Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

హిందువులను ఆకట్టుకునేందుకు డిఎంకె సర్కారు ప్రయత్నం

పళనిలో రెండురోజుల అంతర్జాతీయ ముత్తమిళ్ మురుగన్ కాన్ఫరెన్స్

Phaneendra by Phaneendra
Aug 27, 2024, 05:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడులోని నాస్తిక ద్రవిడ ప్రభుత్వం హిందువులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పళని పట్టణంలో రెండు రోజుల అంతర్జాతీయ ముత్తమిళ్ మురుగన్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.   

పళని పట్టణాన్ని తిరువావినంకుడి అని కూడా పిలుస్తారు. కుమారస్వామి లేదా మురుగన్ అని పిలిచే సుబ్రహ్మణ్య స్వామి కోవెల ఉన్న ప్రసిద్ధ పట్టణమది. కొండ మీద ఉన్న ఆ గుడిని భోగార్ అనే సాధువు నిర్మించారు. ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన ఆ ఆలయంలో కోరుకున్న కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం.    

ఇంతకీ ఇప్పటికిప్పుడు డిఎంకె ప్రభుత్వానికి మురుగన్ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? గత సెప్టెంబర్‌లో ఒక యూట్యూబర్ స్వామి మురుగన్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు. ఈ ముఖ్యమంత్రి కొడుకే అయిన క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసాడు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనే అజెండాతో పెట్టిన సమావేశానికి ఉదయనిధితో కలిసి హాజరైన తమిళనాడు దేవదాయ శాఖ మంత్రే ఈ అంతర్జాతీయ మురుగన్ సదస్సును నిర్వహించాడు.

డిఎంకె నేతల హిందూ వ్యతిరేకత అందరికీ తెలిసిందే. పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి ఒకసారి తమ పార్టీ ఎంపీ ఒకరు నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటే దెబ్బ తగిలి రక్తం కారుతోందా అని అడిగాడు. సేతుసముద్రం ప్రాజెక్టు వివాదం సమయంలో, రాముడేమైనా ఇంజనీరా అని అడిగిన ఘనుడు కరుణానిధి. వినాయక చవితి నాడు గణపతి విగ్రహాల ఊరేగింపును, నిమజ్జనాలనూ డిఎంకె ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకొంటూనే ఉండేది. అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు తమిళనాడులో ఎటువంటి ప్రత్యేక పూజలూ జరగకుండా అడ్డుపడినది స్టాలిన్ ప్రభుత్వమే.

ఈ పార్టీ నాయకులు ముస్లిం, క్రైస్తవ కార్యక్రమాలకు హాజరవడానికి మాత్రం ముందుంటారు. ఇఫ్తార్ పార్టీలు నిర్వహిస్తారు. ఒకసారి ఒక ముస్లిం సమావేశంలో స్టాలిన్ హిందువుల వివాహ సంప్రదాయాలను అవహేళన చేస్తూ మాట్లాడాడు. స్టాలిన్ ఎప్పుడూ హిందూ ఆలయాలను సందర్శించలేదు. ప్రసాదం, పూర్ణకుంభం, విభూతి తీసుకోలేదు. ఒక నాయకుడి స్మారక సమావేశంలో విభూతి ఇచ్చినప్పుడు దాన్ని కింద పడేసాడు. హిందువుల పండుగలకు ఎప్పుడూ హిందువులకు శుభాకాంక్షలు చెప్పని ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వం. క్రైస్తవ, ముస్లిం పండుగలకు మాత్రం డిఎంకె నాయకులందరూ వరుసలు కట్టి మరీ శుభాకాంక్షలు చెబుతారు.  

అలాంటి నేపథ్యంలో, డిఎంకె ప్రభుత్వం పళని కుమారస్వామి దేవాలయ క్షేత్రంలో రెండు రోజుల సదస్సు నిర్వహించడం విశేషమే. తమ ప్రభుత్వం మీద పడిన ‘హిందూ వ్యతిరేక’ ముద్రను తొలగించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటు చేసిందని ఇట్టే అర్ధమవుతోంది.

