Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

ఒలింపిక్స్: డచ్ క్రీడాకారుల బృందంలో, మైనర్ బాలిక రేపిస్ట్

Phaneendra by Phaneendra
Jul 29, 2024, 05:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పారిస్ ఒలింపిక్స్‌లో ఒక నేరస్తుడికి అవకాశం లభించింది. మైనర్ బ్రిటిష్ బాలికపై అత్యాచారం చేసినట్లు నేరం నిరూపణ అయిన నెదర్లాండ్స్ వ్యక్తికి ఒలింపిక్స్‌లో ఆడేందుకు చోటు కల్పించారు. ఆదివారం బీచ్‌వాలీబాల్ మ్యాచ్‌ ఆడడానికి నెదర్లాండ్స్ జట్టులో భాగంగా ‘స్టీవెన్ వాన్ డె వెల్డె’ ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు పెద్దగా అరుపులు కేకలు పెట్టడంతో ఆ విషయం వెల్లడైంది.

స్టీవెన్ వాన్ డె వెల్డె 2014లో, అతనికి 19ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఫేస్‌బుక్‌ ద్వారా బ్రిటన్‌కు చెందిన 12ఏళ్ల  మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె కోసం నెదర్లాండ్స్‌ నుంచి మిల్టన్ కీన్స్ వెళ్ళాడు. అక్కడ వారిద్దరూ కలిసాక ఆమెను మద్యం తాగించాడు. ఆమె మత్తులోకి వెళ్ళిపోయాక ఆమెపై అత్యాచారం చేసాడు.  

కోర్టు విచారణలో అతనికి ఆ బాలిక వయస్సు గురించి తెలుసనీ, అయినప్పటికీ అత్యాచారానికి పాల్పడ్డాడనీ ఋజువయింది. బాలికను రేప్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. 2016లో అతనికి కోర్టు నాలుగేళ్ళ జైలుశిక్ష విధించింది.

వాన్ డె వెల్డె ఇంగ్లండ్ జైల్లో ఒక్క యేడాది మాత్రమే శిక్ష అనుభవించాడు. తర్వాత అతని స్వదేశం నెదర్లాండ్స్ జైలుకు బదిలీ చేసారు. అక్కడ కొన్నినెలల తర్వాత, 2017లో విడుదల చేసారు. ఆ తర్వాత అతను బీచ్‌వాలీబాల్ ఆడడం కొనసాగించాడు. గత నెల డచ్ ఒలింపిక్ టీమ్‌లోకి కూడా ఎంపికయ్యాడు.

నేరం నిరూపణ అయిన రేపిస్టు ఏకంగా తన దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందాడు. కానీ బాధిత బాలిక అప్పటి అత్యాచారపు మానసిక క్షోభ నుంచి ఇప్పటికీ కోలుకోలేదు. తర్వాత ఆమె డ్రగ్స్‌ ఎక్కువగా తీసుకోవడం, ప్రాణాలు తీసుకోడానికి ప్రయత్నించడం వంటి పనులు చేసింది. ఇప్పటికీ ఆమె పరిస్థితి కుదురుకోలేదు.

ఆదివారం ఇటలీ-నెదర్లాండ్స్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్‌ సందర్భంగా వాన్ డె వెల్డె పేరును అనౌన్సర్ ప్రకటించగానే ప్రేక్షకులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో తమ నిరసన వ్యక్తం చేసారు.

నేరం చేసి శిక్ష అనుభవించిన వ్యక్తిని ఒలింపిక్స్‌కు ఎంపిక చేయడాన్ని నెదర్లాండ్స్ నేషనల్ ఒలింపిక్ కమిటీ సమర్థించుకుంది. అతను తన శిక్షను అనుభవించాడనీ, సుదీర్ఘమైన రిహాబిలిటేషన్ ప్రోగ్రాం పూర్తి చేసాడనీ వెల్లడించింది. అతను మళ్ళీ అలాంటి నేరం చేసే అవకాశం లేదని నిపుణులు సైతం చెప్పుకొచ్చారు.

అయితే, నెదర్లాండ్స్ జట్టులో అతన్ని ఎంపిక చేయడాన్ని తప్పుపడుతూ 81వేల మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్‌ పిటిషన్‌ మీద సంతకాలు చేసారు. లైంగిక నేరాలకు పాల్పడిన వారిని ఒలింపిక్స్‌ నుంచి పూర్తిగా నిషేధించాలని వారు డిమాండ్ చేసారు. ఆ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఫెడరేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్స్ విలేజ్‌లో స్టీవెన్ వాన్ డె వెల్డెకు చోటు కల్పించలేదు. నెదర్లాండ్స్ ఒలింపిక్ కమిటీ గ్యారంటీ మీద అతనికి ఒలింపిక్ విలేజ్ బైట ఒక హోటల్లో బస ఏర్పాటు చేసారు.

విచిత్రం ఏమంటే, షార్లొట్ డుజార్డిన్ అనే బ్రిటిష్ క్రీడాకారిణికి ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వలేదు. నాలుగేళ్ళ క్రితం ఆమె తన గుర్రాన్ని 24సార్లు ‘కొరడాతో కొట్టిన నేరానికి’ ఆమెపై విచారణ సాగుతోంది. ఆమె పబ్లిక్ ఫండింగ్‌ను ఆపేసారు. గతంలో ఆమె ఒక చారిటీకి అంబాసిడర్‌గా ఉండేది, దాన్నుంచి కూడా తప్పించారు. ఇక ఈ క్రీడోత్సవాల్లో ఆమెకు అవకాశమే దక్కలేదు. కానీ ఒక రేపిస్టును మాత్రం ఆడనివ్వడంపై క్రీడాప్రేమికులు మండిపడుతున్నారు.

Tags: British Minor GirlConvicted RapistDutch Beach Volleyball TeamParis OlympicsSLIDERSteven Van De VeldeTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.