Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ, ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం?

Phaneendra by Phaneendra
Sep 13, 2024, 12:21 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం కోసం సెయింట్ పీటర్స్‌బర్గ్‌ వెళ్ళిన దోవల్, అక్కడే పుతిన్‌తో గురువారం నాడు భేటీ అయారు. వారిద్దరూ చేతులు కలుపుకున్న చిత్రాన్ని భారత్‌లోని రష్యా దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చారిత్రక ఉక్రెయిన్‌ పర్యటన జరిగిన రెండున్నర వారాల తర్వాత దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపినప్పుడు ఉక్రెయిన్, రష్యా రెండు దేశాలూ కలిసి కూర్చుని చర్చించుకోవాలనీ, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలనీ చెప్పారు. అవసరమైతే ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు క్రియాశీలక పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

ఇప్పుడు అజిత్ దోవల్ రష్యా పర్యటన ప్రధాన ఉద్దేశం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధాని మోదీ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలియజేయడం అజిత్ దోవల్ ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది.

దోవల్‌తో చర్చల్లో పుతిన్, వచ్చే నెల కజాన్‌లో జరగబోయే బ్రిక్స్ వార్షిక సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆ సందర్భంగా అక్టోబర్ 22న మోదీతో పుతిన్ నేరుగా ద్వైపాక్షిక చర్చలు జరపడానికి ప్రతిపాదించారు. మోదీ గత మాస్కో పర్యటన సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు ఎలా జరుగుతోందన్న విషయాన్ని, సమీప భవిష్యత్తులో ఉన్న అవకాశాల గురించీ వారిద్దరూ చర్చిస్తారని రష్యా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

బుధవారం నాడు అజిత్ దోవల్ రష్యా జాతీయ భద్రతా సలహాదారు సెర్గేయ్ షోయిగుతో చర్చలు జరిపారు. ఇరుదేశాలకూ పరస్పర ఆసక్తి ఉన్న అంశాల మీద వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఆగస్టు 23న మోదీ జెలెన్‌స్కీల చర్చలకు కొనసాగింపుగా ఇప్పుడు భారత్-ఉక్రెయిన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.

Tags: andhra today newsNational Security AdvisorNSA Ajit DovalNSAs’ MeetingPM Narendra Modirussia presidentSLIDERSt PetersburgTOP NEWSUkraine Peace PlanVladimir Putin
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.