తమను తాము హేతువాదులుగా చెప్పుకునే డిఎంకె నేతలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కనిపిస్తున్న ఒకే ఒక కారణం, తమిళనాట ఇటీవల బలమైన శక్తిగా ఎదుగుతున్న బీజేపీని అడ్డుకోవాలని చేసే ప్రయత్నమే. ఆ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు అన్నామలై నాయకత్వంలో బీజేపీ ఓట్‌షేర్ 18శాతం కంటె ఎక్కువ నమోదయింది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ ‘వేల్ యాత్ర’ నిర్వహించారు. దానికి జనాదరణ లభించింది.

ఆ నేపథ్యంలో మొన్నటి శని, ఆదివారాల్లో రెండు రోజుల అంతర్జాతీయ ముత్తమిళ్ మురుగన్ సదస్సును ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వర్చువల్‌గా ప్రారంభించారు. తమ ప్రభుత్వం, ప్రజలు వ్యక్తిగతంగా నమ్మే విశ్వాసాలను ఎంచుకునే స్వేచ్ఛకు అనుకూలమని స్టాలిన్ వర్గం చాటుతోంది. అంతేకాక, తమ ధార్మిక అన్వేషణల్లో సహకరించాలనీ కోరుకుంటోంది.  

ఆ సదస్సు అప్పటికప్పుడు నిర్ణయించుకున్నది కాదు. ప్రభుత్వం వారి హిందూ ధార్మిక, దాతృత్వ, దేవదాయ విభాగం సుదీర్ఘకాలంగా చేసుకుంటూ వచ్చిన అభివృద్ధి పనుల ఫలితమే ఆ సదస్సు నిర్వహణ. తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామి డిఎంకె గురించి ‘‘అవసరం పడితే డిఎంకె చివరికి కావడి కూడా ఎత్తుకుంటుంది’’ అనేవాడు. స్టాలిన్ సర్కారు ఆ మాటను నిజం చేసింది. ‘హేతువాద’ డిఎంకె ప్రభుత్వం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఆ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల నుంచి 2వేల మందిని ఆహ్వానించారు.

ఈ సదస్సు గురించి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తన ‘ఎక్స్’ ఖాతాలో ‘‘గతేడాది వాళ్ళు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ ప్రేలాపనలు పేలారు. ఈ యేడాది వాళ్ళే స్వామి మురుగన్‌కు గొప్ప వేడుక చేస్తున్నారు. ఆ రెండు కార్యక్రమాల్లోనూ దేవదాయ మంత్రి శేఖర్ బాబు పాల్గొన్నారు. ప్రజల ఆగ్రహాన్ని గ్రహించిన వెంటనే డిఎంకె తన చేతిలో ఉన్న రాతను మార్చేస్తుంది. కానీ ఒకటి మరచిపోకండి, ఈ నాటకం అంతటినీ స్వామి మురుగన్ చూస్తూనే ఉన్నారు’’ అని రాసుకొచ్చారు.

ఆ కార్యక్రమానికి స్టాలిన్ వ్యక్తిగతంగా హాజరవకపోవడానికి కారణమేంటని బిజెపి మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ నిలదీసారు. ఇప్పుడు హిందూ ధార్మిక కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఏంటంటూనే, ఆ కార్యక్రమానికి స్టాలిన్, ఉదయనిధి హాజరవకపోవడం ద్వారా హిందూ ధర్మంపై తాము చూపేది కపట ప్రేమ మాత్రమేనని తేలిపోయిందన్నారు.   

మరోవైపు డిఎంకె మిత్రపక్షాలైన విసికె, సిపిఎం, సిపిఐ పార్టీలు మురుగన్ సదస్సు నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని నిందించాయి. ఇలాంటి సదస్సులు తమిళ లౌకిక ఉనికికి బలమే లేకుండా చేస్తాయని ఆరోపించాయి.

Tags: andhra today newsGlobal Muthamizh Murugan conferencePalani HillsSLIDERTamil NaduTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.