Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

తమిళనాడులో అరుదైన విష్ణుమూర్తి లోహ విగ్రహం లభ్యం

Phaneendra by Phaneendra
Jun 26, 2024, 04:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడులోని తిరువారూరు జిల్లా మన్నార్‌గుడి చేరువలో ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా జూన్ 23న ఒక అరుదైన విష్ణుమూర్తి విగ్రహం లభించింది. అది లోహవిగ్రహం కావడం విశేషం.

నటరాజన్ అనే వ్యక్తి తన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. అందులో భాగంగా ఒక గొయ్యి తవ్విస్తున్నప్పుడు అక్కడ లోహ విగ్రహం బైటపడింది. ఆ విషయాన్ని పోలీసులకు, జిల్లా కలెక్టర్‌కు తెలియజేసారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, పోలీస్ ఇనస్పెక్టర్ వేలాయుధం ఆ స్థలానికి వెళ్ళి విగ్రహాన్ని పరిశీలించారు. అది పెరుమాళ్ అనబడే విష్ణుమూర్తి విగ్రహం అని నిర్ధారించారు. దాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు.

పెరుమాళ్ విగ్రహం ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. సుమారు 5 కిలోగ్రాముల బరువు ఉంది. పెరుమాళ్ మూర్తి చుట్టూ తోరణం లాంటి నిర్మాణం (తిరువచ్చి) ఉంది. ప్రాథమిక పరీక్షల అనంతరం అది చోళుల తర్వాతి కాలానికి చెందినది అయి ఉంటుందని భావిస్తున్నారు. సుమారుగా 12వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహం అయి ఉండొచ్చని అంచనా వేసారు.  

ఈ విగ్రహం దొరికిన స్థలం ప్రాచీన గోపియార్ కోలప్రళయం మహర్షి ఆలయానికి చేరువలో ఉంది. దాంతో ఆ ప్రాంతానికి సనాతనధర్మపరంగా ఉన్న ప్రాధాన్యతకు మరో నిదర్శనం లభించినట్లయింది. ఆ విగ్రహం గురించి మరిన్ని వివరాలను, దాని చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోడానికి పురావస్తు శాఖ ఆ ప్రాంతంలో పరిశోధనలు చేయనుంది. అంతేకాదు, ఆ ప్రదేశానికి దగ్గరలోనే వెయ్యేళ్ళ ప్రాచీనమైన రాజగోపాలస్వామి దేవాలయంలో కొన్నాళ్ళుగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అలాంటి చోట పెరుమాళ్ పురాతన పంచలోహ విగ్రహం బైటపడడం భక్తులకు ఆనందోత్సాహాలు కలగజేస్తోంది.

తిరువారూరు జిల్లాలో ఇటువంటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిధులు లభించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల పాపనాశం క్షేత్రానికి చేరువలో కోలిరాయన్‌పేట్టై గ్రామంలో చోళుల కాలానికి చెందిన పలు పంచలోహ విగ్రహాలు, ఇతర కళాఖండాలూ లభించాయి. ఈ యేడాది ఏప్రిల్‌ నెలలో ఇదే జిల్లాలోని పెరుమాళకరం గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా రామచంద్రమూర్తి ప్రాచీన విగ్రహం లభించింది.

తిరువారూరు ఒకప్పుడు తంజావూరు జిల్లాలో భాగం. చోళుల రాజ్యంలో ప్రధానమైన ప్రాంతం. దక్షిణాది ధాన్యాగారం అనే పేరు కూడా ఉంది. పురావస్తువుల పరంగా, సాంస్కృతిక వారసత్వం పరంగా ఈ ప్రాంతం చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags: Archaeological SignificanceMaharishi TempleRare Vishnu IdolSLIDERTamil NaduTiruvarur districtTOP NEWS
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.