Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

టి-20 వరల్డ్ కప్: ఇంగ్లండ్‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్న భారత్

శనివారం దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరు

Phaneendra by Phaneendra
Jun 28, 2024, 10:02 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఐసిసి పురుషుల టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. 68 పరుగుల ఆధిక్యంతో గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది.

గయానాలోని గయానా నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయింది. మ్యాచ్ మొదలయే సమయానికి వర్షం పడే సూచనలు ఉండడంతో ఇంగ్లండ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలుపెట్టిన భారత్, ఆరంభంలోనే విరాట్ కోహ్లీ (9), రిషభ్ పంత్ వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ, టూ-డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ జాగ్రత్తగా ఆడి స్కోర్‌బోర్డ్‌ను కదిలించారు. 8వ ఓవర్ తర్వాత వర్షం పడి ఆట కొంత మందగించింది. తర్వాత ధాటిగా ఆడిన రోహిత్ (57), సూర్య (47) కాసేపటికే ఔట్ అయ్యారు. తర్వాత హార్దిక్ పాండ్య 23, రవీంద్ర జడేజా 17, అక్షర్ పటేల్ 10 పరుగులు సాధించారు. శివం దూబే మొదటి బాల్‌కే డకౌట్ అయ్యాడు. మ్యాచ్ చివర్లో రవీంద్ర జడేజాకు అర్ష్‌దీప్ సింగ్ (1) క్రీజ్‌లో తోడుగా నిలిచాడు. మొత్తం మీద భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, మొదట్లో ధాటిగా బ్యాటింగ్ చేసింది. జోస్ బట్లర్ దూకుడుగా ఆడడంతో ఆ జట్టు మొదటి మూడు ఓవర్లలోనే 26 పరుగులు సాధించగలిగింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బట్లర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద  ఔట్ అయ్యాడు. ఇంక అక్కడినుంచీ ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. ఫిల్ సాల్ట్‌ను (5) జస్‌ప్రీత్‌ బుమ్రా ఔట్ చేసాడు. జానీ బెయిర్‌స్టో (0), మొయిన్ అలీ (8) లను అక్షర్ పెవిలియన్ బాట పట్టించాడు. అతనికి కులదీప్ తోడయ్యేసరికి భారత బౌలింగ్ పదును పెరిగింది. కులదీప్ బౌలింగ్‌లో శామ్ కరన్ (2) హారీ బ్రూక్ (25), క్రిస్‌ జోర్డాన్ (1) గ్రౌండ్ విడిచిపెట్టారు. లియామ్ లివింగ్‌స్టన్ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యాడు. 21 పరుగులు చేసిన జోఫ్రా ఆర్చర్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆదిల్ రషీద్ (2) సూర్యకుమార్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. రీస్ టోప్లే 3 పరుగులతో క్రీజ్‌లో ఒంటరిగా నిలిచాడు. మొత్తంగా ఇంగ్లండ్ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులుకు ఆలౌట్ అయింది.

రెండో సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2022 టి20 టోర్నీలో సెమీఫైనల్లోనూ భారత్-ఇంగ్లండ్ తలపడ్డాయి. అప్పుడు కూడా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 169 రన్స్ చేస్తే, ఆ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే సాధించింది. ఆనాటి ఓటమికి భారత్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

శనివారం రాత్రి 8 గంటలకు కెన్సింగ్‌టన్ ఓవల్ గ్రౌండ్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.   

Tags: ICC Mens T20 World CupIndia into FinalsIndia vs EnglandSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.