Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

వీసీలు వ్యక్తిగత లీగల్ ఖర్చులు తామే భరించాలి: కేరళ గవర్నర్

Phaneendra by Phaneendra
Jul 12, 2024, 04:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేరళ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లు తమ వ్యక్తిగత లీగల్ ఖర్చులను తామే భరించాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు. అటువంటి వ్యక్తిగత అవసరాల కోసం యూనివర్సిటీ నిధులను వాడవద్దని సూచించారు. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తీసుకునే నిర్ణయాలను సవాల్ చేసేందుకు వీసీలు విశ్వవిద్యాలయాల నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ కోసం వ్యయం చేసిన రూ.1.13 కోట్లను రీఇంబర్స్ చేయాలని గవర్నర్ డిమాండ్ చేసారు.

కేరళలో పలు విశ్వవిద్యాలయాలకు వామపక్ష కూటమి ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించింది. అయితే వారి అర్హతలపై వివాదాలు ఉన్న సందర్భాల్లో అటువంటి నియామకాలను రాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. అటువంటి వీసీలు కోర్టుకెక్కారు. వారిలో కన్నూర్ విశ్వవిద్యాలయం మాజీ వీసీ డా. గోపీనాథ్ రవీంద్రన్, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వీసీ డా. రిజీ జాన్, కాలికట్ యూనివర్సిటీ వీసీ డా. ఎంకె జయరాజ్, ఎపిజె అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ మాజీ వీసీ డా.ఎంఎస్ రాజశ్రీ, మలయాళం యూనివర్సిటీ మాజీ వీసీ డా. వి అనిల్‌కుమార్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీసీ డా.కెఎన్ మధుసూదనన్, శ్రీనారాయణ ఓపెన్ యూనివర్సిటీ వీసీ డా.ముబారక్ పాషా ఉన్నారు.

ఇప్పటికే రిటైర్ అయిన గోపీనాథ్ రవీంద్రన్, ఇవాళ రిటైర్ అవుతున్న జయరాజ్ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. వారు తమ లీగల్ ఖర్చులను ప్రస్తుత యూనివర్సిటీ ఖర్చులో చూపించారు. ఆ నేపథ్యంలో గవర్నర్ మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఇవాళ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గోపీనాథ్ రవీంద్రన్ కన్నూర్ యూనివర్సిటీ వీసీగా రిటైర్ అయ్యారు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రియావర్గీస్ అనే ఉద్యోగి నియామకం గురించిన  కోర్టు కేసులో రూ 8లక్షలు ఖర్చుపెట్టారు. ప్రియావర్గీస్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యక్తిగత కార్యదర్శి కెకె రాగేష్ భార్య.  అలా ఒక్కో యూనివర్సిటీ తరఫున ఆయా వీసీలు పెట్టిన లీగల్ ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి

కన్నూర్ విశ్వవిద్యాలయం : రూ. 69,25,340

కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్‌ స్టడీస్ : రూ. 35,71,311

కాలికట్ యూనివర్సిటీ : రూ. 4,25,000

ఎపిజె అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ : రూ. 1,47,515

మలయాళం యూనివర్సిటీ : రూ. 1,00,000

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ : రూ. 77,500

శ్రీనారాయణ ఓపెన్ యూనివర్సిటీ : రూ. 53,000

కేరళలో గవర్నర్‌ను వామపక్షకూటమి ప్రభుత్వం మొదటినుంచీ అవమానిస్తూనే ఉంది. విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాల విషయంలో రాజకీయాలు, అర్హతలూ వివాదాస్పదమైన సందర్భాల్లో గవర్నర్ అటువంటి నియామకాలను ఆమోదించలేదు. దాంతో వారు గవర్నర్‌ పైనే కేసులు వేయడం గమనార్హం. అలాంటి వీసీలు తమ వ్యక్తిగత పోరాటాలకు ప్రజల సొమ్ములు వృథా చేయడాన్ని గవర్నర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడం విశేషం.

Tags: Arif Mohammad Khankerala governorPersonal Legal ExpensesSLIDERTOP NEWSVice Chancellors
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.