Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

మహిళల ఆసియాకప్ టి-20లో పాక్‌ను ఓడించిన భారత్

Phaneendra by Phaneendra
Jul 20, 2024, 11:05 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహిళల ఆసియాకప్ టి-20 టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. దాయాది పాకిస్తాన్ జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. శ్రీలంకలోని దంబుల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు ప్రత్యర్ధిని 108 పరుగులకే ఆలౌట్ చేసింది. లక్ష్యఛేదనలో, ఇంకా 35 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించింది.

భారత ఓపెనర్లు షఫాలీ వర్మ (40) (6 ఫోర్లు, 1 సిక్సర్), స్మృతీ మంధాన (45) (9 ఫోర్లు) అత్యుత్తమ ప్రదర్శనతో పాక్ బౌలర్ల భరతం పట్టారు. ఫోర్లు, సిక్సర్లతో కదం తొక్కారు. ఆరో ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ సాధించారు. ఏడో ఓవర్లో స్మృతి ఏకంగా ఐదు బౌండరీలు బాదింది. పదో ఓవర్లో స్మృతి, 12వ ఓవర్లో షఫాలీ ఔట్ అవడంతో పాక్ కొద్దిగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత డయలాన్ హేమలత 14 పరుగులు చేసి ఔట్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ (5నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (6నాటౌట్) ఇన్నింగ్స్‌ పూర్తి చేసి, భారత్‌కు విజయాన్ని కట్టబెట్టారు.  

అంతకుముందు బౌలింగ్ చేసిన పాకిస్తాన్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ రెండో ఓవర్లోనే పూజా వస్త్రాకర్, గుల్ ఫిరోజాను ఔట్ చేసింది. నాలుగో ఓవర్లో ఓపెర్ మునీబా అలీని కూడా పూజా ఔట్ చేసింది. తర్వాత భారత బౌలర్లు ఏ దశలోనూ పాకిస్తానీ బ్యాటర్లను నిలదొక్కుకోనివ్వలేదు. శ్రేయాంక పాటిల్ బౌలింగ్‌లో రియాజ్ ఔట్ అయింది. దీప్తి బౌలింగ్‌లో పాక్ కెప్టెన్ నిడా దర్ హేమలతకు క్యాచ్ ఇచ్చింది. భారత పేసర్ రేణుకా సింగ్ తన ఆఖరి ఓవర్‌లో చివరి రెండు బాల్స్‌కు రెండు వికెట్లు తీసింది. సిద్రా అమీన్, ఇరామ్ జావేద్‌లను వరుసగా పెవిలియన్‌కు పంపించింది. ఆరు వికెట్లు పతనమయ్యాక తూబా హసన్ (22), ఫాతిమా సనా (22నాటౌట్) పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసారు. అయితే 18వ ఓవర్లో దీప్తి బౌలింగ్‌లో తూబా హసన్, రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ వెంటనే సయీదా అరూబ్ షా, నష్రా సంధూ కూడా ఔట్ అయ్యారు. అయితే సయీదా రనౌట్ అవడంతో దీప్తికి హ్యాట్రిక్ దక్కలేదు.

Tags: Deepti SharmaIndia Vs PakistanShafali SinghSLIDERSmriti MandhanaTOP NEWSWomen's Asia Cup T20
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.