Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

సావర్కర్ మనవడి పరువునష్టం దావాలో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

Phaneendra by Phaneendra
Oct 6, 2024, 09:08 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షనేత అయిన రాహుల్ గాంధీకి పుణే మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. దివంగత వినాయక దామోదర్ సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్ దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం దావాలో కోర్టు విచారణకు అక్టోబర్ 23న హాజరు కావాలని ఆదేశించింది.

వినాయక దామోదర్ సావర్కర్ సోదరుల్లో ఒకరి మనవడైన సాత్యకి సావర్కర్ 2023 ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు. ఆయన న్యాయవాది సంగ్రామ్ కొల్హాత్కర్ ఆ కేసు వివరాలు తెలియజేసారు. రాహుల్ గాంధీ గతేడాది యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించినప్పుడు సావర్కర్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. 2023 మార్చి 5న లండన్‌ నగరంలో ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు రాహుల్ గాంధీ వినాయక దామోదర్ సావర్కర్‌ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలాంటి వ్యాఖ్యలు చేసారు.  

సావర్కర్ గురించి రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించారని, తద్వారా ఆయన కుటుంబానికి మానసిక అశాంతి కలిగించారనీ ఫిర్యాదిదారు ఆరోపించారు. ఆ కేసును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 202 ప్రకారం విచారించాలంటూ కోర్టు పుణే పోలీసులను ఈ యేడాది మొదట్లో ఆదేశించింది.

తాజాగా, అక్టోబర్ 3 గురువారం నాడు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు వీర సావర్కర్ మీద చేసిన తప్పుడు వ్యాఖ్యలపై సావర్కర్ కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ నాయకులు సైతం విరుచుకుపడ్డారు. సావర్కర్ చిత్పవన బ్రాహ్మణుడు అయినప్పటికీ గోమాంసం భుజించాడంటూ దినేష్ గుండూరావు వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది.

సావర్కర్ మనవడైన రంజిత్ సావర్కర్, దినేష్ గుండూరావు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వీర సావర్కర్ గోమాంసం తిన్నారనడం పచ్చి అబద్ధమన్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన దినేష్ గుండూరావు మీద పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. ‘‘సావర్కర్‌ను అవమానించడం అనే వ్యూహాన్ని కాంగ్రెస్ ఎన్నోయేళ్ళనుంచి కొనసాగిస్తూ వస్తోంది. రాహుల్ గాంధీ అదే పనిచేసారు. ఇప్పుడు ఆయన పార్టీ నాయకులు అలాంటి ప్రకటనలే చేస్తున్నారు. ఇదీ కాంగ్రెస్ నిజమైన ముఖం. హిందువులను కులాల వారీగా విభజించి ఎన్నికల్లో గెలవాలన్నది వారి కుట్ర. సావర్కర్ గోమాంసం తిన్నారనీ, గోవధను సమర్ధించారనీ చెప్పడం పూర్తిగా తప్పు. ఆయన మరాఠీలో రాసిన వ్యాసాన్ని వక్రీకరించి అలాంటి వ్యాఖ్యలు చేసారు. ఆవులు చాలా ఉపయోగకరమైనవనీ, అందుకే వాటిని దేవతలుగా పూజిస్తారనీ సావర్కర్ రాసారు. అంతేకాదు. ఆయన అప్పట్లో గోరక్షా సమ్మేళన్ సంస్థకు అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. అలాంటి వ్యక్తి మీద అబద్ధపు ఆరోపణలు చేసిన దినేష్ మీద పరువునష్టం దావా వేస్తాను’’ అని రంజిత్ చెప్పారు.

Tags: andhra today newsCriminal Defamation SuitDinesh GunduraoPune Magistrate CourtRahul Comments in UKSLIDERSummons to Rahul GandhiTOP NEWSVinayak Damodar Savarkar
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.