Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

స్టాక్‌మార్కెట్లలో రాహుల్‌గాంధీ లాభమెంతో తెలుసా?

గత ఐదు నెలల లాభాలు రూ.46.5 లక్షలు

Phaneendra by Phaneendra
Aug 14, 2024, 03:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

‘‘భారతీయ స్టాక్ మార్కెట్లు నమ్మదగినవి కావు, వాటిలో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం’’ అని బహిరంగంగా ప్రకటన చేసిన ప్రబుద్ధుడు రాహుల్ గాంధీ. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాధ్యతాయుతంగా ఉండవలసిన రాహుల్, అధికార పార్టీపై గుడ్డి వ్యతిరేకతతో దేశ వ్యవస్థల మీద అభాండాలు వేయడం అలవాటుగా మార్చుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలనే లక్ష్యంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న హిండెన్‌బర్గ్ కమిటీ తాజా వివాదాస్పద వ్యాఖ్యలను ఆధారం చేసుకుని రాహుల్ గాంధీ మన దేశీయ మార్కెట్ల మీద నిస్సిగ్గుగా బురద జల్లారు. విదేశీ సంస్థలకు లాభం చేకూర్చి దేశీయ మార్కెట్లను పడగొట్టే కుట్రలో భాగంగా, భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ప్రకటన చేసారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వాచాలతలో భారతీయ పెట్టుబడిదారులను వంచించాలన్న కపటబుద్ధి మాత్రమే బైటపడుతోంది. ఎందుకంటే అదే స్టాక్‌మార్కెట్‌లో రాహుల్‌గాంధీ ఇప్పటికే పెద్దమొత్తంలో వ్యక్తిగత పెట్టుబడులు పెట్టి ఉన్నారు. వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదికను ఆధారం చేసుకుని భారతీయ మార్కెట్ల స్థిరత్వం మీద అనుమానాలు కలగజేసేలా, దేశపు ఆర్థిక ఆరోగ్యం మీద దుష్ప్రచారం చేసేలా మాట్లాడిన రాహుల్ గాంధీ ఆస్తులు స్టాక్ మార్కెట్లలో గణనీయంగా ఉన్నాయి. వాటిమీద గత ఐదు నెలల్లో రాహుల్ గాంధీ ఆర్జించిన లాభాలెంతో తెలుసా? కేవలం రూ.46,49,706 మాత్రమే. మోదీ సర్కారు ఆర్థిక విధానాల ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్లిష్ ట్రెండ్‌లో కొనసాగుతున్నందునే రాహుల్‌గాంధీ ఈ లాభాలు ఆర్జించగలిగారు.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన ఆస్తుల్లో 42శాతం ఆస్తులు ఆయన స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులే, వాటి విలువ రూ.8.3 కోట్లు. అందులో రూ 4.3 కోట్లు షేర్లలోనూ, రూ. 3.8కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లోనూ, రూ 15లక్షలు బంగారం బాండ్స్‌లోనూ ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే ఆయన చరాస్తుల విలువ 2019 నుంచి ఇప్పటికి 59శాతం పెరిగింది. అంటే, ఆయన ప్రశ్నలు సంధిస్తున్న మార్కెట్ల పనితీరుకు ఆ విలువ పెరుగుదలే నిదర్శనంగా ఉంది.  

రాహుల్ గాంధీ పెట్టుబడులు పెట్టిన కొన్ని షేర్ల వివరాలు చూద్దాం…

యంగ్ ఇండియన్: 1900 షేర్లు, విలువ రూ. 190,000

ఆల్కైల్ అమైన్స్: 373 షేర్లు, విలువ రూ. 739,211

ఆసియన్ పెయింట్స్: 1231 షేర్లు, విలువ రూ. 35,29,954

బజాజ్ ఫైనాన్స్: 551 షేర్లు, విలువ రూ. 35,89,407

దీపక్ నైట్రైట్: 568 షేర్లు, విలువ రూ. 11,92,033

డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్: 516 షేర్లు, విలువ రూ.10,43,429

ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్: 211 షేర్లు, విలువ రూ.856,301

దివీస్ ల్యాబొరేటరీస్: 567 షేర్లు, విలువ రూ.19,76,222

గర్వారే టెక్నికల్ ఫైబర్స్: 508 షేర్లు, విలువ రూ.16,43,075

జిఎంఎం ఫాడ్లర్: 1121 షేర్లు, విలువ రూ.14,00,073

హిందుస్తాన్ యూనిలీవర్: 1161 షేర్లు, విలువ రూ.27,02,460

ఐసిఐసిఐ బ్యాంక్: 2299 షేర్లు, విలువ రూ.24,83,725

ఇన్ఫో ఎడ్జ్ ఇండియా: 85షేర్లు, విలువ రూ.445,502

ఇన్ఫోసిస్: 870 షేర్లు, విలువ రూ.14,21,580

ఐటిసి: 3093 షేర్లు, విలువ రూ.12,96,276

ఎల్‌టిఐ మైండ్‌ట్రీ: 407 షేర్లు, విలువ రూ.21,14,100

మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్: 1953 షేర్లు, విలువ రూ.14,95,510

