్తొచ్చేది విదేశీ సోషలిస్టు మార్క్సిస్టు తత్వశాస్త్రమే. ముప్ఫైలలో మన దేశంలో మొదలైన కార్మిక సంఘాలు, బ్రిటిష్ వారు మన దేశం వదిలిపెట్టి వెళ్ళిన నాటినుండీ పుంజుకున్నాయి.  అటువంటి ట్రేడ్ యూనియన్లు సైద్ధాంతికంగానూ, ఆచరణలోనూ కార్మిక మరియు జాతీయ ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో హిందూ పద్ధతులు కలిగిన కొత్త కార్మిక ఉద్యమం 1955లో ప్రారంభమైంది. అదే భారతీయ మజ్దూర్ సంఘ్. ఏ పరిశ్రమలోనైనా వివాదం రేగినప్పుడు చర్చలతో పరిష్కరించుకోవాలి అని బిఎంఎస్ భావిస్తుంది. దోపిడీ ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎవరికైనా సరే, సమాజపు సమగ్ర ఆసక్తిని నిలబెట్టడమే పరమావధి అన్న విషయాన్ని బిఎంఎస్ అంగీకరిస్తుంది. ప్రస్తుతం బిఎంఎస్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్మిక సంస్థ అయినా సోషలిస్టు, మార్క్సిస్టు భావజాలాలవైపు మొగ్గు చూపకుండా పనిచేస్తోంది. సంఘం తనంత తాను హిందువులను నియంత్రించడంలో, వారికి క్రమశిక్షణ, సమాజచైతన్యం అలవరచడం వల్ల హిందువుల నియంత్రణ సాధ్యమవుతుందని బిఎంఎస్ గ్రహించింది.  ఆ దిశగా శ్రమిస్తోంది.

హిందువులు ఎదుర్కొంటున్న కొన్ని నిర్దిష్టమైన సమస్యలను ఎదుర్కోడానికి అరవైలలో విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించింది. సుమారు 150 దేశాల్లో నివసిస్తున్న హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, వారి దైనందిన జీవితంలో హిందూ సంస్కారాలకు ప్రాతినిథ్యం కల్పించడం ముఖ్యమైనది.  అలాగే దేశంలోని సాధు సన్యాసినులను మఠాధిపతులు అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం యావత్ హిందూ సమాజానికీ మేలుచేస్తుంది. విదేశీ మతాల్లోకి మారినవారిని మళ్ళీ స్వధర్మంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు చాల గొప్పవి.

తెలిసో తెలియకో హిందూమతంలోనుంచి జారుకుంటున్న విదేశీయులను చక్రధర్మాన్ని బోధించడం, వారిని హైందవంలోకి మళ్ళీ తీసుకురావడం ప్రధాన లక్ష్యాలుగా విశ్వహిందూపరిషత్ 1964 నుండి పనిచేస్తోంది.

అయోధ్య శ్రీరామచంద్రప్రభువు ఆలయ నిర్మాణంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల కృషి ఘనమైనది. నాలుగు శతాబ్దాల శారీరక శ్రమతో, హిందువులు 76 యుద్ధాల్లో వరుసగా ఓడిపోయారు. మొగల్ రాజుల్లో మొదటివాడైన బాబర్ తన చేతిలో చిల్లిగవ్వయినా లేకుండా శ్రమించి సంపాదించిన ఆ గుడుల పునరుద్ధరణకు బ్రిటిష్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఆ పోరాటంలో హిందువుల పక్షాన నిలబడడం కోసం విహెచ్‌పి శ్రద్ధాసక్తులతో ప్రయత్నించడం విశేషం.  

ఆ మరుసటి సంవత్సరమే లక్షలాది హిందువులు భారతదేశం నలుమూలల నుండీ అయోధ్య కరసేవలో పాల్గొన్నారు. హిందువులకు అడుగడుగునా అడ్డంకులు కల్పించిన దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎదుర్కొని, వివాదాస్పద కట్టడం మీద భగవాధ్వజాన్ని విజయవంతంగా ఎగురవేసారు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు. ఆ సందర్భంగా చరిత్రలో కనీవినీ యెరుగని రక్తపాతం చోటు చేసుకుంది. అయినప్పటికీ విశ్వహిందూ పరిషత్ లక్ష్యంలో మార్పు లేదు. హిందూ సమాజంలో ధార్మికమైన ఆగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హిందువులు చరిత్రలోకెల్లా అతిభయంకరమైన చారిత్రక అవమానాలను భరించారు. బ్రిటిష్ పాలన ముగియడంతో భారత్ ప్రజాస్వామిక రిపబ్లిక్ దేశంగా అవతరించింది, తనకో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే అధికార పక్షానికి నికార్సైన జాతీయవాదంతో కూడిన బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం రాజకీయాలకు అతీతంగా సామాజిక రంగంలో మాత్రమే ఉండాలని భావించింది. కానీ, రాజకీయరంగంలో కూడా హైందవ విలువలతో కూడిన సామాజిక పరివర్తన అవసరమని సంఘం గుర్తించింది. సామాజిక జీవనంలోని ప్రతీ రంగం మీదా రాజకీయాలు తమ అపరిమిత ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దేశంలో ఒక నూతన రాజకీయ సంస్కృతి ఆవశ్యకత ఉంది. ఆ కారణాల రీత్యా, హిందూ జాతీయతావాదం పట్ల ఏమాత్రం రాజీలేని నిబద్ధత కలిగిన కొంతమంది సీనియర్ సంఘ్ నాయకులు 1951లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో భారతీయ జనసంఘ్ అనే రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల పోరాటాలు మాత్రమే కాకుండా జనసంఘ్ దేశపు గౌరవాన్ని సమగ్రతనూ కాపాడడానికి ఎన్నో రాజకీయ పోరాటాలు చేసింది. 1952లో ‘సేవ్ కశ్మీర్’ ఉద్యమం చేపట్టింది. 1969లో కేరళలో ముస్లింల ఆధిక్యం కలిగిన ప్రత్యేక మలప్పురం జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసింది.

