Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

పోలీసుల అదుపులో వివాదాస్పద ఐఎఎస్ అధికారిణి తల్లి

Phaneendra by Phaneendra
Jul 18, 2024, 11:19 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇటీవల వివాదాస్పదమైన ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌ను పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆమెను నిర్బంధించారు.

మనోరమ ఖేద్కర్ ఒక రైతును ఆమె తుపాకితో బెదిరిస్తున్న వీడియో కొద్దిరోజుల క్రితం వైరల్ అయింది. పుణే జిల్లా ముల్షీ గ్రామంలో ఒక భూవివాదంలో ఆమె స్థానిక రైతులతో తీవ్రంగా గొడవపడ్డారు. ఆ సందర్భంగా తన దగ్గరున్న తుపాకిని ఒక రైతుమీద ఎక్కుపెట్టి చంపేస్తానని బెదిరించారు. ఒక భూమి తన పేరు మీద ఉందని మనోరమ వాదిస్తుంటే ఒక రైతు దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని డిమాండ్ చేసారు. కోపం పట్టలేని మనోరమ అతన్ని తుపాకితో బెదిరించారు. అయితే ఆ వ్యవహారాన్ని ఎవరో రికార్డ్ చేస్తున్నారని గమనించి, వెంటనే తుపాకిని దాచిపెట్టేసారు. ఆ వీడియో విస్తృత ప్రాచుర్యం పొందడమే కాదు, దాన్ని చూసిన ప్రజలు ఆమె ప్రవర్తనను తప్పుపట్టారు.

వైరల్ వీడియోను చూసిన పోలీసులు రంగంలోకి దిగారు. మనోరమా ఖేద్కర్‌ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన ఆమె భర్త దిలీప్ ఖేద్కర్‌ను కూడా ఎఫ్ఐఆర్‌లో సహనిందితుడిగా చేర్చారు. రాయగఢ్ జిల్లా రాయగఢ్ కోట సమీపంలోని ఒక లాడ్జ్‌లో దాగిఉన్న మనోరమను పుణే పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేసారు.

దిలీప్ ఖేద్కర్ మీద కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వోద్యోగంలో ఉన్నప్పుడు రెండుసార్లు సస్పెండ్ అయ్యారు. లంచాలు వసూలు చేస్తున్న ఆరోపణల మీద 2018, 2020 సంవత్సరాల్లో ఆయనపై రెండుసార్లు సస్పెన్షన్ వేటు పడింది.

పూజా ఖేద్కర్ వివాదాస్పద ప్రవర్తనతో ఆమె కుటుంబం కథ వెలుగులోకి వచ్చింది. 2023 యుపిఎస్‌సి పరీక్షలో 841వ ర్యాంక్ తెచ్చుకున్న పూజా, ఇంకా శిక్షణ దశలో ఉండగానే తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తన యుపిఎస్‌సి అభ్యర్ధిత్వంలో తప్పుడు వివరాలు సమర్పించారన్న ఆరోపణలు వెలుగు చూసాయి.

పూజ ఒబిసి కానప్పటికీ యుపిఎస్‌సి దరఖాస్తులో ఆ రిజర్వేషన్ పెట్టుకున్నారని ఆరోపణలున్నాయి. అలాగే తను శారీరకంగా, మానసికంగా వికలాంగురాలినని కూడా ఆ దరఖాస్తులో పేర్కొన్నారట. ఇంక, ట్రైనీ ఐఎఎస్ దశలో ఉండగానే విఐపి నెంబర్‌ప్లేట్లు వాడడం, సొంత ఆడీ సెడాన్‌ కారుపై ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకోవడం, ఎర్రబుగ్గ పెట్టించుకోవడం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అంతేకాదు, పూజా ఖేద్కర్‌ పేరు మీద మహారాష్ట్రలో ఐదు ప్లాట్లు, రెండు అపార్ట్‌మెంట్లు ఉన్నాయని తేలింది. వాటి విలువ 22 కోట్లు. దాంతో ఆ కుటుంబం ఆర్థిక వ్యవహారాల మీద కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.

Tags: Gun on FarmersManorama DetainedManorama KhedkarPooja KhedkarPune PoliceSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.