నెస్లే ఇండియా: 1370 షేర్లు, విలువ రూ.35,67,001

పిడిలైట్ ఇండస్ట్రీస్: 1474 షేర్లు, విలువ రూ. 42,27,432

సుప్రజిత్ ఇంజనీరింగ్: 4068 షేర్లు, విలువ రూ.16,65,439

టిసిఎస్: 234 షేర్లు, విలువ రూ.987,305

టైటాన్ కంపెనీ: 897 షేర్లు, విలువ రూ.32,58,980

ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా: 340 షేర్లు, విలువ రూ.12,10,621

వెర్టోజ్ అడ్వర్టైజింగ్: 260 షేర్లు, విలువ రూ.189,085

వినైల్ కెమికల్స్ ఇండియా: 960 షేర్లు, విలువ రూ.324,240

బ్రిటానియా ఇండస్ట్రీస్: 5.5ఎన్‌సిడి, రూ.1559

ఎచ్‌డిఎఫ్‌సి ఎంకాప్ డిపి జిఆర్: రూ.19,58,249

ఎచ్‌డిఎఫ్‌సి స్మాల్‌క్యాప్‌ డిపి జిపిఆర్: రూ. 17,89,032

ఐసిఐసిఐ ఈక్యూ అండ్ డిఎఫ్ డి గ్రోత్: రూ. 19,03,179

పిపిఎఫ్ఎఎస్ ఎఫ్‌సిఎఫ్ డి గ్రోత్: రూ. 19,76,536

ఎచ్‌డిఎఫ్‌సి స్మాల్‌క్యాప్‌ రెగ్-జి: రూ. 1,23,85,545

ఎచ్‌డిఎఫ్‌సి హైబ్రిడ్ డెట్‌ఫండ్-జి: రూ. 79,01,329

ఎచ్‌డిఎఫ్‌సి స్మాల్‌క్యాప్‌ డిపి జిపిఆర్: రూ. 17,89,032

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రెగ్ సేవింగ్స్-జి: రూ.1,02,19,702

సావరిన్ గోల్డ్ బాండ్స్: 220 యూనిట్లు, విలువ రూ.15,21,740

ఆగస్టు 11న హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదికను వెనకేసుకువస్తూ రాహుల్ గాంధీ మాట్లాడడంపై పౌరులు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైనప్పటి నుంచీ రాహుల్ గాంధీ అధికార బిజెపి ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని, అదేపనిగా అయినదానికీ కానిదానికీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. అయితే భారతీయ స్టాక్ మార్కెట్లు రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యల తర్వాత కూడా బలంగానే కొనసాగుతున్నాయి.  

మోదీ మూడోసారి ప్రభుత్వంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గణనీయమైన అభివృద్ధి నమోదు చేస్తున్నాయి. ఇటీవలి నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీ ఎన్నో కొత్త రికార్డులు నెలకొల్పాయి. అయినప్పటికీ మొన్న ఆదివారం నాడు రాహుల్ గాంధీ మళ్ళీ నోరు పారేసుకున్నారు. అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్, సెబి చైర్‌పర్సన్ మీద చేసిన ఆరోపణలను విచారించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేసారు.

భారతదేశపు సెక్యూరిటీస్ నియంత్రణ సంస్థ సెబి సమగ్రత తీవ్రంగా దెబ్బతిందంటూ రాహుల్ ఆరోపణలు చేసారు. ‘‘ప్రతిపక్ష నేతగా మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడం నా బాధ్యత. స్టాక్ మార్కెట్లను పరిపాలించే వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అందువల్ల భారతీయ స్టాక్‌మార్కెట్లు పెద్దముప్పులో ఉన్నాయి’’ అని రాహుల్ ప్రకటించారు.  అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌ను వాడుకుంటూ అక్రమంగా షేర్లను సొంతం చేసుకుని, ధరల్లో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు చేసారు.   

అయితే హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను, రాహుల్ గాంధీ ఆందోళనలను ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. రాహుల్ స్టాక్‌మార్కెట్ల గురించి ఆదివారం వ్యాఖ్యలు చేస్తే, సోమవారం మార్కెట్లలో బెంచ్‌మార్క్ ‌ఇండెక్స్‌లు ఫ్లాట్‌గానే ఉండిపోయాయి. అంటే వాటిపై హిండెన్‌బర్గ్ నివేదిక, రాహుల్ వ్యాఖ్యల ప్రభావం ఏమాత్రం లేదన్నమాట.

Tags: ALLEGATIONSandhra today newsEquitiesHindenburgProfitsRahul GandhisebiShare HoldingsSLIDERstock marketsTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.