పాతికేళ్ళ పాటు రాజకీయ రంగంలో స్థిరంగా పనిచేసిన భారతీయ జనసంఘ్, 1977లో కేంద్రంలో అధికారం సాధించిన జనతా కూటమిలో బలమైన భాగస్వామిగా చేరింది. అప్పటికి ఉన్న ప్రతిపక్షాలు అన్నీ కలసి ఆ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే జనతా పార్టీ కూటమిలోని మిగతా పక్షాలు భారతీయ జనసంఘ్ తరఫున కూటమిలో ఉండే సభ్యులకు ఆర్ఎస్ఎస్‌లో సభ్యత్వం ఉండకూడదంటూ పట్టుపట్టడంతో, ఆ కూటమి నుంచి బైటకు వచ్చేసారు. ఆ క్రమంలో 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసారు. ఈ కొత్త పార్టీ భారతీయ జనసంఘ్ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. దివంగత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రబోధించిన ఏకాత్మతా మానవవాదాన్ని తాత్విక ప్రాతిపదికగా బీజేపీ స్వీకరించింది. మిగతా రాజకీయ పక్షాలన్నీ తమను ఒంటరి చేస్తారని తెలిసినా, బీజేపీ ఏమాత్రం వెనుకాడకుండా శ్రీరామజన్మభూమి ఉద్యమాన్ని నెత్తికెత్తుకుంది. అలాగే, బంగ్లాదేశ్‌కు తీన్‌ బిఘా ప్రాంతాన్ని బదలాయించడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. రాజకీయ విభేదాలు పక్కన పెడితే బీజేపీ ఒక సరికొత్త రాజకీయ సంస్కృతిని ప్రారంభించిందన్న విషయాన్ని ఆ పార్టీ ప్రత్యర్ధులు సైతం ఆమోదించారు. 1991 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది, నాలుగు రాష్ట్రాల్లో అధికార పక్షంగా ఎదిగింది.

1936 మొదట్లో వార్ధాకు చెందిన శ్రీమతి లక్ష్మీబాయి కేల్కర్ (మౌసీ) డాక్టర్ హెడ్గేవార్‌ను కలిసారు. సంఘంలో పురుషులకు మాత్రమే శిక్షణ లభిస్తోందనీ, జాతీయతావాదం విషయంలో, సరైన సంస్కారాల విషయంలో మహిళలకు కూడా శిక్షణ అవసరమనీ ఆమె డాక్టర్జీకి వివరించారు. ఆ విషయమై వారిద్దరి మధ్యా చాలా నెలల పాటు చర్చోపచర్చలు జరిగాయి. ఎట్టకేలకు ‘రాష్ట్ర సేవికా సమితి’ పేరిట మహిళలకు ప్రత్యేకమైన సంస్థను స్థాపించడానికి పూర్తి సహకారం అందిస్తానని డాక్టర్జీ మాట ఇచ్చారు. సేవికా సమితి లక్ష్యం కూడా సంఘం లక్ష్యమే. అయితే సంఘానికి సమాంతరంగా స్వతంత్ర నిర్మాణంతో సొంత పేరుతో ఆ సంస్థ వ్యవహరిస్తూంటుంది.

ఇదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థల్లో కొన్నిటి గురించిన రేఖామాత్ర ప్రస్తావన. వీటన్నిటినీ కలిపి సాధారణంగా ‘సంఘ్ పరివార్’ (సంఘ కుటుంబం) అంటారు. ఈ కుటుంబం చాలా పెద్దది. అన్నిరకాల రంగాల్లోనూ స్వయంసేవకుల ఆచరణకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. స్వయంసేవకులు ఏ కార్యక్షేత్రంలోకి అడుగిడినా వారి ప్రధాన లక్ష్యం దేశాన్ని ‘సర్వాంగీణ ఉన్నతి’కి చేర్చాలన్న హిందూ జాతీయవాద నైతికతను సాధించడమే.

అలా ఒక వ్యక్తి ‘సంఘ శాఖ’గా ప్రారంభించిన చిన్నకార్యం ఇంతింతై వటుడింతయై అన్నట్లు విస్తరించింది. ప్రత్యేకించి దేశ స్వతంత్ర సాధన తర్వాత జాతి నిర్మాణం అనే విశిష్ఠ లక్ష్యం కోసం కృషి చేస్తోంది. సామాజిక జీవితంలోని ప్రతీ ప్రధాన రంగంలోనూ సంఘం తనదైన ముద్ర వేసింది.

 

Tags: ABVPAkhil Bhartiya Vanvasi Kalyan AshramAkhil Bhartiya Vidyarthi Parishadandhra today newsBhartiya JanasanghBhartiya Janata PartyBhartiya Majdoor SanghBJPBJSBMSCentenary YearJagritiOrganiserPanchajanyaRashtra Sevika SamitiRashtriya Swayamsevak SanghRSSSaraswati SisumandirSLIDERTOP NEWSvhpVidya BharatiViswa Hindu ParishadYugdharma
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.