Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

కమ్మనైన అమ్మభాష : తెలుగును బ్రతికించుకుందాం

(నేడు తెలుగు భాషా దినోత్సవం)

Phaneendra by Phaneendra
Aug 29, 2024, 10:31 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వ్యావహారిక భాషను జనాల వాడుకలోనుంచి పుస్తకాలలోకి తీసుకొచ్చి, రచనల్లో గ్రాంథిక భాషను పరిహరించి, సాహిత్యాన్ని జనజీవనం మాట్లాడుకునే సాధారణ వాడుకభాషలోకి తీసుకువచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం.

భారతదేశంలోని ఆరు సంప్రదాయ భాషలలో ఒకటిగా ఉన్న తెలుగు భాష ప్రపంచంలో 14వ అత్యధికంగా మాట్లాడే స్థానిక భాష. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక తెలుగువారు స్థిరపడిన విదేశాల్లో సైతం లెక్కవేస్తే సుమారు 10 కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాషగా వెలుగొందుతోంది. 

తెలుగుభాష గొప్పతనాన్ని విజయనగర సామ్రాజ్యాధినేత, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు జాను తెనుగులో ఎంతో అందంగా చెప్పుకొచ్చారు.

“తెలుగదేల యెన్న దేశంబు తెలుగేను,

తెలుగు వల్లభుండ, తెలుగొకండ

యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి

దేశభాషలందు తెలుగు లెస్స”

భారతీయ భాషలన్నింటికీ సంస్కృతమే మూలమైనా, వాటన్నింటిలో పూర్తిస్థాయి అజంత భాష తెలుగే. అంటే, తెలుగు భాషలోని పదాలన్నీ అచ్చులతోనే ముగుస్తాయి. ఐరోపా భాషల్లో అటువంటి లక్షణం ఇటాలియన్‌కు ఉంది. అందుకే, 15వ శతాబ్దపు ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటి తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నాడు. తెలుగు సొగసైనది, శ్రావ్యమైనది, మధురమైనది, సంగీతానికి అనుకూలంగా ఉండే సుకుమారమైన భాష. అందుకే కర్ణాటక సంగీతంలో అత్యధిక కీర్తనలు, కృతులు, రచనలు తెలుగులోనే ఉంటాయి.

ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించడానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు. ప్రత్యేకించి టెలివిజన్ కార్యక్రమాల్లో పరభాషా పదాల వాడుక పెరిగిపోతున్నది. ఆ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది.

వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఇవాళ పలు స్వచ్ఛంద సంస్థలు తెలుగును ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సాహకాలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి జరుగుతోంది. తెలుగులోనే విద్యా బోధన, ప్రజా పరిపాలన కొనసాగాలని తెలుగు నాడు సమితి సుమారు పాతికేళ్ళుగా కృషి చేస్తోంది.

Tags: 14th Most Spoken Languageandhra today newsGidugu Ramamurty Pantulu Birth AnniversarySLIDERSri Krishna Deva RayaTelugu Language DayTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.