Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

విడాకులైన ముస్లిం మహిళలకు భరణం దానం కాదు, హక్కు: సుప్రీం

Phaneendra by Phaneendra
Jul 10, 2024, 01:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విడాకులు పొందిన ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందవచ్చునని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చి చెప్పింది. విడాకులిచ్చిన తన భార్యకు భరణం ఇవ్వాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక ముస్లిం పురుషుడు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

‘‘సదరు అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్నాం. సీఆర్‌పీసీలోని సెక్షన్ 125 కేవలం వివాహిత మహిళలకు మాత్రమే కాక, అందరు మహిళలకూ వర్తిస్తుంది’’ అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేసారు. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులూ విడివిడిగా తమ తీర్పులు ఇచ్చారు. అయితే ఇద్దరూ విడాకులు పొందిన మహిళకు భరణం ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. మహిళలు భరణం పొందడానికి మతంతో సంబంధం లేదని స్పష్టం చేసారు. సెక్షన్ 125 ప్రకారం, తగినంత ఆదాయమున్న వ్యక్తి తన భార్య, పిల్లలు, తల్లిదండ్రుల జీవికకు అవసరమైనంత భరణం చెల్లించడాన్ని నిరాకరించలేడు.

భరణం అనేది దానం కాదనీ, వివాహిత మహిళల ప్రాథమిక హక్కు అనీ కోర్టు స్పష్టం చేసింది. ఆ హక్కుకు మతంతో సంబంధం లేదు. అది లింగ సమానత్వానికి నిదర్శనం, వివాహిత మహిళల ఆర్థిక భద్రతకు భరోసా అని అభిప్రాయపడింది. ‘‘గృహిణి అయిన భార్య తన భర్తపై భావోద్వేగపరంగానూ, ఇతరత్రానూ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని కొందరు భర్తలు తెలుసుకోవడం లేదు. గృహిణిగా భార్య నిర్వర్తించే విధులు, వారు కుటుంబం కోసం చేసే త్యాగాలను భారతీయ పురుషులు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని వ్యాఖ్యానించింది.

తెలంగాణకు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం తన భార్యకు విడాకులిచ్చాడు. ఆ సందర్భంగా ఒక ఫ్యామిలీ కోర్టు అతన్ని తన భార్యకు నెలకు రూ.20వేల భరణం చెల్లించాలని ఆదేశించింది. సమద్ ఆ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసాడు. హైకోర్టు భరణం మొత్తాన్ని రూ.10వేలకు తగ్గించింది. అయితే భరణం ఇవ్వడం అసలు ఏమాత్రం ఇష్టం లేని సమద్, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడు. విడాకులైన ముస్లిం మహిళ 1986 నాటి ముస్లిం మహిళలు (విడాకుల హక్కుల రక్షణ) చట్టం ప్రకారం సహాయం కోరవచ్చుననీ, అంతేతప్ప క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 వర్తించదనీ సమద్ తరఫు న్యాయవాది వాదించాడు. ప్రత్యేక చట్టాలు ఉన్నప్పుడు సాధారణ చట్టం కంటె వాటినే ఆశ్రయించాలని వాదించాడు. అయితే సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ ఆ వాదనతో విభేదించారు. లింగసమానత్వం పాటించే సీఆర్‌పీసీ కింద మహిళలకు లభించే ఊరటను వ్యక్తిగత చట్టాలు తీసివేయలేవని స్పష్టం చేసారు.

ఈ తీర్పు విశిష్టత అర్ధం చేసుకోడానికి 1985 నాటి షాబానో కేసును ఒకసారి తరచి చూడాలి.   ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, మతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ సిఆర్‌పిసి సెక్షన్ 125 వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ తీర్పును పలచన చేయడానికి ప్రత్యేకంగా ముస్లిం మహిళలు (విడాకుల హక్కుల రక్షణ) చట్టం పేరుతో 1986లో చట్టం చేసారు. దాని ప్రకారం ముస్లింమహిళలు ఇద్దత్ వ్యవధిలోనే, అంటే విడాకులైన 90 రోజుల లోపలే భరణం గురించి అడగగలరు. ఆ ఇద్దత్ కాలం దాటిపోతే వారికి భరణం చెల్లించనక్కరలేదు.

1986 నాటి ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటవుతుంది అని సుప్రీంకోర్టు 2001లో స్పష్టం చేసింది. అయితే సదరు విడాకులు పొందిన మహిళ ఆర్థిక స్వావలంబన పొందేవరకూ లేదా మరో పెళ్ళి చేసుకునే వరకూ భరణం చెల్లించాల్సిన బాధ్యత పురుషుడిపై ఉంటుందని చెప్పింది. ఇవాళ్టి తీర్పు, విడాకులైన మహిళకు ఆమె మతంతో సంబంధం లేకుండా భరణం పొందే హక్కు ఉందని మరింత స్పష్టంగా తేల్చిచెప్పింది.

Tags: AlimonyDivorcee Muslim WomenShah Bano CaseSLIDERSupreme CourtTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.