Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

అమెరికా అధ్యక్షుడి మతిమరుపు: మిత్రుణ్ణి శత్రువు పేరుతో పిలిచిన బైడెన్

Phaneendra by Phaneendra
Jul 12, 2024, 12:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ శారీరక, మానసిక స్థితిగతులు అదుపు తప్పుతున్నాయి. తాజాగా, తమ దేశపు మిత్రుడిని చిరకాల శత్రువు పేరుతో పిలిచారు. తర్వాత తన పొరపాటును సమర్ధించుకునే ప్రయత్నం చేసినా అది సరిగ్గా కుదరలేదు.

81 ఏళ్ళ జో బైడెన్ గురువారం వాషింగ్టన్‌లో జరిగిన నాటో సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీని పొరపాటున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరుతో సంబోధించారు. అధ్యక్ష పదవికి మరోసారి తన అభ్యర్ధిత్వం ఖరారవడానికి కీలకమైన పాత్రికేయ సమావేశానికి కొన్ని గంటల ముందే బైడెన్ ఈ పొరపాటు చేయడం గమనార్హం.  

నాటో సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పరిచయం చేసే క్రమంలో ఆయన పేరును ‘ప్రెసిడెంట్ పుతిన్’ అని పలికారు బైడెన్. వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. జెలెన్‌స్కీ సైతం ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. పుతిన్ కంటె బైడెనే మెరుగ్గా ఉన్నారని కితాబిచ్చారు కూడా. అయితే, బైడెన్ మానసిక స్థితిపై ఇప్పటికే ఉన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.

రెండువారాల క్రితం ప్రత్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌తో చర్చాగోష్ఠిలో కూడా బైడెన్ ఘోరంగా తడబడ్డారు. అప్పుడే ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే సుదీర్ఘ విమాన ప్రయాణంతో అలసిపోయినందున సరిగ్గా మాట్లాడలేదంటూ బైడెన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అని సంబోధించారు.

తన తప్పు తెలుసుకున్న బైడెన్ మళ్ళీ పోడియం దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చారు. పుతిన్‌ను ఓడించడం గురించే ఆలోచిస్తుండడం వల్ల పొరపాటున అతని పేరే పలికానని చెప్పారు.

అయితే జెలెన్‌స్కీ సహా ఇతర దేశాల నేతలు బైడెన్ పొరపాటును పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కోసారి మాట జారుతూ ఉంటుంది, పెద్దగా పట్టించుకోనక్కరలేదని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ అన్నారు. బైడెన్ దృఢంగానే ఉన్నారని, నాయకత్వానికి సమర్ధులేననీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు.

Tags: Joe BidenLatest GaffeNames ChangedPutinSLIDERTOP NEWSus presidentZelenskyy
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.