Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

కంగనా రనౌత్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు

Phaneendra by Phaneendra
Aug 27, 2024, 06:07 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సినీ నటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్‌ను సిక్కు అతివాద వర్గాలు చంపేస్తామంటూ బెదిరించాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు ముందు ఈ బెదిరింపులు రావడం గమనార్హం.

నిహాంగ్ సిక్కు నుంచి క్రైస్తవుడిగా మతం మారిన విక్కీ థామస్ సింగ్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పెట్టాడు. అందులో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య గురించి ప్రస్తావిస్తూ పరోక్షంగా కంగనా రనౌత్‌ను బెదిరించాడు.

‘‘ఆ సినిమాలో అతన్ని (ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ భింద్రన్‌వాలే) ఉగ్రవాదిగా చూపిస్తే, నువ్వు ఎవరి గురించైతే సినిమా తీసావో ఆ వ్యక్తికి (ఇందిరాగాంధీకి) ఏమయిందో గుర్తుందిగా. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఎవరు? సంత్‌జీ కోసం మేం మా తలైనా ఇచ్చేస్తాం. తల ఇచ్చే ధైర్యం ఉన్నవారు, ఎదుటివారి తల సైతం నరకగలరు’’ అంటూ వీడియోలో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అలా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో కంగనా రనౌత్ పోలీసుల సహాయం అర్ధించారు. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు ఇందిరాగాంధీ బాడీగార్డులు, వారే ఆమెను 1984 అక్టోబర్ 31న హతమార్చారు.  

‘‘ఈ సినిమా కనుక విడుదల చేస్తే సర్దార్లు అందరూ నిన్ను చెప్పులతో కొడతారు. నాకు నా దేశం మీద విశ్వాసం ఉంది. నేను భారతీయుణ్ణని గర్వంగా చెప్పుకుంటాను. నిన్ను ఈ దేశంలో ఎక్కడైనా చూస్తే, ముఖ్యంగా నువ్వు కనుక మహారాష్ట్రలో కనిపిస్తే మేము మా హిందూ క్రైస్తవ ముస్లిం సోదరులతో కలిసి నీకు చెప్పులతో స్వాగతం చెబుతాము’’ అని ఆ వ్యక్తి ఆ వీడియోలో హెచ్చరించాడు.

కంగనా రనౌత్ ఆ వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేసి హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల పోలీసు విభాగాలను ట్యాగ్ చేసారు. ఆ విషయంలో దర్యాప్తు చేయవలసిందిగా అర్ధించారు. విక్కీ థామస్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన మరో వీడియోలో కంగనా రనౌత్‌ను అభ్యంతరకరంగా దూషించాడు. ఎమర్జెన్సీ చిత్రం దర్శక నిర్మాతలు, నటీనటులను హెచ్చరించాడు.  

‘ఎమర్జెన్సీ’ అనేది కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన సినిమా. 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి గురించి ఆ సినిమాలో చర్చించారు. స్వయంగా కంగనాయే ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌధురి, శ్రేయస్ తల్పడే, విశాఖ్ నాయర్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. ఆ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఆ సినిమాలో సిక్కులను చెడ్డగా చూపించి ఉంటారని ఆరోపిస్తూ సిక్కు సంస్థలు సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ భింద్రన్‌వాలేను అమరవీరుడిగా పేర్కొంటూ, ఆ సినిమాను నిషేధించాలని పిలుపునిచ్చింది.

Tags: 1975 Emergencyandhra today newsEmergency FilmIndira GandhiKangana RanautSikh CommunitySLIDERThreatening CallsTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.