Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

విస్తృత అధ్యయనం, పరిశీలనల నేపథ్యం నుంచి ‘హిందుత్వం’

Phaneendra by Phaneendra
Jun 27, 2024, 12:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

“Essentials of Hindutva” పేరుతో ప్రముఖ స్వాతంత్ర్యవీరుడు వినాయక దామోదర సావర్కర్ వ్రాసిన చిన్న పుస్తకం ఒక అద్భుతమైన రచన. ఆయన గాక మరొకరు ఎవరూ వ్రాయలేని గ్రంథం. ఆయన అందులో మనకు అందించిన అంశాలను ఎలా కూర్చుకొని, ఎలా పేర్చి మనకు అందించాడన్నది మరొక అద్భుతమైన విషయం. ఆ వ్యక్తిత్వం అద్భుతం, ఆ రచన అద్భుతం, ఆ కూర్పు అద్భుతం.

మహారాష్ట్రలోని కొంకణ తీరంలో పెరిగిన సావర్కర్ చిన్నవయస్సులోనే తోటివారిని జతకలుపుకొని ఎన్నెన్నో కార్యకలాపాలు సాగిస్తూ ఉండేవాడు. రచనలు చేస్తూ ఉండేవాడు. (అవన్నీ ఇక్కడ చెప్పటం లేదు. వాటిని తెలుసుకొనటం కోసం ఆయన జీవిత చరిత్ర గ్రంథాన్ని చూడండి) ఆ తర్వాత బారిష్టర్ పట్టా పొందటం కోసమని లండన్‌కి చేరుకొన్నాడు. ఇండియాహౌస్‌లో మకాం. గ్రంథాలయానికి వెళ్ళి గ్రంథాలను, ఆంగ్లేయుల రికార్డులను (ఉత్తర ప్రత్యుత్తరాలను) క్షుణ్ణంగా పరిశీలించి 1857 The First War of Independence గ్రంథం రచించాడు. అయితే ముద్రింపబడకముందే నిషేధింపబడింది ఆ గ్రంథం. మదన్‌లాల్ ఢీంగ్రా వంటి యువకిశోరాలను ప్రేరేపించి దేశమాత సేవలో అతిచిన్నవయసులో బలిదానం కావటం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపినప్పుడు యావత్ప్రపంచం నివ్వెరపోయింది. ఆ తర్వాత లండన్లో అరెస్టు చేయబడిన సావర్కర్ హిందూదేశానికి తీసుకొని రాబడినాడు. విచారణ తంతు తర్వాత రెండు యావజ్జీవ కారాగారవాస శిక్షలు (25+25 = మొత్తం 50 సం||లు) విధింపబడి అండమాన్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌లోని సెల్యులర్ జెయిల్‌కి తరలింపబడి ఒక దశాబ్దంపాటు అత్యంత దుర్భరమూ, కఠినమైన జీవనం గడిపిన వాడాయన.

వీటిని ఇక్కడ ప్రస్తావించడం ఎందుకంటే – ఈ గ్రంథం 1923లో మొదటిసారి ప్రచురించబడింది. అప్పటికి ఆయన పోర్ట్ బ్లెయిర్‌నుండి రత్నగిరికి తరలింపబడినాడు. గ్రంథానికి తుదిరూపం రత్నగిరిలో లభించినా అండమాన్‌లోని సెల్యులర్ జెయిల్‌లోనే ఆయన మనస్సులో దీనికి ఒక రూపం ఇచ్చి ఉంటారు. ఒక చురుకైన విద్యార్థిగా తాను పాఠశాలలో, కళాశాలలో చదివిన విషయాలు – వాటిలోని అసమగ్రత, లండన్‌లో న్యాయశాస్త్రం చదువుతూ పాశ్చాత్య ప్రపంచంలో జాతి గురించి ఉన్న కల్పనలు గ్రహించటం, వేర్వేరు దేశాలకు చెందినవారితో కలిసి సంభాషించటం ద్వారా జాతీయత గురించిన కల్పనలోని లోతులు గ్రహించటము, అండమాన్‌లోని జైలుజీవిత సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకొని రాబడిన ఖైదీలను పరిశీలించటం, వారితో సంభాషించటం ద్వారా హిందూదేశంలో ప్రజల మధ్య వైవిధ్యాలను అవగతం చేసుకోవటం – ఈ నేపథ్యంలోంచి వినాయక దామోదర సావర్కర్ ఈ గ్రంథాన్ని రచించారు.

(వినాయక దామోదర సావర్కర్ రచన ‘ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ’కు బొమ్మరాజు సారంగపాణి అనువాదం ‘హిందుత్వం’ 26 జూన్‌ 2024న విడుదలైంది. ఆ పుస్తకానికి ‘జాగృతి’ పూర్వ సంపాదకులు వడ్డి విజయసారథి రాసిన మున్నుడిలోని భాగం)

Tags: Book ReleaseEssentials of HindutvaSLIDERTelugu TranslationTOP NEWSVinayak Damodar Savarkar
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.