Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

వినయశీలి, నిగర్వి, దార్శనికుడు లాల్ బహదూర్ శాస్త్రి

Phaneendra by Phaneendra
Oct 2, 2024, 03:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

(ఇవాళ లాల్ బహదూర్ 120వ జయంతి)

అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి అనుకోవడం పరిపాటి. ఇదేరోజు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. భారతదేశానికి మూడవ ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతి ఇవాళ.

లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, సరళత్వం, దేశం పట్ల అంకితభావం అందరికీ ఆదర్శప్రాయాలు. దేశానికి ఆయన చేసిన సేవలు మహత్తరమైనవి. ప్రత్యేకించి 1965 ఇండో పాక్ యుద్ధం సమయంలో లాల్ బహదూర్ సేవలు లక్షల మందికి స్ఫూర్తి కలిగించాయి. ‘జై జవాన్ – జై కిసాన్’ అంటూ ఆయన ఇచ్చిన నినాదం మంత్రమైంది.

లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్‌లోని ముగల్‌సరాయ్‌లో జన్మించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నాయకత్వం అత్యంత ప్రజాదరణ పొందింది 1965 ఇండో పాక్ యుద్ధ సమయంలోనే. దేశానికి వెన్నెముక రైతులు, సైనికులేనంటూ ఆయన పిలుపునిచ్చిన జై జవాన్ – జై కిసాన్ నినాదం ఆసేతు శీతాచలం ప్రతిధ్వనించింది. 1966లో తాష్కెంట్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన అకాల మరణం ఇప్పటికీ చర్చనీయాంశమే.

లాల్ బహదూర్ శాస్త్రి సజ్జనత్వం, భోళాతనం, సరళత్వం, దేశభక్తి అచంచలమైనవి. దేశ ప్రధాని స్థాయికి ఎదిగినా ఆయన నిరాడంబరంగానే ఉండేవారు. అవినీతి అన్నమాట ఆయన చేరువకు రావడానికి భయపడేది. భారత పాకిస్తాన్ ఘర్షణల సమయంలో ఆయన దేశ భద్రత, సార్వభౌమత్వాలను కాపాడడానికి కృతనిశ్చయంతో కట్టుబడి పనిచేసారు. అసాధారణమైన ఆయన సద్గుణాలు తరతరాలకూ స్ఫూర్తిదాయకాలు.

లాల్ బహదూర్ శాస్త్రి సూక్తులు:

— మేం శాంతినీ, శాంతియుత అభివృద్ధినీ నమ్ముతాం. మాకే కాదు, ప్రపంచ ప్రజలందరికీ అవే అవసరం.

— భారతదేశపు ప్రత్యేకత ఏంటంటే మా దేశంలో హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, సిఖ్ఖులు, పార్సీలు, ఇంకా ఎన్నో మతాలవాళ్ళు ఉన్నారు. మాకు గుడులు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలూ ఉన్నాయి. కానీ వాటిని మేం రాజకీయాల్లోకి తీసుకురాము. అదే మాకూ పాకిస్తాన్‌కూ తేడా.

— యుద్ధంలో పోరాడినట్లే, మనం శాంతి కోసం ధైర్యంగా పోరాడాలి

— క్రమశిక్షణ, సమైక్య కార్యాచరణలే దేశానికి నిజమైన బలం

— ప్రపంచమంతా ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉండడానికి వలసపాలన, సామ్రాజ్యవాదాలను అంతమొందించడానికి మద్దతివ్వడం మన నైతిక బాధ్యత  

— మన మార్గం చాలా సరళం, సుస్పష్టం. దేశంలో అందరికీ స్వతంత్రం, సౌభాగ్యం ఉండాలి. దానికోసం సోషలిస్టు ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలి. ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాలతోనూ స్నేహంగా ఉండాలి.

— ఒక వ్యక్తి జాతి, మతం, రంగు ఏదైనా సరే… అతనికి గౌరవంగా జీవించే హక్కుంది. మెరుగైన, సమగ్రమైన, సుసంపన్నమైన జీవితం గడిపే హక్కుంది.

— దేశంలో ఒక్క వ్యక్తి అయినా అంటరానితనంతో అవస్థ పడితే భారతదేశం తల సిగ్గుతో దించుకోవలసిందే

— మనకు పెద్దపెద్ద ప్రాజెక్టులున్నాయి, పరిశ్రమలున్నాయి, కానీ మనం చూడవలసింది, మన సమాజంలో అత్యంత బలహీనమైన అంశాన్ని… సగటు మనిషిని.

Tags: 1965 Indo Pak Warandhra today newsbirth anniversaryLal Bahadur ShastriSLIDERSuspicious DeathTashkentThird PM of IndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.