Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

భోజశాలలో ఎఎస్ఐ సర్వే: 1700కు పైగా కళాఖండాలు లభ్యం

Phaneendra by Phaneendra
Jun 28, 2024, 01:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) మధ్యప్రదేశ్‌ ధార్‌లోని భోజశాలలో 97 రోజుల పాటు నిర్వహించిన సర్వే ముగిసింది. ఆ సర్వేలో 1700 కంటె ఎక్కువ కళాఖండాలు లభ్యమయ్యాయి. వాటిలో శిల్పాలు, విగ్రహాలు, స్తంభాలు, కుడ్యచిత్రాలు, తదితర నిర్మాణాలు ఉన్నాయి. ఆ కళాఖండాలు సామాన్యశకం 9-11 శతాబ్దాల్లో పరిపాలించిన పర్మార రాజవంశం నాటివని తెలుస్తోంది. ఈ ఆవిష్కరణలను బట్టి భోజశాలలో పర్మార రాజవంశం కంటె ముందునుంచే, సుమారుగా మొహెంజొదడో నాగరికత సమయం నాటికే గొప్ప కళాసంస్కృతి విలసిల్లిందనే వాదనకు బలం చేకూరుతోంది.

భోజశాల వద్ద ఎఎస్ఐ విస్తృతంగా జరిపిన సర్వేలో ఎన్నో కళాఖండాలు, ఇతరత్రా వస్తుసంచయం బైటపడ్డాయి. అవి ఆ ప్రాంతపు గొప్ప చారిత్రక వాస్తవాలను బహిర్గతం చేస్తున్నాయి. అవేంటంటే….

ఇటుక గోడ: భోజశాలలో లభ్యమైన నిర్మాణాల్లో ప్రధానమైనది ఆలయం గర్భగుడి వద్ద బైటపడిన 27 అడుగుల పొడవైన ఇటుక గోడ. దాని నిర్మాణశైలి పర్మార రాజవంశ కాలం నాటి నిర్మాణశైలికి భిన్నంగా ఉంది. అంతకంటె ముందు మొహెంజొదడో నాగరికత కాలం నాటిదని భావిస్తున్నారు. దాన్ని బట్టి ఆ ప్రాంతపు వయస్సు, విశిష్ఠతల గురించి గతంలోని అంచనాలు మారిపోయాయి.

సాంస్కృతిక, ధార్మిక వైవిధ్యం: భోజశాలలోని కమల్‌మౌలా దర్గా దగ్గర శాసనాలపై కురాన్ పంక్తులు, జైనధర్మానికి చెందిన శిల్పాలు, విగ్రహాలు లభించాయి. దాన్నిబట్టి ఆ ప్రాంతంలో వేర్వేరు మతాల ప్రభావం ఉండేదని తెలుస్తోంది. భోజశాలలో లభ్యమైన ‘యుద్ధానికి సిద్ధమవుతున్న వీరుల కుడ్యచిత్రాల’ను బట్టి ఆ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం ఉందని వెల్లడవుతోంది.

గర్భగుడి, దాని పరిసరాలు: భోజశాలలోని గర్భగుడి దగ్గర తవ్వకాల్లో ప్రాచీనమైన గోడలు, ఇతర నిర్మాణాలూ లభించాయి. వాటిని బట్టి పర్మారుల కాలానికి చెందిన నిర్మాణశైలి, వారు అనుసరించిన మతధర్మాల గురించి తెలుస్తోంది.

మెట్ల కింద గదిలో: వాగ్దేవి, సరస్వతి, హనుమంతుడు, గణపతి వంటి హిందూ దేవతల విగ్రహాలతో పాటు గణనీయమైన సంఖ్యలో కళాఖండాలు లభించాయి. ధార్మిక కార్యక్రమాల్లో ఉపయోగించే శంఖాలు, చక్రాలు వంటివి కూడా లభించాయి.

ఈశాన్య, పశ్చిమ భాగాల్లో: కృష్ణుడు, వాసుకి, శివుడు వంటి దేవతల విగ్రహాలు, పెద్దసంఖ్యలో స్తంభాలు, గోడలు, వాటిమీద చెక్కిన శిల్పాలూ లభించాయి. దాన్నిబట్టి, ప్రాచీన కాలంలో భోజశాల గొప్ప ప్రార్థనా కేంద్రంగా, మతధర్మాలకు ప్రాధాన్యం ఉన్న క్షేత్రంగా, సాంస్కృతిక వినిమయ ప్రదేశంగా ప్రాధాన్యం సంతరించుకున్న ప్రదేశం అని అర్ధమవుతోంది.  

యజ్ఞశాల ప్రాంతంలో: సనాతన ధర్మానికి చెందిన చిహ్నాలు చెక్కిన రాళ్ళు లభ్యమయ్యాయి. దాన్నిబట్టి పర్మార రాజవంశం నాటి కాలంలో ఆ ప్రాంతంలో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేవని స్పష్టమవుతోంది.   

దర్గా ప్రాంతంలో: అక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక భూగర్భ బావి లభించింది.

స్తంభాలు, శిలాశాసనాలు: అక్కడి స్తంభాలపై రసాయన చర్యలు జరిపి చూసినప్పుడు సీతారాముల చెక్కడం వంటి హిందూ పురాణ గాధల్లోని దృశ్యాలూ, ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రమూ వాటిపై చెక్కి ఉన్నాయి.

భోజశాల వద్ద తవ్వకాల 97వ రోజు పురావస్తు సర్వేక్షణ సంస్థ మరిన్ని విశేషాలను కనుగొంది. భోజశాల ఈశాన్య ప్రాంతంలో జాగ్రత్తగా భద్రపరిచిన, నిర్దిష్ట ఆకృతిలో చెక్కిన మూడు రాళ్ళు లభించాయి. నరసింహ అవతారాన్ని పోలిన విగ్రహం, దేవతలను పోలిన చెక్కడాలూ కూడా లభించాయి. వాటి చారిత్రక, సాంస్కృతిక విశిష్ఠతను నిశితంగా పరీక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.     

పురావస్తు సర్వేక్షణ సంస్థ ఎఎస్ఐ, భోజశాలలో కనుగొన్న అంశాల గురించి జులై 2న కోర్టులో నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికపై ప్రజాబాహుళ్యంలోనూ, రాజకీయంగానూ ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. నివేదిక సమర్పించిన తర్వాత జులై 4న కోర్టులో విచారణ ఉంది. పురావస్తు తవ్వకాల విశ్లేషణ ద్వారా వెల్లడి కాబోయే విశేషాల గురించి అన్ని పక్షాలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Tags: 97-day-surveyASIBhojshalaExcavationMadhya PradeshSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.